డిస్ట్రిబ్యూటర్ గా మారుతి

మారుతి దర్శకత్వంలో క్లీన్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా రెడీ అయింది ‘భలేభలే మగాడివోయ్’ సినిమా. నాని, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు వున్న స్పెషాలిటీ ఏమిటంటే గీతాఆర్ట్స్,…

మారుతి దర్శకత్వంలో క్లీన్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్ టైన్ మెంట్ మూవీగా రెడీ అయింది ‘భలేభలే మగాడివోయ్’ సినిమా. నాని, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు వున్న స్పెషాలిటీ ఏమిటంటే గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించడం. ఈ రెండు సంస్థలకు పంపిణీ వ్యాపారాలున్నాయి.

అందుకే ఈ సినిమాను అటు ఉత్తరాంధ్ర, ఇటు గుంటూరు, అలాగే మరి కొన్నిప్రాంతాలు యువి క్రియేషన్స్ పంపిణీ చేస్తోంది. ఈస్ట్, వెస్ట్, నైజాం, మరి కొన్ని ఏరియాలు గీతా తీసుకుంది. పనిలో పనిగా తన సినిమా మీద నమ్మకంతో దర్శకుడు మారుతి కూడా కృష్ణా జిల్లాకు హక్కులు తీసుకున్నాడట.

నిర్మాణ వ్వవహారాలు మారుతికి అలవాటే. ఈరోజుల్లో సినిమాకు కొంతవరకు కృష్ణాజ్లిల్లా పంపిణీలో వేలు పెట్టాడు. ఇప్పుడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ డ్ డిస్ట్రిబ్యూటర్ గా మారి, కృష్ణాజిల్లాలో తన సినిమాను పంపిణీ చేస్తున్నాడు. కాస్త మతిమరుపు వున్న ప్రేమికుడిగా నాని ఈ సినిమాలో నవ్వులు పంచనున్నాడు. సెప్టెంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది.