పదేళ్లలో అతి చెత్త ఓపెనింగ్ ఇదే

దసరా సీజన్ ముగిసింది. జిగ్రా అసలు రంగు బయటపడింది. అలియా భట్ కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ వచ్చి చేరింది. ఆమె పదేళ్ల కెరీర్ లో అత్యల్ప వసూళ్లు ఇవేనంటోంది బాలీవుడ్ ట్రేడ్. Advertisement…

దసరా సీజన్ ముగిసింది. జిగ్రా అసలు రంగు బయటపడింది. అలియా భట్ కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ వచ్చి చేరింది. ఆమె పదేళ్ల కెరీర్ లో అత్యల్ప వసూళ్లు ఇవేనంటోంది బాలీవుడ్ ట్రేడ్.

మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోలేకపోయిన జిగ్రా, దసరా పండగ సందర్భంగా కొంచెం పికప్ అయింది. అయితే ఆ మరుసటి రోజుకే మళ్లీ పడిపోయింది. ఆ తర్వాత ఇక లేవలేదు.

జిగ్రాకు మొదటి రోజు 4.55 కోట్లు, రెండో రోజు 6.55 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ 4 రోజుల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు ఈ రెండే. ఇవాళ్టి నుంచి సినిమాకు ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. దీంతో పాటు రిలీజైన రాజ్ కుమార్ రావు, త్రిప్తి దిమ్రీల సినిమా థియేటర్లలో బాగా నడుస్తోంది.

ఇటు తెలుగులో కూడా జిగ్రా పరిస్థితి దారుణంగా ఉంది. త్రివిక్రమ్, సమంత లాంటి వాళ్లను తీసుకొచ్చి ప్రచారం చేసినప్పటికీ.. స్వయంగా అలియాభట్ పాటలు పాడి, డాన్స్ చేసినప్పటికీ టాలీవుడ్ లో జిగ్రా నిలబడలేదు.

తెలుగు సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవ్వడం, అదనంగా వేట్టయన్ తోడవ్వడం జిగ్రాకు పెద్ద దెబ్బగా మారింది. ఓవరాల్ గా అలియాభట్ కెరీర్ లో జిగ్రా ఓ ఫ్లాప్ గా మిగిలింది.

2 Replies to “పదేళ్లలో అతి చెత్త ఓపెనింగ్ ఇదే”

Comments are closed.