అబ్బే.. అఖిల్ లేడు

మ‌నంలో అఖిల్ కూడా ఉన్నాడ‌న్న సంగ‌తి తెలిసిన‌ప్పటి నుంచీ అక్కినేని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. న‌లుగురు అక్కినేని కథానాయ‌కుల్ని ఒకేసారి తెరపై చూసుకోవ‌చ్చు.. అనుకొంటున్నారు. అయితే ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీ ఇంకా డౌటేన‌ట‌.…

మ‌నంలో అఖిల్ కూడా ఉన్నాడ‌న్న సంగ‌తి తెలిసిన‌ప్పటి నుంచీ అక్కినేని అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. న‌లుగురు అక్కినేని కథానాయ‌కుల్ని ఒకేసారి తెరపై చూసుకోవ‌చ్చు.. అనుకొంటున్నారు. అయితే ఈ సినిమాలో అఖిల్ ఎంట్రీ ఇంకా డౌటేన‌ట‌.

ఈ సినిమాలో అఖిల్ క‌నిపిస్తాడు గానీ.. న‌టించ‌డం లేద‌నే కొత్త టాక్ వినిపిస్తోంది. విచిత్రంగా ఉంది క‌దూ..! అవును.. ఈ సినిమాలో అఖిల్ ఉన్నాడు… కానీ లేడు. అదెలా అంటే మ‌నం ప‌తాక స‌న్నివేశాల్లో అఖిల్ బొమ్మ మాత్రం చూపిస్తార‌ట‌. నాగేశ్వర‌రావు చిన్నప్పటి ఫొటో రూపంలో అఖిల్ క‌నిపిస్తాడ‌ట‌. అంతే. ఆ పాత్రకు డైలాగులు లేవు, క‌ద‌లిక‌లు అంత‌కంటే లేవు. 

అఖిల్ కూడా ఈ సినిమాలో క‌నిపిస్తే బాగుణ్ణు.. అని నాగేశ్వర‌రావు కోరిక మేర‌కు ఈ చిన్ని ప్రయ‌త్నం చేశార‌ట‌. అఖిల్ ఎంట్రీ పూర్తి స్థాయిలో జ‌ర‌గాలని, చిన్నా చిత‌కా పాత్రల‌తో చేయిస్తే బాగోదు అని నాగ్ భావించ‌డం వ‌ల్లే అఖిల్‌కి మ‌నం సినిమాలో చోటు ద‌క్కలేద‌ట‌.