ఎమ్బీయస్‌కు ‘సాహితీవేత్త’ ఎవార్డు

గ్రేట్ ఆంధ్ర డాట్‌కామ్ కాలమిస్టు శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్‌ ఆగస్టు 3న శాంతా-వసంతా ట్రస్టు నుంచి ‘డా. వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం’ (2024) అందుకున్నారు.

గ్రేట్ ఆంధ్ర డాట్‌కామ్ కాలమిస్టు శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్‌ ఆగస్టు 3న శాంతా-వసంతా ట్రస్టు నుంచి ‘డా. వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం’ (2024) అందుకున్నారు. ‘పద్మభూషణ్’ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు డా. వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా-వసంతా ట్రస్టు 2020 సం.రం నుంచి ప్రతీ ఏటా ‘డా.వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం’, ‘శ్రీ కోడూరు వేంకట రమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారం’ యిస్తూ వస్తోంది. లక్ష రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం యిచ్చి వారిని తెలంగాణ సాహిత్యపరిషత్తు వేదికగా సత్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు శ్రీయుతులు తిరుమల శ్రీనివాసాచార్య, ఎల్లూరి శివారెడ్డి, కె. శివారెడ్డి, వేటూరి ఆనందమూర్తిలకు సాహితీవేత్త పురస్కారాన్ని, శ్రీయుతులు జె చెన్నయ్య, తాడేపల్లి పతంజలి, సి.మృణాళినిలకు సేవారత్న పురస్కారాన్ని యివ్వడం జరిగింది.

ఈ ఏడాది సాహితీవేత్త పురస్కారాన్ని శ్రీ ఎమ్బీయస్ ప్రసాద్‌కు, సేవారత్న పురస్కారాన్ని శ్రీ గంధం బసవ శంకరరావు గారికి ప్రకటించారు. వృత్తి రీత్యా సైంటిస్టు అయిన శంకరరావు తంజావూరు, తిరుపతిలలో తాళపత్రాలను పరిశోధించి అన్నమయ్య 289 కొత్త సంకీర్తనలను వెలుగులోకి తెచ్చారు. వేటూరి ఆనందమూర్తిగారు సేకరించిన మరో 89 పదాలను కలుపుకుని వారిద్దరి సంయుక్త సంపాదకత్వంలో శాంతా-వసంతా ట్రస్టు సౌజన్యంతో రెండు సంపుటాలుగా ప్రచురిస్తే తిరుపతి తిరుమల దేవస్థానం వారికి వాటిని అప్పగించడం జరిగింది. అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, దేవాలయాలలో శంకరరావు అన్నమయ్య సంకీర్తనలపై సోదాహరణ ప్రసంగాలు చేయటమే కాకుండా పలు విశ్వవిద్యాలయాలకు పరిశోధనా పత్ర సమర్పణలు చేశారు, ఆకాశవాణిలో ప్రసంగాలు చేశారు. ‘అన్నమయ్య సంకీర్తన వేదం’ పేర యూట్యూబ్ మాధ్యమంగా వీరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

