సాధారణంగా ఇద్దరు వ్యక్తులు, లేదా భార్యాభర్తలు విడిపోయారు అంటే ఎవరో ఒకరిదో, లేదా ఇద్దరిదో తప్పు వుండడం సహజం. ఎవరైనా అలాగే భావిస్తారు కూడా. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయారు..లేదా విడివిడిగా వుంటున్నారు. కలివిడిగి వుంటూ పెళ్లి చేసుకోకుండా కాలం గడిపేసిన వారు, రాజకీయ పరిస్థితులు తోసుకురావడంతో వివాహం చట్టబద్ధం చేయకతప్పలేదు. ఆ తరువాత విడిపోక తప్పలేదు.
మనస్పర్థలు, బేధాభిప్రాయాలు అన్నవి కామన్. అయితే పవన్ విషయంలో జనం ప్రత్యేకంగా ఎందుకు చూస్తారంటే రెండు కారణాలు. ఒకటి ఆయన సెలబ్రిటి. రెండవది మొదటి భార్యతో సరిపడక రెండో పెళ్లి, రెండో భార్యతో సరిపడక మూడో పెళ్లి చేసుకోవడం. ఒకరికి ఇద్దరితో సరిపడక మూడో పెళ్లికి వెళ్లాల్సి వచ్చిందంటే సహజంగా తప్పు, అతనిదే అయి వుండాలని జనం అనుకుంటారు. ఎందుకంటే తొలి అనుభవంతోనే తనకు ఎలాంటి వారితో నప్పుతుందో తెలిసి, రెండో పెళ్లి చేసుకుని వుండాలి కదా.మరి అక్కడా ఎందుకు తేడా కొట్టింది? అన్న చర్చ వస్తుంది.
పైగా ఇప్పుడు రేణు దేశాయ్ చాలా కాలం తరువాత హైదరాబాద్ వచ్చారు. మీడియాను కలిసారు.తన సినిమా గురించి మాట్లాడితే ఓకె. కానీ పర్సనల్ ఇంటర్వూలు ఇచ్చారు. ఈ ఇంటర్వూలను బట్టి తేలిందేమిటంటే, ఇద్దరు పిల్లలు ఆమె సంరక్షణలో వున్నారని. సుమారు ఎనిమిదళ్ల పాప, పదేళ్ల బాబు. మరోకటి ఆ పిల్లల వ్యవహారాలు పూర్తిగా ఆమె చెప్పు చేతల్లోనే వున్నాయని. పైగా హైదరాబాద్ అన్నా, ఇక్కడకు రావాడం అన్నా రేణకు చాలా ఇష్టంగా వుందని.
సాధారణంగా మనకు ఎవరితో సరిపడతో, అలాంటి వారు వుండే ప్రాంతానికి దూరంగా వుండాలని అనుకుంటాం. కానీ అవతలి వాళ్లకు సరిపడక, మనకు ఇష్టమైతే దగ్గరగానే వుండాలని అనుకుంటాం. రేణు మాటలు ఈ రెండో విధంగానే వున్నాయి. తరచు రేణు చేస్తున్న ట్వీట్ లు, ఇప్పుడు ఇంటర్వూలలో ఆమె చెబుతున్న మాటలు పరిశీలిస్తే, పవన్ అంటే ఆమెకు ఇంకా ప్రేమ, గౌరవం ఏ మాత్రం తరిగిపోలేదని, అతనంటే ఇష్టం పోలేదని స్పష్టం చేస్తున్నాయి. మరి అలాంటపుడు ఆమె అతనికి ఎందుకు దూరం జరిగినట్లు? పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునో, తీసుకోకనో ఎందుకు వేరు కావడానికి అంగీకరించినట్లు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వారు చెబితే కానీ తెలియవు. కానీ రేణు వ్యవహారాలు పరిశీలిస్తున్న జనానికి, ఆమె సమాచారం చదువుతున్న వారికి మాత్రం ఇక్కడ తప్పు పవన్ దే అన్న అభిప్రాయం కలుగుతోంది. కామన్ మాన్ దృష్టిలో..'పాపం ఆవిడ మంచిదాన్లాగే వుంది. భర్త గురించి ఇంకా మంచికగానే మాట్లాడుతోంది..' అన్న సాఫ్ట్ కార్నర్ వస్తోంది. బహుశా పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, ఇద్దరితో సరిపడకపోవడం ఆయనకు నెగిటివ్ పాయింట్లుగామారి వుండొచ్చు.
అసలు సవాలక్ష జంటల్లో ఓ జంట వ్యవహారాన్ని ఇంతలా తరచి చూడాల్సిన అవసరం ఏమిటంటే..వారు సెలబ్రిటీలు కావడమే. అదీ పవన్ లాంటి పవర్ స్టార్ కావడమే. అది తప్పు కాదు. వారు జనాల్లో సంపాదించుకున్నఅభిమానం అలాంటిది.