ముర‌ళీమోహ‌న్ సంస్థ‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న

సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ వ్యాపార సంస్థ జ‌య‌భేరికి వ్య‌తిరేకంగా అపార్ట్‌మెంట్‌వాసులు రోడ్డెక్కారు. తాడేప‌ల్లి మండ‌లం కుంచ‌న‌ప‌ల్లిలో జ‌య‌భేరి క్యాపిట‌ల్ పేరుతో అపార్ట్‌మెంట్స్ క‌ట్టారు. అయితే ఒప్పందం ప్ర‌కారం ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేదంటూ…

సీనియ‌ర్ న‌టుడు, మాజీ ఎంపీ ముర‌ళీమోహ‌న్ వ్యాపార సంస్థ జ‌య‌భేరికి వ్య‌తిరేకంగా అపార్ట్‌మెంట్‌వాసులు రోడ్డెక్కారు. తాడేప‌ల్లి మండ‌లం కుంచ‌న‌ప‌ల్లిలో జ‌య‌భేరి క్యాపిట‌ల్ పేరుతో అపార్ట్‌మెంట్స్ క‌ట్టారు. అయితే ఒప్పందం ప్ర‌కారం ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేదంటూ అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళ‌న‌కు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

మీడియాతో అపార్ట్‌మెంట్ వాసులు మాట్లాడుతూ ముర‌ళీమోహ‌న్‌పై న‌మ్మ‌కంతో ప్లాట్లు కొన్నామ‌న్నారు. అయితే ఒప్పందం ప్ర‌కారం సీసీ కెమెరాలు పెట్ట‌లేద‌న్నారు. ఫైర్ సేఫ్టీ లేకుండానే అపార్ట్‌మెంట్ క‌ట్టార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా ప‌లు అంశాల్ని అపార్ట్‌మెంట్ వాసులు మీడియా దృష్టికి తీసుకొచ్చారు.

సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ టీడీపీ త‌ర‌పున రాజ‌మండ్రి నుంచి ఎంపీగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌ల నాటికి ఆయ‌న రాజ‌కీయాల నుంచి విర‌మించుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లో జ‌య‌భేరి సంస్థ పెద్ద ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో త‌న‌కంటూ ఒక బ్రాండ్ ఏర్ప‌ర‌చుకున్న‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో ముర‌ళీమోహ‌న్ చెప్పారు.

తాజాగా అపార్ట్‌మెంట్ వాసులు మోస‌పోయామ‌ని ఆందోళ‌న‌కు దిగిన నేప‌థ్యంలో ముర‌ళీమోహ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఒక‌సారి న‌మ్మ‌కాన్ని పోగొట్టుకుంటే వ్యాపారంలో న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని ముర‌ళీమోహ‌న్‌కు బాగా తెలుసు.

16 Replies to “ముర‌ళీమోహ‌న్ సంస్థ‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న”

  1. “ఫైర్ సేఫ్టీ లేకుండానే అపార్ట్‌మెంట్ క‌ట్టార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.”

    Why not complain to municipality corporation or goto courtt?

    1. రోడ్డు ఎక్కరు. కోర్టుల చుట్టూ తిరుగుతారు అనే ధైర్యం తోనే కదా ఇలా సగం సగం పనులు చేసి అప్పజెప్పి హాయిగా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వెళ్తారు.

      అదే ఇలా రచ్చ అయ్యి బ్యాడ్ పబ్లిసిటి వస్తే తర్వాత ప్రాజెక్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. అందుకే చచ్చినట్లు దిగొస్తారు.

  2. Kunchana palli lo gated community lo flat konnavaalla andaridhi same problem.Jagan anna 3 capitals valla andaru late chesaru. Neeku Jayabheri okkate kanipinchindhi. Nenu Samruddhi lo kanna 6yrs pattindhi complete cheyyadaniki.

  3. ఫైర్ సేఫ్టీ లేకుండా అపార్టుమెంట్లు కట్టేవాళ్ళు లేరని నేను అన్నాను కానీ .. ఫైర్ క్లియరెన్స్ లేకుండా OC అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాదు. అక్కడ జనాలు ఉంటున్నారంటే OC వచ్చినట్టే .. అంటే .. ఫైర్ ఇన్స్పెక్షన్ ఇంకా ఫార్మాలిటీస్ అవన్నీ జరిగినట్టే !! ఇంకో విషయం మనం ఒక కార్ కొన్నపుడు నిర్బంధంగా ఇన్సూరెన్స్ కొంటాం కానీ ఒకటి రెండు ఏళ్ళ తరువాత చాలా మంది పట్టించుకోరు అలాగే .. ఫైర్ సేఫ్టీ అనేది అక్కడి నివాసదారుల బాధ్యత .. దానికి ఒక సంస్థకి కాంట్రాక్టు ఇఛ్చి మైంటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి బిల్డర్ కి ఏమిటి సంబంధం ???

  4. చాలా వరకు పెద్ద బ్రాండ్ వున్న బిల్డర్లు , ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్లు కి ఇస్తున్నారు.

    దాని వలన ఫైనల్ గా క్వాలిటీ తగ్గి పోయింది.

    ఎలాగైనా మెయిన్ బిల్డర్ నే జవాబుదారీ.

    ఇల్లు అనేది జీవిత కాలపు పెట్టుబడి, మద్య తరగతి వారికి. కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం పార్టీ తో సంబంధం లేకుండా బాధితుల పక్కనే నిలబడాలి.

  5. అపార్ట్మెంట్ అనేది అనేక తల నొప్పులతో కూడుకున్న సంగతి. దాన్ని మెయ్యంటేనన్సి రూపంలో ప్రతిసారి జాగ్రత్తగా చూసుకుంటూ వుండాలి.

    అందరి పార్టిసిపట్షన్ వుండాలి. అందరినీ కలుపుకొని పోవాలి. బిల్డర్ మీద పోరాటం చేయాల్ తప్పు వుంటే.

    చాలా మందికి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఓనర్ లా భాద్యతలు, హక్కులు, లీగల్ ఇబ్బందులు చాలా వరకు తెలియదు.

    ఫ్లాట్ కొన్నమా, ఎవరో ఒకరిని అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నానమ, అంతే.

  6. There is nothing he loses being a binami to TDP, he minted millions besides real estate. He won’t even lose a strand of hair of money -That’s the dumbness of Indian public, They shout and scream at the end to wards politicians corruption or people like MM and no use crying at last minute

Comments are closed.