ఎన్టీఆర్, రామ్‌చరణ్, బాలకృష్ణ, నాగార్జున.. ఇలా స్టార్సందరూ ఓటేశారు. కానీ అందరిలోనూ ఒకటే ప్రశ్న. మరి మహేష్ బాబు ఎక్కడ?? ఎక్కడా కనిపించలేదు ఎందుకని?? అని ఆరా తీస్తున్నారు. మహేష్ ఓటు తెలంగాణ పరిధిలోనే ఉంది. ఆయన కూడా రాజధాని ఓటరే. కానీ.. ఓటు వేయలేదు. కారణం ఏమిటో తెలుసా?? ఓటరు జాబితాలో మహేష్ పేరు లేదట.
మహేష్ బాబు కూడా అందరిలా బుధవారం ఉదయమే ఓటింగ్ కేంద్రానికి వెళ్లాడట. కానీ జాబితాలో తన పేరు లేదట. దాంతో షాక్‌కి గురై.. వెనక్కి వచ్చేశాడట. పాపం.. సూపర్‌స్టార్ కి ఓటు లేదిక్కడ. ఈసీ ప్రమోటర్ బ్రహ్మానందానికీ ఓటు లేదట. ఆయన కూడా తెల్లమొహం వేసుకొని వెనక్కి వెళ్లిపోయారు.
స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లు ఓటేస్తే… దాని ప్రభావం చాలా ఎక్కవుగా ఉంటుంది. ఓటు హక్కు వినియోగించుకోవాలన్న స్ఫూర్తి, ఉత్సాహం యువతలో కలుగుతుంది. అందుకే ఓటు విషయంలో స్టార్లు కాస్త ముందు జాగ్రత్త వహించాల్సివుంది. ఓటు హక్కు ఉందో లేదో.. ఒక్కసారి చెక్ చేసుకోవాల్సివుంది.