సలార్ 2 ఇక వెనక్కేనా?

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ సరైన లైనప్ కోసం చూస్తున్నారు

సలార్ సినిమా నిర్మాతలు ఎంత వత్తిడి చేసినా, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు టేకప్ చేసే సినిమా ఎన్టీఆర్ దే అని గతంలోనే ‘గ్రేట్ ఆంధ్ర’ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.

మైత్రీ సంస్థ ఈ నెల 9న పూజా కార్యక్రమం నిర్వహించబోతోంది. అయితే ఈ కార్యక్రమం కేవలం యూనిట్ కే పరిమితమా? లేక సినిమా ప్రముఖుల మధ్య జ‌రుగుతుందా అన్నది తెలియాల్సి వుంది.

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ సరైన లైనప్ కోసం చూస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కొరటాల శివతో దేవర అనే సినిమా రెండు భాగాలుగా చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ ఆ సినిమా కన్నా కూడా ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారన్నది వాస్తవం తెలుగు యంగ్ టాప్ హీరోలు అంతా పాన్ ఇండియా డైరక్టర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరు దొరుకుతారా అని వేటాడుతున్నారు. ప్రశాంత్ నీల్ అలాంటి దర్శకుల్లో ఒకరు.

సలార్ నిర్మాతలు ఎలాగైనా సలార్ 2 ను స్టార్ట్ చేయించాలనే ప్రయత్నంలో వున్నారు. కానీ ప్రభాస్ ఇప్పటికే కల్కి 2, హను రాఘవపూడి, రాజాసాబ్ సినిమాలతో బిజీగా వున్నారు. అందువల్ల సలార్ నిర్మాతలు గట్టిగా వత్తిడి చేసి ప్రశాంత్ నీల్ ను కట్టడి చేయలేరు. అందుకే ఎన్టీఆర్ తో సినిమాకు మార్గం సుగమం అయింది. ఈ లెక్కన సలార్ 2 సినిమా 2026 లో మొదలవుతుందేమో?

8 Replies to “సలార్ 2 ఇక వెనక్కేనా?”

  1. స్టార్ల సినిమాలకు ఏళ్లకు ఏళ్ళు పడుతుంటే మొన్న ఓ చోటా నటుడి సినిమా వారం వ్యవధి (?)లో రెండు సినిమాలు వచ్చాయి.ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు ఏడాదికి 10నుంచి 18సినిమాలు చూపించేవారు.ఇప్పుడు రెమ్యూనరేషన్ కోసం స్టార్లు (!)సినిమాలు చేస్తున్నారు.క్రమేణా వీళ్ళ టైమ్ అయిపోయినా ఆశ్చర్య పొనక్కర్లేదు.

Comments are closed.