చ‌ర‌ణ్‌.. ప్లీజ్ వ‌ద్దమ్మా..

రామ్ చ‌ర‌ణ్ హీరోగా మెరుపు అనే సినిమా మొద‌లైంది గుర్తుందా…???  ధ‌ర‌ణి ద‌ర్శకుడు. కొన్ని సీన్స్ కూడా తీశారు. ఆ త‌ర‌వాత ఎందుకో ఆ సినిమా అర్థాంత‌రంగా ఆగిపోయింది. ఆప్లేస్‌లోనే ర‌చ్చ వ‌చ్చింది. ఇప్పుడు…

రామ్ చ‌ర‌ణ్ హీరోగా మెరుపు అనే సినిమా మొద‌లైంది గుర్తుందా…???  ధ‌ర‌ణి ద‌ర్శకుడు. కొన్ని సీన్స్ కూడా తీశారు. ఆ త‌ర‌వాత ఎందుకో ఆ సినిమా అర్థాంత‌రంగా ఆగిపోయింది. ఆప్లేస్‌లోనే ర‌చ్చ వ‌చ్చింది. ఇప్పుడు అదే ద‌ర్శకుడితో మ‌ళ్లీ జ‌త క‌ట్టడానికి చ‌ర‌ణ్ మొగ్గు చూపిస్తున్నాడ‌ని స‌మాచార‌మ్‌. మాంచి యాక్షన్ థ్రిల్లర్ ఉంటే చెప్పు.. త‌ప్పకుండా చేద్దాం అని చ‌ర‌ణ్ ధ‌ర‌ణిని అడిగాడ‌ట‌. 

ధ‌ర‌ణి కూడా సంతోషంగా ఎగిరి గంతేశాడ‌ట‌. ఈసారి చ‌ర‌ణ్‌ని ఎలాగైనా త‌న క‌థ‌తో మెప్పిస్తాన‌ని ధీమా వ్యక్తం చేస్తున్నాడు చ‌ర‌ణ్‌. మెరుపు ఎందుకు ఆగిపోయిందో చ‌ర‌ణ్‌కి తెలుసు. కేవ‌లం క‌థ న‌చ్చక‌పోవ‌డం వ‌ల్లే ఆ సినిమాని మ‌ధ్యలోనే వ‌దిలేయాల్సివ‌చ్చింది. మ‌ళ్లీ అదే ద‌ర్శకుడితో జ‌త క‌ట్టడం అంటే.. చేసిన త‌ప్పు మ‌ళ్లీ చేయ‌డ‌మే అంటున్నారు చిరు ఫ్యాన్స్‌. మ‌రి చ‌ర‌ణ్ ఎందుకు టెమ్ట్ అవుతున్నాడో త‌న‌కే తెలియాలి.​