కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణతాల వియ్యంకుడు!

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరుని పార్టీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. Advertisement అనకాపల్లి మాజీ ఎమెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వియ్యంకుడు…

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థి పేరుని పార్టీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

అనకాపల్లి మాజీ ఎమెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వియ్యంకుడు అయిన పీలా గోవింద సత్యనారాయణ పేరుని పార్టీ ఆమోదించింది అని అంటున్నారు.

వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ఢీ కొట్టడానికి కూటమి పీలాను తెర పైకి తెచ్చింది. స్థానిక సంస్థల కోటా ద్వారా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు విశాఖ రూరల్ జిల్లాలోనే ఉన్నాయి. దాంతో రూరల్ జిల్లా నుంచి పీలాను ఎంపిక చేయడం ద్వారా గెలుపుని సొంతం చేసుకోవచ్చు అన్నది కూటమి ఎత్తుగడగా కనిపిస్తోంది.

పీలా సైతం అంగబలం అర్ధబలం ఉన్న వారు కావడం, అనకాపల్లి ప్రాంతంలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉండడంతో పాటు బీసీ వర్గాలలో పలుకుబడి కూడా ఉపకరిస్తుందని భావిస్తున్నారు. గవరలకు న్యాయం చేసినట్లు అవుతుందని కూడా కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు.

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులలో గవరలు, బీసీలు ఎక్కువగా ఉండడంతో రాజకీయంగా ఈ నిర్ణయం లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీలా పేరుని నిర్ణయించారు.

దీంతో బొత్స వర్సెస్ పీలాగా ఎమ్మెల్సీ ఎన్నికల జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఈ నెల 6న విడుదల చేయనున్నారు. 13వ తేదీ వరకూ నామినేషన్ల ఘట్టం కోసాగనుంది. పోలింగ్ ఈ నెల 30న జరగనుంది.

వైసీపీ అయితే ఈ ఎన్నికల్లో గెలవడం ఖాయమని అంటోంది. బొత్స వైసీపీ ప్రజా ప్రతినిధులు అందరినీ కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు.

7 Replies to “కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణతాల వియ్యంకుడు!”

  1. బొత్స గాడికి పూర్తిగా క్షవరం చేసేసి వదిలేలా ఉన్నాడు జగన్ రెడ్డి..

    ఒకప్పుడు అసెంబ్లీ లో జగన్ రెడ్డి ని, ఇజయమ్మ ని తిట్టినందుకు.. ఇలా కక్ష తీర్చుకొంటున్నాడు జగన్ రెడ్డి.

      1. వై నాట్ 175 నుంచి నాకు ప్రతిపక్ష హోదా కావాలి… నాకు కొత్త కార్ కావాలి… నాకు సెక్యూరిటీ కావాలి దాకా వచ్చావ్ – నీ అహంకారానికి దేవుడు ఇచ్చిన బహుమానం లెవెన్ అన్న !!

  2. Whynot 175 గోవింద, whynot ప్రతిపక్ష నేత గోవింద, ఇప్పుడు చివరికి Whynot MLC. గోవిందా గోవింద.

Comments are closed.