ఈ ఏడాదికి చివరాఖరి అవకాశం

ఈ ఏడాదికి సంబంధించి వరుణ్ తేజ్ కు ఇంకా ఒకే ఒక్క అవకాశం మిగిలింది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే.. ఈ ఏడాది ఫ్లాప్ హీరోగా అతడు ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఏడాదికి…

ఈ ఏడాదికి సంబంధించి వరుణ్ తేజ్ కు ఇంకా ఒకే ఒక్క అవకాశం మిగిలింది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే.. ఈ ఏడాది ఫ్లాప్ హీరోగా అతడు ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. ఈ ఏడాదికి మాత్రమే కాదు, గడిచిన ముడేళ్లుగా సోలో హిట్ లేని ఫ్లాప్ హీరోగా మిగిలిపోతాడు.

గతేడాది గాండీవధారి అర్జున సినిమా చేశాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం కావడం, యాక్షన్ కథ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ సినిమా ఏ కోశానా అది అంచనాల్ని అందుకోలేకపోయింది. ఇక ఈ ఏడాది ప్రధమార్థంలో ఆపరేషన్ వాలంటైన్ సినిమా చేశాడు.

కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. కనీసం బజ్ కూడా లేకపోవడం బాధాకరం. అలా బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాపులిచ్చిన వరుణ్ తేజ్, ఇప్పుడు మట్కా సినిమాను రెడీ చేస్తున్నాడు. వచ్చేనెల 14న ఈ సినిమా వస్తోంది.

వరుణ్ తేజ్ కు ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. లేదంటే ఈ ఏడాది అతడు ఫ్లాప్ హీరోగా మిగిలిపోతాడు. గద్దలకొండ గణేశ్ తర్వాత సోలో సక్సెస్ అందుకోలేకపోయాడు వరుణ్ తేజ్. అతడు నటించిన గని సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాతొచ్చిన సినిమాల గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. మధ్యలో వచ్చిన ఎఫ్3 బాగానే ఆడినప్పటికీ, అది వరుణ్ తేజ్ సోలో హిట్ కిందకు రాదు.

సో.. వరుణ్ తేజ్ కు ఇప్పుడు మట్కా మాత్రమే దిక్సూచి. ఈ సినిమాతో అతడు నిరూపించుకోవాలి. లేదంటే, థియేట్రికల్ మార్కెట్ సంగతి అటుంచి ఓటీటీ మార్కెట్ ను అతడు కోల్పోవాల్సి వస్తుంది.

5 Replies to “ఈ ఏడాదికి చివరాఖరి అవకాశం”

Comments are closed.