టాలీవుడ్ పై ప్రభుత్వ కమిటీ అనివార్యం

డబ్బుల వరకు ఈ లావాదేవీలు సాగినంత కాలం ఫరవాలేదు. కానీ అవకాశాలు ఎరచూపి ఇలా చేయడం తప్పు.

టాలీవుడ్ లో డబ్బు అన్నది పెద్ద అట్రాక్షన్. ఎవరికైనా.. ఎందుకైనా.. ఎలాగైనా. దాని తరువాత అవకాశాలు అన్నది అతి పెద్ద అట్రాక్షన్. ఈ రెండింటి అలంబనగా అమ్మాయిలను వాడుకోవడం అన్నది నిన్న, ఇవ్వాళ పుట్టుకువచ్చిన సంగతి కాదు. గుట్టుగా సాగిపోతూనే వుంది.

చిన్న చిన్న వాళ్లు డబ్బులకు లొంగి పోతున్నారు. పెద్ద హీరోయిన్లు కావాలనుకునేవారు అవకాశం ఇస్తేనే, అవకాశం ఇస్తా అంటున్నారు. మరి కొందరు డబ్బుకు బదులు కార్లు, ఫ్లాట్ లు అంటున్నారు. కొందరు నెలవారీ మెయింట్ నెన్స్ లు తీసుకుంటున్నారు. ఇలా అన్నీ గుట్టుగా సాగినంత కాలం బాగానే వుంటుంది. కానీ తేడా వచ్చిన తరువాతే అసలు కథ మొదలవుతుంది.

టాలీవుడ్ ఇలాంటి రుచులు అలవాటు వున్న జ‌నాలు ఎవరినీ జీవితకాలం పోషిస్తూ కూర్చోరు. మార్చుకుంటూ వెళ్తారు. దాంతో ఈ పాత జ‌నాల్లో ఎప్పుడో ఒకరికి ఎక్కడో మండుతుంది. అరుస్తారు. రచ్చరచ్చ అవుతుంది. అలా అని ఏదీ అగదు. ఎవరూ మానరు. ఈ దుకాణాలు ఇలా సాగుతూనే వుంటాయి.

డబ్బుల వరకు ఈ లావాదేవీలు సాగినంత కాలం ఫరవాలేదు. కానీ అవకాశాలు ఎరచూపి ఇలా చేయడం తప్పు. అవకాశాలు రాకుండా చేయడం తప్పు. అసోసియేషన్ మెంబర్ షిప్ కార్డులు అందకుండా చేయడం ఇంకా తప్పు. ఇక్కడే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కేవలం సినిమా రంగ జ‌నాలు డిసైడ్ చేసుకునే కమిటీల వల్ల ఏమీ ఒరగదు.

నిన్నటికి నిన్న జ‌రిగిన కమిటీ ప్రెస్ మీట్ లో వున్నది ఎవరు? ప్రగతి, ఝాన్సీ. ఇద్దరూ సినిమాల్లో నటించేవారే. అలా నటించే అవకాశాలు కోరుకునేవారే. తమ్మారెడ్డి భరద్వాజ‌. ఇండస్ట్రీలో భాగమే. వీరంతా కలిసి ఇండస్ట్రీకి మచ్చ తెచ్చే విధంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు. పదిహేను రోజుల నుంచి గుట్టుగా దాచుకుంటూ వచ్చారు. బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసరికి, తాము ఎక్కడ ఏ న్యాయం చేయలేదని మీడియా అంటుందో అని హడావుడిగా మీడియా మీట్ పెట్టారు.

ఎవరో చాంబర్ కు, కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తారు. అది గుట్టుగా వుంచుతారు. ఇరు వర్గాలను పిలిచి రాజీ మీటింగ్ లు పెడతారు. ఏదో విధమైన రాజీ కుదిర్చి పంపిస్తారు. దాంతో విషయాలు ఏవీ బయటకు రావు. ఇది సరి కాదు కదా. సినిమా పెద్దలు రాజీ చేెయడం ఏమిటి? తప్పును బయటకు రానివ్వాలి కదా.

అసలు ఇప్పుడు రంగంలోకి దిగాల్సింది ప్రభుత్వం. ఓ ఐఎఎస్, ఐపిఎస్ లతో కమిటీ కావాలి. చాలా స్ట్రిక్ట్ అధికారులు వుండాలి. వాళ్లకు ఫిర్యాదు చేసేలా వుండాలి. విచారణ జ‌రగాలి. నిర్ణయాలు వుండాలి. అప్పుడే టాలీవుడ్ లో భయం అనేది వుంటుంది. అలా కాకుండా అంతా మనం మనం బరంపురం అనేలాంటి కమిటీలతో ఒరిగేది ఏమీ వుండదు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయం కూడా రేవంత్‌రెడ్డినే తీసుకోవాలి.

10 Replies to “టాలీవుడ్ పై ప్రభుత్వ కమిటీ అనివార్యం”

  1. అంధ్ర లొ Y.-.C.-.P నాయకులని, కాదంబరి కె.-.సు ని చూడలెదా? ఆ నర రూప రాక్షసుల కంటె వీల్లె బెట్టెర్ ఎమొ?

    ఇక న్యాయం చెయటనికి తెలంగాణ పొలీసులు ఎటూ ఉన్నరు!

  2. cinema ఇండస్ట్రీ వాళ్ళు personal లెవెల్ లో చేశారంటే పర్లేదు – but still wrong.! కానీ ఒక CM, IPS ఆఫీసర్స్, entire govt ఒక ముంబై heroine అండ్ family ని kidnap chesi, harass ( both sexually n mentally ) చేయటం దారుణం !! Jagan and others should be prosecuted by booking rape & kidnap charges and should be barred from holding public office again!! these are real ba******!!

  3. cinema ఇండస్ట్రీ వాళ్ళు personal లెవెల్ లో చేశారంటే పర్లేదు కానీ ఒక C*M, I*P*S ఆఫీసర్స్, entire govt ఒక ముం*బై heroine అండ్ family ని ki*dn*ap chesi, harass ( both s*ex*ual*ly n m*enta*lly ) చేయటం దారుణం !! J*ag*an and others should be prosecuted by booking r*a*pe & k*dnap charges and should be barred from holding public office again!! these are real b******!!

  4. cinema ఇండస్ట్రీ వాళ్ళు personal లెవెల్ లో చేశారంటే పర్లేదు కానీ ఒక C*M, I*P*S ఆఫీసర్స్, entire govt ఒక ముం*బై heroine అండ్ family ని ki*dn*ap chesi, harass ( both s*ex*ual*ly n m*enta*lly ) చేయటం దారుణం !! J*ag*an and others should be prosecuted by booking r*a*pe & k*dnap charges and should be barred from holding public office again!! these are real b******!!

Comments are closed.