పబ్లిసిటీ అవసరం తెలిసి వచ్చింది – మహేష్

సినిమాకు ప్రచారం ఏ మేరకు అవసరం అన్న విషయంలో రియలైజ్ అయ్యానని, అందుకే శ్రీమంతుడు సినిమాకు నెల ముందుగా పబ్లిసిటీ స్టార్ట్ చేసామని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. శ్రీమంతుడు విజయవంతంగా ప్రదర్శితమవుతున్న…

సినిమాకు ప్రచారం ఏ మేరకు అవసరం అన్న విషయంలో రియలైజ్ అయ్యానని, అందుకే శ్రీమంతుడు సినిమాకు నెల ముందుగా పబ్లిసిటీ స్టార్ట్ చేసామని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. శ్రీమంతుడు విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా మహేష్ బాబు, తన సహనటులు రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నవీన్ తదితరులతో కలిసి మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమంతుడు సినిమా తన కెరీర్ ది బెస్ట్ అని అన్నారు. అన్ని విధాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిన సినిమా ఇదే అన్నారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ స్క్రిప్ట్, బెస్ట్ కలెక్షన్లు ఇలా అన్నింటా ఇదే ది బెస్ట్ అని ఆయన అన్నారు. ఇలాంటి సినిమా ఇచ్చిన కొరటాల శివకు జస్ట్ సింపుల్ గా థాంక్స్ చెప్పడం తప్ప మరేమీ చేయలేనని, కానీ థాంక్స్ అన్నది ఏ మాత్రం సరిపోదని ఆయన అన్నారు.

తాను నిర్మాత కావడం వల్ల ప్రచారంపై ఎక్కువ దృష్టి పెట్టలేదని, సినిమాకు పబ్లిసిటీ అవసరం గుర్తించి, ఆ విధంగా ప్లాన్ చేసామని అన్నారు. అయితే ఊరికినే సినిమా చూడమని ఊదరగొట్టలేదని, సినిమా సబ్జెక్ట్ ఇదీ, ఇందుకోసం మీరు చూడాలి అని, మీడియాతో ఇంట్రాక్ట్ అయిన ప్రతి ఒక్కరు చెప్పామని, అదే వర్కవుట్ అయిందని అన్నారు. తనకు తెలిసి శ్రీమంతుడు హండ్రెడ్ పర్సంట్ ఫ్లా లెస్ స్క్రిప్ట్ అని , అయితే కొరటాల శివ అలా అని చెప్పుకోరని, మహేష్ అన్నారు. ఎక్కడా ఎటువంటి లోపం లేని స్క్రిప్ట్ ఇది అని ఆయన చెప్పారు. 

సినిమా ప్రారంభానికి ముందే తన బావ జయదేవ్ వచ్చి బుర్రిపాలెం దత్తత తీసుకుంటే బాగుంటుందని అన్నారని, అయితే అప్పుడే పనులు మొదలు పెడితే, సినిమా కోసం చేసారని అంటారని, ఊరుకున్నామని, ఇప్పుడు ప్రారంభిస్తామని అన్నారు. ఈసినిమా గురించి చాలా ప్రశంసలు అందాయని, అయితే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ' నీ కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ చేసావ్' అనడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

అలాగే ఎన్నడూ లేనిది తన సోదరుడు రమేష్ బాబు స్వయంగా బొకే కొని ఇంటికి వచ్చి ఇచ్చారని, తన కొడుకు గౌతమ్ థియేటర్ లో సినిమా చూసాడని, కూతురు సితార కు పాటల లిరిక్స్ అన్నీ కంఠతా వచ్చని మహేష్ చెప్పారు. కొరటాల శివ కథ చెప్పినపుడే చాలా హ్యాపీగా ఫీలయ్యానని, అన్ని విషయాలు ఓ కథలో వుండడం చాలా రేర్ అని ఆయన అన్నారు.

పోకిరి తరువాత చాలా సినిమాలు చేసా, లుంగీ కట్టమని అడిగినా కట్టలేదు. కానీ ఈ సినిమాలో అది బాగుంటుందని, కట్టానని, కట్టి నడవడానికి కాస్త ఇబ్బంది పడినా, బాగా వచ్చిందని అన్నారు. రిలీజ్ ముందు టెన్షన్ తో వారం రోజులు పడుకోలేదని, ఇప్పుడు సక్సెస్ తో వారం నుంచీ నిద్ర పట్టడం లేదని ఆయన అన్నారు. 

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ, హానెస్ట్ గా అందరం ఓకే విధంగా ఆలోచించి పనిచేస్తే ఫలితం ఎలా వుంటుందో తెలిసిందని అన్నారు. తమ ప్రాంతాల్లో జనాలు ఎక్కడకు వెళ్లినా సైకిల్ మీద వెళ్లడం, బస్ ల మీద సైకిళ్లు వేయడం తెలుసు అని, అదే ఇందులో జోడించా అని అన్నారు. తన సినిమా హండ్రెడ్ పర్సంట్ ఫ్లాలెస్ నా కాదా అన్నది ఇప్పుడు ఆలోచించేలా లేనని, ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నా అని ఆయన అన్నారు. 

నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, చాలా కాలం తరువాత తెలుగు సినిమా ట్రెండ్ మార్చే చిత్రం వచ్చిందని, సినిమాలో హీరోను చూసి, నాలుగు మంచివిషయాలు నేర్చుకోవచ్చు అనే తరహా సినిమాలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. మహేష్ చాలా ఇన్వాల్వ్ కావడమే కాకుండా, అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చేసారన్నారు. 

నటుడు జగపతి బాబు మాట్లాడుతూ, కొరటాల శివ చాలా జాగ్రత్త పడ్డారని, దాంతో తనను రిచ్ డాడీ అంటున్నారని, లేకుంటే పిచ్ డాడీ అనేవారని అన్నారు. 

నిర్మాత నవీన్ మాట్లాడుతూ ఎన్నో వ్యవహారాలు చూసానని, కానీ శ్రీమంతుడు నిర్మాణం తను జీవితంలో మరిచిపోలేని విషయమని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు.