ఎన్-కన్వెన్షన్ లేని లోటు తెలిసిందా?

హైడ్రా రాకతో ఎన్-కన్వెన్షన్ కుప్పకూలింది. ఇప్పట్లో దాన్ని పునరుద్ధరించడం కూడా కష్టం. ఎందుకంటే, ఈ పంచాయితీ కోర్టులో ఉంది. అది తెగాలి, ఆ తర్వాత కన్వెన్షన్ ను మళ్లీ నిర్మించాలి. ఈ గ్యాప్ లో…

హైడ్రా రాకతో ఎన్-కన్వెన్షన్ కుప్పకూలింది. ఇప్పట్లో దాన్ని పునరుద్ధరించడం కూడా కష్టం. ఎందుకంటే, ఈ పంచాయితీ కోర్టులో ఉంది. అది తెగాలి, ఆ తర్వాత కన్వెన్షన్ ను మళ్లీ నిర్మించాలి. ఈ గ్యాప్ లో ఎన్-కన్వెన్షన్ లేని లోటు తెలిసొచ్చిందంటున్నారు చాలామంది.

నిన్నటికినిన్న ఊహించని విధంగా దేవర ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రద్దయింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సామాన్య ప్రేక్షకులు కూడా కలలో కూడా ఊహించనిది ఇది. భద్రతా కారణాల వల్ల ఈవెంట్ ను రద్దు చేసినట్టు చెప్పుకున్నప్పటికీ.. నోవాటెల్ లాంటి హోటల్స్, ఇలాంటి మాస్ ఈవెంట్స్ కు పనికిరావు అనేది బహిరంగ రహస్యం.

నోవాటెల్ హాల్ సామర్థ్యం అధికారికంగా 2వేలు. కానీ నిర్వహకులు 5వేల వరకు పాసులిచ్చినట్టు సమాచారం. ఇది సహజంగా జరిగేదే. ఏ పెద్ద సినిమా ఫంక్షన్ జరిగినా ఇలా కిక్కిరిసిపోవడం కామన్. కానీ దేవర విషయంలో అంతకుమించి, ఏకంగా 15వేల మంది వచ్చారు. దీంతో పరిస్థితి చేజారిపోయింది.

హాల్ లోపల మాత్రమే కాదు.. బయట కూడా జనం. ఒకటే గందరగోళం. అందర్లో లోపలికి వెళ్లాలనే ఆత్రుత. కానీ అప్పటికే హాల్ నిండిపోయింది. బయట జనాల చేతుల్లో ఇంకా పాసులు ఉండనే ఉన్నాయి. ఇది నిర్వహణ లోపమనే విషయం కనిపిస్తోంది కానీ అదే స్థానంలో ఎన్-కన్వెన్షన్ ఉన్నట్టయితే.. ఇంత గందరగోళం, తొక్కిసలాట జరిగేది కాదు.

ఓ భారీ వేదిక కావాలి. సౌకర్యాలు బాగుండాలి. పార్కింగ్ సమస్య ఉండకూడదు. అలాంటిది ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఎన్-కన్వెన్షన్ మాత్రమే. అదే మనుగడలో ఉండుంటే, కచ్చితంగా దేవర ఫంక్షన్ అందులోనే పెట్టి ఉండేవారు. అది లేదు కాబట్టే, నోవాటెల్ కు వెళ్లాల్సి వచ్చింది.

నిజానికి ఎన్-కన్వెన్షన్ వద్దనుకుంటే, జేఆర్సీ, శిల్పకళావేదిక లాంటివి మరికొన్ని ఉన్నాయి. వర్షాలు కురిసే టైమ్ కాబట్టి బహిరంగ వేదికల జోలికి వెళ్లలేదు. నిర్వహకులు మాత్రం నోవాటెల్ ను ఎంపిక చేసుకున్నారు. ఎన్-కన్వెన్షన్ చర్చను మరోసారి తెరపైకి వచ్చేలా చేశారు.

19 Replies to “ఎన్-కన్వెన్షన్ లేని లోటు తెలిసిందా?”

Comments are closed.