కొత్త జంటకు రెండు సెకండాఫ్ లు?

సురేష్, అరవింద్ ఈ రెండు కాపౌండ్ లలోకి వెళ్లిన స్క్రిప్ట్ లు వారి చిత్తానికి మారిపోతాయని టాలీవుడ్ లో ఏ అసిస్టెంట్ లేదా అసోసియేట్, కాదూ అంటే  మరే దర్శకుడిని అడిగినా ఆఫ్ ది…

సురేష్, అరవింద్ ఈ రెండు కాపౌండ్ లలోకి వెళ్లిన స్క్రిప్ట్ లు వారి చిత్తానికి మారిపోతాయని టాలీవుడ్ లో ఏ అసిస్టెంట్ లేదా అసోసియేట్, కాదూ అంటే  మరే దర్శకుడిని అడిగినా ఆఫ్ ది రికార్డ్ అంగీకరిస్తారు. వారికే జనం పల్స్ తెలుసు అన్నది అరవింద్, దగ్గుబాటి  సురేష్ ల నమ్మకం. ఇష్టమైతే వాళ్లు చెప్పినట్లు చేయడం లేదంటే సినిమా వదులుకోవడం ఇవే మార్గాలు. తాజాగా దర్శకుడు మారుతి కూడా ఈ సమస్య ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.మారుతి యూనిట్ లో పనిచేసిన ఓ అసిస్టెంట్ అందించిన వివరాల ప్రకారం,  ముందు కొత్తజంట స్క్రిప్ట్ ను మారుతికి వదిలేసాడు ముందు అరవింద్.

దాంతో తాను అనుకున్నట్లు తీసేసాడు. తీరా సినిమా పూర్తయ్యాక, అరవింద్ సెకండాఫ్ మొత్తం పక్కన పడేయించినట్లు బోగట్టా. తాను చెప్పిన విధంగా మళ్లీ మొత్తం రీ షూట్ చేయించినట్లు వినికిడి. అందువల్లే సినిమాకు ఎక్కువ కాల్షీట్లు ఖర్చు కావడమే కాకుండా, నాలుగు కోట్లతో అయ్యేది అయిదున్నర వరకు చేరింది ఖర్చు. ఇంతకీ మారుతి సెకండాఫ్ ఏమిటంటే, కొడుకు వైఖరి తెలుసుకుని, అతగాడిని మార్చమని అతగాడికి పరిచయం లేని, మరదలు వరసయ్యే మధురిమను పంపిస్తుంది. మధురిమ అమలాపురం నుంచి ఆకుకూరలు అమ్మేదాని మాదిరిగా వస్తుంది. 

నిజానికి ఆమె హైదరాబాద్ లో ఎంబిఎ స్టూడెంట్. కానీ ఆమె కూడా తనకు తెలియకుండా కొంత వరకు శిరీష్ ను ప్రేమిస్తుంది. క్లయిమాక్స్ లో అత్తతో ఆ విషయం ప్రస్తావిస్తుంది. బావను స్వార్థపరుడు అన్నావు కానీ, నువ్వు కూడా నీ స్వార్థం కోసం ఓ ఆడపిలను అని కూడా చూడకుండా నన్ను నాటకం ఆడమని పంపావు అని. అదే విధంగా రెజీనా కూడా వందకోట్ల కుర్రాడు అని తెలిసి తాను కూడా ప్రేమ వల వేస్తుంది. ఈ పాయింట్లన్నింటితో సెకండాఫ్ పకడ్బందీగా వుంటే, దాన్ని పక్కన పడేసి,రోటీన్ సీన్లను ప్యాచ్ అప్ప చేయించారంటే ఏమనుకోవాలి? సినిమా తక్కువ బడ్జెట్, రిటర్న్ బాగానే వుంది కాబట్టి, ఓకె. అదే బలైపోతే, దర్శకుడి భవిష్యత్ బోల్తాయే కదా? మరి అరవింద్, సురేష్ లాంటి వాళ్లు ఈ విషయాలు ఎప్పుడు తెలుసుకుంటారో?