ఇక ఎమ్బీయస్ ప్రసాద్, ఆంగ్లాంధ్రాలలో కథారచయిత, పలు విషయాలపై వ్యాసరచయిత. అనువాదకుడు, సంకలనకర్త, సంపాదకుడు, గ్రేట్ఆంధ్ర వెబ్‌సైట్‌లో శీర్షికా నిర్వాహకుడు. శాటిలైట్ రేడియో జాకీ, టీవీ యాంకర్‌. వీరు వ్రాసిన అనేక కథలు బహుమతుల నందాయి. వందలాది కథలు, వేలాది వ్యాసాలు రాశారు. ఇప్పటివరకు 30 పుస్తకాలు, 30 ఈ-బుక్స్ వెలువడ్డాయి. వీరి సాహితీవ్యవసాయం బహుముఖాలుగా సాగింది. కాస్త విపులంగా చెప్పాలంటే – కథారచయితగా… * 1973 నుండి రకరకాల జానర్లలో 200కు పైగా తెలుగు స్వతంత్ర కథలు, ఇంగ్లీషు, హిందీల నుంచి అనువాదాలు చేశారు. వీటిలో హాస్య, సరస, క్రైమ్, జనరల్ కథలతో పాటు అద్భుత రసానికి చెందిన కథలు కూడా ఉన్నాయి. ‘‘స్వాతి’’ వీక్లీ కథల పోటీలలో చాలాసార్లు ప్రథమ బహుమతులు పొందారు. రెండు క్రైమ్ నవలలు ప్రచురించ బడ్డాయి. * ఇంగ్లీషులో స్వతంత్రంగా కథలు రాసే అతి కొద్దిమంది తెలుగువాళ్లలో వీరొకరు. వీరు రాసిన 10కి పైగా ఆంగ్ల కథలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఎలైవ్‌, విమెన్స్‌ ఎరా, ఏపి టైమ్స్‌ లలో ప్రచురితమయ్యాయి.

నాన్-ఫిక్షన్ రచయితగా.. * వివిధ సబ్జక్టులపై దాదాపు 5 వేల వ్యాసాలు, కొన్ని సీరీస్ రాశారు. * ప్రస్తుత రాజకీయాలపై సహస్రాది వ్యాసాలతో పాటు * రాజకీయ చరిత్ర విభాగం కింద ‘‘హిస్టరీ మేడీజీ’’ ‘‘రాజీవ్‌ హత్య’’, ‘‘గోడ్సేని ఎలా చూడాలి?’’, ‘‘తమిళ రాజకీయాలు’’, ‘‘నిజాం కథలు’’, ‘‘ఎమర్జన్సీ ఎట్‌ 40’’ సీరియల్స్‌ రాశారు. * మత విషయాలపై ‘పురాణ పరామర్శ’ ‘బైబిల్ కథలు’ రాశారు. లలితకళల విషయానికి వస్తే * సాహిత్యరంగంలో అనేక పుస్తకాలను, కథలను పాఠకులకు పరిచయం చేసి ‘పుస్తక పరామర్శ’, ‘నవలా పరామర్శ’, ‘కథా పరామర్శ’ పుస్తకాలను వెలువరించారు. * తెలుగు, హిందీ, ఇంగ్లీషు సినీ కళాకారులపై అనేక వ్యాసాలు రాశారు, రాస్తున్నారు. * కొన్ని తెలుగు సినిమా కథల మూలరచనలపై ‘‘సినీమూలం’’ సీరియల్ రాస్తున్నారు. పిల్లలకోసం డా॥ డూలిటిల్‌ ఇంగ్లీషు సినిమాను తెలుగులో నవలగా రాశారు. * ప్రఖ్యాత సినీదర్శకుడు గుణశేఖర్‌ ‘‘రుద్రమదేవి’’ సినిమా కథాపరిశోధనా బృందంలో పని చేశారు. ‘‘తలైవి’’ స్క్రిప్టు రచనలో పాలు పంచుకున్నారు.

జీవితచరిత్ర కారుడిగా – * పడక్కుర్చీ కబుర్లు పేర తెలుగు సినీ ప్రముఖులపై సంక్షిప్త జీవితచరిత్రలు చాలా రాశారు. * హిందీ నటగాయకుడు కిశోర్‌కుమార్‌, ప్రాణ్‌, హేమమాలినిలపై పుస్తకాలు రాశారు. దేవ్ ఆనంద్ పై ప్రస్తుతం సీరియల్ రాస్తున్నారు. *ప్రముఖ పత్రికా సంపాదకుడు వినోద్ మెహతా జీవిత చరిత్ర కూడా రాశారు. అనువాదకుడిగా ఈయన కృషి గురించి చెప్పాలంటే – * గంగాధర్‌ గాడ్గీళ్‌ ‘‘బండోపంత్‌’’ కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. * పి జి ఉడ్‌హౌస్‌, డరోతి పార్కర్‌, అగాథా క్రిస్టి వంటి ప్రఖ్యాతుల కథలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి, ముళ్లపూడి వెంకటరమణ రచనలను తెలుగునుండి నుండి ఇంగ్లీషుకి అనువదించారు. కాలమిస్టుగా – ప్రస్తుతం గ్రేట్‌ ఆంధ్రా డాట్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌లో ప్రస్తుత రాజకీయ, సామాజిక, సాహిత్య అంశాలపై ‘‘ఎమ్బీయస్‌ కబుర్లు’’ అనే శీర్షికను 2009 నుండి నిర్వహిస్తున్నారు.

