షర్మిల విమర్శలు తెలంగాణ మీదనే!

రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఒకే సమయంలో రాజకీయం చేసే నేతలు అయితే ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఆ క్రెడిట్ వైఎస్సార్ తనయ షర్మిలకు దక్కింది. అందుకే ఆమెను ఈడ పిల్ల కాదు ఆడపిల్లగానే…

రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఒకే సమయంలో రాజకీయం చేసే నేతలు అయితే ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఆ క్రెడిట్ వైఎస్సార్ తనయ షర్మిలకు దక్కింది. అందుకే ఆమెను ఈడ పిల్ల కాదు ఆడపిల్లగానే చూస్తున్నారు. ఆ మాట షర్మిల కూడా స్వయంగా చెప్పుకున్నారు కాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా అదే అంటున్నారు.

వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే షర్మిల మీద ఇటీవల కాలంలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. అందులో సెటైర్లు కూడా బోలెడు ఉంటాయి. కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఏపీలో వరదల గురించి మాట్లాడారా లేక తెలంగాణ గురించి మాట్లాడారా అని గుడివాడ పెద్ద డౌటే వ్యక్తం చేశారు

ఆమె ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారో ఎవరి మీద విమర్శలు చేస్తున్నారో తెలియడం లేదు అని అన్నారు. ఎందుకంటే ఆమె గత ఐదేళ్లు షర్మిల తెలంగాణలో తిరిగారని గుర్తు చేశారు. ఆమె సరిగ్గా ఎన్నికలకు ముందే ఏపీలో అడుగుపెట్టారని చెప్పారు.

అందుకే షర్మిల తెలంగాణ వరదల గురించి మాట్లాడారో లేక మన రాష్ట్ర వరదల గురించి మాట్లాడారో తనకు అర్థం కావడం లేదని గుడివాడ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో వచ్చిన వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని ప్రభుత్వం ఉదాశీనంగా ఉండడం వల్లనే వరదలు ఏపీలో వరదలు వచ్చాయని ఆయన విమర్శించారు.

తమ తప్పులను పక్కన పెట్టి వైసీపీ అధినేత జగన్ వల్లే వరదలు వచ్చాయంటూ టీడీపీ కూటమి నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని జనాలు నమ్మరని అన్నారు. వరదలలో ఎన్నో అమాయక ప్రాణాలు పోయాయని అవన్నీ ప్రభుత్వ హత్యలే తప్ప మరోటి కాదని గుడివాడ ఖండితంగా చెప్పారు.

17 Replies to “షర్మిల విమర్శలు తెలంగాణ మీదనే!”

    1. పొదిగే కోడిని 11 బిరియానీ చేయడం మాత్రమే కాక, గుడ్డుని ఆమ్లెట్ చేసి, మందులో munching కింద నంజుకున్నారు.😜😜😜

  1. పక్కింటోళ్ల కోడి మన దొడ్లో గుడ్డు పెడితే మనదే కదా? ఒకవేళ దాన్ని పొదిగి పిల్ల చేస్తే అది వాళ్ళది అవ్వుద్దా, మనదా?

  2. పక్కింటోళ్ల కోడి మన దొ/ డ్లో గు/డ్డు పెడితే మనదే కదా? ఒకవేళ దాన్ని పొదిగి పిల్ల చేస్తే అది వాళ్ళది అవ్వుద్దా, మనదా?

  3. పక్కింటోళ్ల కో/ డి మన దొ/ డ్లో గు/ డ్డు పెడితే మనదే కదా? ఒకవేళ దాన్ని పొదిగి పిల్ల చేస్తే అది వాళ్ళది అవ్వుద్దా, మనదా?

  4. నీకు అలా అర్థమైందా, అందుకే ఆంధ్రా ప్రజలు నిన్ను కోడిగుడ్డు మంత్రి అని పిలుస్తున్నారు

Comments are closed.