పొడ‌వ‌డం కంటే పొగ‌డ్డం డేంజర్‌

1). జ‌గ‌న్ దేవుడి ల‌క్ష‌ణాలున్న మ‌నిషి – మంత్రి నారాయ‌ణ‌స్వామి -పొడ‌వ‌డం కంటే పొగ‌డ్డ‌మే డేంజ‌ర్‌ Advertisement 2). మ‌హిళా ప్రేక్ష‌కుల విన్న‌పం -ప‌వ‌ర్‌క‌ట్‌తో కార్తీక దీపాన్ని ఆర్ప‌కండి 3). మంత్రికి ఒక పెద్దాయ‌న…

1). జ‌గ‌న్ దేవుడి ల‌క్ష‌ణాలున్న మ‌నిషి – మంత్రి నారాయ‌ణ‌స్వామి -పొడ‌వ‌డం కంటే పొగ‌డ్డ‌మే డేంజ‌ర్‌

2). మ‌హిళా ప్రేక్ష‌కుల విన్న‌పం -ప‌వ‌ర్‌క‌ట్‌తో కార్తీక దీపాన్ని ఆర్ప‌కండి

3). మంత్రికి ఒక పెద్దాయ‌న హిత‌వు -ప్ర‌మాణ స్వీకారం, స్వాగ‌తం, వూరేగింపులు ముగిసాయి. ఇక‌నైనా ప‌నులు మొద‌లు పెట్టండి

4). దెబ్బ‌కు దెబ్బ -ఎమ్మెల్యే బాబూరావు -ఓల్డ్ టైటిల్‌, కొంచెం కొత్త‌గా పెట్టండి

5). ఎఫ్‌3లో వెంకీకి రేచీక‌టి, వ‌రుణ్‌కి న‌త్తి -అనిల్ రావిపూడి -మాకు సుత్తికాకుండా చూసుకోండి

6). శ్రీ‌లంక‌లో కొత్త మంత్రివ‌ర్గం -మంత్రుల‌తో చింత‌కాయ‌లు రాల‌వు

7). ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడుః కొత్త సినిమా టైటిల్‌ -మ‌రి ప్రేక్ష‌కులు కూర‌గాయ‌లా?

8). కొండ‌చిలువ వాన‌పాములా క‌నిపించ‌డ‌మే రాజ‌కీయం

9). తెలంగాణా ఖ‌జానా ఖాళీ -ఖ‌జానా వున్న‌ది ఖాళీ చేయ‌డానికే క‌దా!

10). నేను రాజ‌కీయాలు చేయ‌ను -గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై -రాజ‌కీయాలు చేయ‌ని రాజ్‌భ‌వ‌న్లు దేశంలో ఎక్క‌డైనా వున్నాయా?

జీఆర్ మ‌హ‌ర్షి