సంకలనకర్తగా, సంపాదకుడిగా – * బాపు-ముళ్లపూడి రమణల ‘‘బొమ్మా-బొరుసూ’’ (1995)కై రమణగారి రచనలను సేకరించారు. * 8 సంపుటాల ‘ముళ్లపూడి సాహితీ సర్వస్వం’ (2000-2006)కు సంకలనం, సంపాదకత్వం, ముందుమాట వీరిదే. * ‘‘బాపురమణీయం’’ ద్వితీయ ముద్రణకు సంపాదకత్వం* బాపు-రమణల ‘‘కోతికొమ్మచ్చి’’ సీరీస్‌ పుస్తకప్రచురణలో ముఖ్యభూమిక. పత్రికా సంపాదకుడిగా – స్టేటుబ్యాంకు ఆఫీసరు ఉద్యోగం నుండి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి ‘‘హాసం’’ పత్రిక (2001-2004)కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా పని చేశారు. శాంతా బయోటెక్నిక్స్‌లో కార్పోరేట్ కమ్యూనికేషన్స్‌ విభాగానికి కన్సల్టెంటుగా ఉన్నారు. ప్రచురణా నిర్వహణ – హాస్య-సంగీత అంశాలతో ‘‘హాసం’’ పత్రిక నిర్వహణ, ఆ పై ‘‘హాసం’’ ప్రచురణలకు (ఇప్పటి వరకు 40 పుస్తకాలు) సంచాలకుడు, హైదరాబాద్ ‘హాసం క్లబ్’ కు సంధానకర్త.

రేడియో జాకీగా – 2005 నుండి శాటిలైట్‌ రేడియో ‘‘వరల్డ్‌స్పేస్‌’’లో స్పందన తెలుగు రేడియో స్టేషన్‌లో వారంవారం ‘పడక్కుర్చీ కబుర్లు’ కార్యక్రమంలో రెండేళ్లపాటు వివిధ విషయాలపై ప్రసంగించారు. ‘‘కోతికొమ్మచ్చి’’ ఆడియో పుస్తకానికి స్వరదాతల్లో ఒకరు. డా. మోహన్ కందా స్వీయచరిత్ర ‘‘మోహన మకరందం’’ ఆడియో వెర్షన్‌కు గాత్రదానం చేశారు. టీవీ యాంకర్‌గా – ఇతర భాషా చిత్రాలనుండి స్ఫూర్తి పొందిన తెలుగు సినిమా రచయితలు తెలుగు వెర్షన్‌కు ఏ విధంగా మెరుగులు దిద్దారో వివరించే ‘‘ఇదీ అసలు కథ’’ కార్యక్రమం రచన, వాయిస్‌ ఓవర్‌, యాంకరింగ్‌ వనితా టీవీ ద్వారా సమర్పించారు. ఈ కార్యక్రమం 2009 రజత నంది ఎవార్డు గెలుచుకుంది.

