డైరెక్టర్ శంకర్ సినిమాలు అంత తక్కువ బడ్జెట్లో పూర్తి కావనే సంగతి తెలిసిందే. ప్రతి చిత్రాన్ని హై లెవల్లో తెరకెక్కించే శంకర్ ఇప్పుడు విక్రమ్‌తో తీస్తున్న మనోహరుడు (ఐ) కూడా తనదైన శైలిలో భారీగా తీస్తున్నాడు. దీంతో ఈ చిత్రం బడ్జెట్ అంచనాలని మించిపోయిందని సమాచారం. భారీ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కూడా ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడట.
అయితే ఈ ప్రాజెక్ట్‌ని టేకోవర్ చేసుకోవడానికి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సిద్ధంగా ఉందని, డీల్ కుదిరితే త్వరలోనే ఈ సినిమా చేతులు మారుతుందని సమాచారం. ఇప్పటికే రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మనోహరుడు ఇంకా పూర్తి కాలేదు. అపరిచితుడు కంటే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో, చాలా గ్రాండ్‌గా ఈ చిత్రం ఉంటుందట.
అపరిచితుడు తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా చేయలేకపోయిన విక్రమ్ దీంతో మరోసారి తనేంటో నిరూపించుకుంటాడని, శంకర్ పేరు ప్రఖ్యాతుల్ని ఈ చిత్రం ద్విగుణీకృతం చేస్తుందని కోలీవుడ్ సర్కిల్స్ అభిప్రాయ పడుతున్నాయి. అయితే ఆస్కార్ రవిచంద్రన్ స్థాయి నిర్మాతే దీనిని పూర్తి చేయలేక చేతులెత్తేసాడంటే… ఆ బడ్జెట్ రికవర్ కావాలంటే ఇదెంత పెద్ద హిట్ అవ్వాలో ఏమిటో?