ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించు బాబూ!

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తాజాగా కేంద్రానికి ఏపీలోని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. పౌర సంఘాలు ప్రజా సంఘాలతో మేధావులతో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థను ఏర్పాటు చేసి…

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తాజాగా కేంద్రానికి ఏపీలోని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. పౌర సంఘాలు ప్రజా సంఘాలతో మేధావులతో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థను ఏర్పాటు చేసి తొలి ప్రయత్నంగా విశాఖలో భారీ ర్యాలీని ఇటీవల నిర్వహించారు.

దానికి మంచి స్పందన లభించింది. ఇపుడు మరో భారీ ప్రోగ్రాం ని తలపెడుతున్నారు. రానున్న నాలుగు నెలల వ్యవధిలో లక్ష మందితో విశాఖలో అతి పెద్ద సభను నిర్వహించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కదిలిస్తామని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ప్రకటించింది. ఈ భారీ సభను జనవరి 27న విశాఖలో నిర్వహించనున్నారు. కేవలం మాటలతోనే మభ్యపెడుతూ జోరుగా తెర వెనక ప్రైవేటీకరణకు దారులు తెరుస్తున్న కేంద్రం వైఖరి మీద ప్రజా సంస్థ నిర్వాహకులు ఫైర్ అవుతున్నారు.

కేంద్రం ప్రైవేటీకరణ మీద వెనక్కి తగ్గకుండా ఉంటే ఏపీలోని కూటమి పార్టీలు ఏమి చేస్తున్నాయని నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా ప్రజా సంస్థ డిమాండ్ చేసింది. ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం మీద విస్పష్టమైన ప్రకటన చేయించాలని కోరుతున్నారు. అది జరగకపోతే ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటామని ఢిల్లీలోనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఎంపీల మద్దతుతోనే ఆధారపడి ఉందని గుర్తు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని తీసుకుని స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కొనసాగించాలని సొంత నిధులు కేటాయించాలని వర్కింగ్ కేపిటల్ గా పదివేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కోరుతోంది. టీడీపీ, జనసేన మెడకు ఇపుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ముడిని తగిలించింది. చంద్రబాబు పవన్ ఈ విషయంలో కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరుతోంది. నానాటికీ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతున్న వేళ కూటమి పార్టీలకు ఇది ఇబ్బందికరంగా మారుతోంది.

14 Replies to “ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించు బాబూ!”

  1. 😂😂😂 మన vi sa re laughing from VIZAG jagadamba centre….. పిచ్చి GA ఎప్పుడైతే మన VI SA RE గారు అప్పట్లోనే రాజీనామాలపై జ్ఞాన గుణికలు వదిలాడో అప్పుడే మీ డ్రామాలు జనానికి పూర్తిగా అర్థం ఐపోయాయిలే కానీ…. ఐనా స్టీల్ ప్లాంట్ ను లేపేసి అక్కడ క్యాపిటల్ కట్టాలి అని ఆధ్బతమైన idea ఇచ్చింది ఎవరు GA….

    1. If Jagan gave the idea why is BJP following it and why is Kootami not objecting it? They cancelled 3 capitals and made Amaravathi as capital but why is privatization of steel plant not being stopped?

  2. ఈ మీడియా లో ఎవరిదైనా ఆర్టికల్ రావాలి అంటే ఓ పదిమంది తో ఏదో ఒక సంస్థ పేరుతో బ్యానర్ వేలాడ దీసి బీజేపీ కి వ్యతిరేకంగా ప్రకటన ఇస్తే సరి!

  3. Only when people come out and protest these leaders will act or else they will instigate people in the name of religion for votes during elections.

  4. మీకు లక్ష అనే ఫిగర్ ఆషామాషీ అయిపోయింది అప్పట్లో అన్న లక్ష మెజారిటీ తో గెలుస్తారు అన్నారు (ఆసెంబ్లీ) కి ఇప్పుడు లక్ష మంది తో వీళ్లు సభ పెడతారు అని చెప్తున్నారు అధికారం లో ఉన్న పార్టీ ల కె కష్టం లక్ష మంది ని పోగేసి సభలని పెట్టడమే అలాంటిది ఇలాంటి ఊరు పేరు లేని సంస్థ సభ పెడితే లక్ష మంది వస్తారా ????నిజం గ జనాలకి ఏమి ఉక్కు మీద ప్రత్యేక ప్రేమ కారిపోవడం లేదు వాళ్ళకి తెలీదా ఏంటి అక్కడ పనులు ఎలా జరుగుతుంది ఎంత నిర్లక్ష్యం గ ఉంటారు అక్కడ పని చేసే జనాలు అని

Comments are closed.