పురస్కారాలు, బహుమతులు – * తెలుగు యూనివర్శిటీ నుండి హాస్యరచయితగా ‘కీర్తి పురస్కారం’, (2009) * హాస్యరచయితగా ఆంధ్రసారస్వత సమితి, మచిలీపట్నం (2011) ఉగాది పురస్కారం * ఢిల్లీ తెలుగు ఎకాడమీ, 2014 ఉగాది పురస్కారం, * తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) వారిచే 2015లో లండన్‌లో సన్మానం, * 2009లో బాపు-రమణలచే సన్మానం * 50 ఏళ్ల సాహిత్య సేవకై ‘‘జర్నలిస్టు డైరీ ఎఛీవర్స్ ఎవార్డ్’’, 2023 * 2024, జూన్ 28న శోభా ఇంటర్నేషనల్ ఎకాడెమీ వారిచే ‘‘ముళ్లపూడి ఎవార్డు’’.

ఆగస్టు 3 నాటి సభలో అధ్యక్షోపన్యాసం చేసిన తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి, ప్రశంసాపత్రం చదివి, సభను నిర్వహించిన ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య, ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కెవి రమణాచారి ఐఏఎస్ (రి) డా. వరప్రసాద్ రెడ్డి శాంతా బయోటెక్ ద్వారా దేశానికి ఖ్యాతి తేవడంతో పాటు శాంతా-వసంతా ట్రస్టు తరఫున అనేక సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను చేపట్టడాన్ని శ్లాఘించారు, అవార్డు గ్రహీతల అర్హతలను, గుణగణాలను ప్రశంసించారు. వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ యికపై ఎవార్డులను ఏడాదికి రెండు సార్లు యిచ్చే ఆలోచన ఉందని చెప్పారు. సన్మానం, సత్కారం, సతీసమేతంగా వేదపండితుల ఆశీర్వచనం అందుకున్న గ్రహీతలు చివరిలో తమ స్పందనలను సదస్యులతో పంచుకున్నారు. (ఫోటో – సన్మానించబడుతున్న ప్రసాద్ దంపతులు, నిలబడినవారు – శ్రీ శంకరరావు, శ్రీ ఎల్లూరి శివారెడ్డి, శ్రీ కెవి రమణాచారి, శ్రీమతి వసంత, శ్రీ వరప్రసాద్, శ్రీ జె. చెన్నయ్య – ఇన్‌సెట్‌లో స్పందన తెలుపుతున్న ప్రసాద్)

41 Replies to “ఎమ్బీయస్‌కు ‘సాహితీవేత్త’ ఎవార్డు”

  1. శుభాభినందనలు గురువుగారు!

    మంచిని కూడా మంచిగా చూడలేని పచ్చ కామెర్ల వ్యక్తుల మధ్య,

    సంబంధం లే!ని వక్ర రాతలు రాసే వ్యక్తుల మధ్య వున్నాము.

    వక్ర రాతలు తీసేసి మంచి పని చేస్తున్న మో(డరే)టర్.

    1. టీడీపీ వాళ్ళ చేతిలో కుక్కసావు సచ్చిన 35 మంది పేర్లు, ఊర్లు చెప్పండయ్యా..

      అర్జెంటు గా టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేసేసి.. రాష్ట్రం లో శాంతి ని నెలకొల్పుతాము…

      ఇంతకీ.. నీ జగన్ రెడ్డి కి శవం దొరికినా కదిలి రాలేదేమి..

      రావా.. కదలి రావా.. బెంగుళూరు నుండి నంద్యాల కి కదలి రావా..

      అంటూ రాగం ఎత్తుకుంటే .. మీ స్వామి ఉప్పెన లా ఉత్తుంగ తరంగమై వచ్చేస్తాడేమో.. ట్రై చేయకపోయారా.. లోకనాధం గారు..

    2. మీకు పచ్చ కామెర్ల జబ్బు వున్నట్లు వున్నది.ప్రతిదీ కూడా పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని చూడకండి,ఈ వయస్సులో .

      కుదరకపోతే మంచి మానసిక డాక్టర్ గారికి చూపించుకోండి.

