రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజ‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో సంప్రోక్ష‌ణ పూజ‌లు నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై ప‌చ్చి అబ‌ద్ధాల‌తో అప‌విత్రం చేశార‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శ చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకే పాప ప్ర‌క్షాళ‌న…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో సంప్రోక్ష‌ణ పూజ‌లు నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదంపై ప‌చ్చి అబ‌ద్ధాల‌తో అప‌విత్రం చేశార‌ని వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శ చేసిన సంగ‌తి తెలిసిందే. అందుకే పాప ప్ర‌క్షాళ‌న కోసం రాష్ట్ర‌మంతా సంప్రోక్ష‌ణ చేయాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పిలుపు మేర‌కు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ప్ర‌ముఖ ఆల‌యాల్లో ప్ర‌త్యేకంగా సంప్రోక్ష‌ణ చేయ‌డం విశేషం. ఇంత‌కు ఇలాంటి పూజ‌లే టీడీపీ, జ‌న‌సేన నేత‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ నేత‌లు ఇందుకు కౌంట‌ర్‌గా పూజ‌లు నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

తిరుప‌తిలో తాత‌య్య‌గుంట గంగ‌మ్మ ఆల‌యంలో తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి, టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌, అలాగే ఇత‌ర ప్రాంతాల్లో మాజీ మంత్రులు పేర్ని నాని, అంబ‌టి రాంబాబు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, అంజాద్‌బాషా త‌దిత‌రులు పూజ‌లు నిర్వ‌హించారు. త‌మిళ‌నాడులో మాజీ మంత్రి ఆర్కే రోజా పూజ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

తాము కౌంట‌ర్‌గా సంప్రోక్ష‌ణ చేయ‌క‌పోతే, కూట‌మి నేత‌ల ఆరోప‌ణ‌లే నిజ‌మ‌ని ప్ర‌జ‌లు న‌మ్మే ప్ర‌మాదం వుంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. తిరుమ‌ల ప్ర‌సాదం విష‌యంలో దోషుల్ని దేవ‌దేవుడు త‌ప్ప‌క శిక్షిస్తార‌ని అన్ని పార్టీల నాయ‌కులు అంటుండం గ‌మ‌నార్హం.

16 Replies to “రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజ‌లు”

  1. పాప ప్రక్షాళన చేసుకోవాల్సింది ja***, వాడి ఫ్యామిలీ కదా ? వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు?? పూజలు చేసుకుంటే మంచిదే కానీ పనిలో పని ja*** నెత్తి మీద 11 కొబ్బరికాయలు కొట్టి, నాలుక మీద అర కిలో కర్పూరం వెలిగించి పాప పరిహారం కూడా చేయిస్తే మంచిదేమో !!

  2. ఇంతకీ ప్యాలస్ పులకేశి తిరుమల లడ్డు తింటున్న ఫోటో ఒక్కటీ లేదు,

    యేసు శిక్ష వేస్తాడు అని భయం వేసిందా !

  3. అన్న బెంగుళూరు ప్యాలెస్ లో పూజలు చేసాడా, లేదా?! ఏదేమైనా ఈ విషయంలో వదినని మెచ్చుకోవాలి. ఆరు నూరైనా తను నమ్మిన మతానికి కట్టుబడి ఉంది. అన్నలాగా అవకాశవాది కాదు. మొహమాటపడదు.

  4. మరి క్రిస్టియన్ మతాన్ని అంత బ్రష్టు పట్టిస్తున్న జగన్, చర్చి కు వెళ్లి తన పాపం పరిహారం ప్రార్థన చెయ్యడా? ఇది ఎక్కడి అన్యాయం?

Comments are closed.