      పెద్దవారు కాబట్టి, కాస్త కమ్మ కులం , కాపు కులం పట్ల మీకు వున్న ద్వేషం నీ తగ్గించుకుని వయస్సు లో చివరి దశలో వున్నారు కాబట్టి మంచి దృష్టి నీ అలవాటై చేసుకోండి. ద్వేషం మిమ్మల్నే తిని పారేస్తుంది . షుగర్ వ్యాది లాగ. మీ ద్వేషం కి మీరే భద్యులు.

  2. బహుముఖ ప్రజ్ఞాశీలి,జనమెరిగిన జర్నలిస్ట్ మా అభిమాన కాలమిస్ట్, తాటస్థ విశ్లేషకులు, మంచి కథకులు ప్రసాద్ గారికి అభినందనలు.

    1. నేను అర్థరాత్రి ఒంటిగంటకు కామెంట్స్ పెట్టినా.. ఓపిగ్గా లేచి డిలీట్ చేసేసి పడుకొనేలా ఉన్నాడు..

      నా కామెంట్స్ అన్ని డిలీట్ చేసేస్తూ ఉంటాడు.. నయా నీలి సాహితీవేత్త..

  3. ఎవరన్న పిలిచి ఈయనకి ఎవార్దు ఇచ్చరు అంటె, ఆ అవార్దు పరపతి ఇట్టె అర్ధమవుతుంది.

  4. Congrats, MBS! You deserve the Sahithi Sevaratna Award for your storytelling skills. However, you are weak in political analysis, and I dislike it when you write and support the fearful and dishonest Jagan.

  5. ఉత్తమ సాహితీవెత్త!! అదిరింది అయ్యా!

    .

    ఎవరన్న పిలిచి ఈయనకి అవార్దు ఇచ్చారు అంటె, ఆ అవార్దు పరపతి, స్తాయి ఇట్టె అర్ధమవుతుంది.

    1. అవార్డు సంస్థ వర ప్రసాద్ గారు మంచి వ్యక్తి.

      కుల భావన నీ దాటిన మనిషి.

      వారికి దురుద్దేశం ఆపాదించడం తగదు.

      రచయిత గారి పొలిటికల్ దృక్పథం మనకి నచ్చక పోయిన సరే.

      రచయత ప్రసాదు గారు వర్క్స్ లో పొలిటికల్ కేవలం 10 శాతం మాత్రమే. మిగతా హాస్యం, సాహిత్య, మ్యూజిక్ అంశాల్లో మంచి వర్క్స్ చేసారు వారు.

  6. పోలిటికల్ గా జగన్ అనుకూల భావజాలం వ్యక్తపరిచిన కూడా (బహుశా గ్రేట్ ఆంధ్ర యజమాని జగన్ అనుకూల పరుడు కావడం వల్లనేమో) లేదా సహజంగా కాంగ్రెస్ పార్టీ అనుకూల పరుడు కావడం అయిన కానీ , పొలిటికల్ వర్క్స్ పట్ల విభేదం వున్న కూడా నాన్ పొలిటికల్ కంటెంట్ పట్ల చాలా అభిమానులు వున్నారు.

  7. యే రచయిత కైన కూడా ఇలాంటి సత్కారాలు మంచి శక్తి నీ ఆనందం ప్రోత్సాహం కలిగిస్తాయి.

    ఈ కొత్త ఉత్సాహం తో మీ యొక్క సహజమైన ఉత్సుకత వున్న అంశాల లో కొత్త రచనలు చేస్తారు అని , మంచి ఆరోగ్యం తో కొనసాగాలి అని కోరుకుంటూ న్నాను.

  8. కనీసం తెలుగు భాష, సాహిత్యం గురించిన “అవార్డు” గురించి రాసేటపుడైన , కాస్త టైటిల్ లో అక్షర దోషాలు (ఏవార్డు) లేకుండా చూసుకోండి. అదే వారికి ఇచ్చే కనీస గౌరవం.

    భాష పట్ల గౌరవం వున్న వారికి మనస్సు చివుక్కు మంటది, ఇలాంటివి చూసినపుడు.

Comments are closed.