పెద్ద దర్శకులు అంటే ఓ మాట.. ఓ పద్దతి.. ఓ విధానం.. అవీ వుంటాయి కదా. అది తేడా వచ్చినపుడు హర్ట్ కావడం సహజం. నిర్మాత అనిల్ రావిపూడి- వెంకటేష్ తో ఓ ఫుల్ ఫ్యామిలీ ఫన్ సినిమా ఒకటి చేస్తున్నారు. దీనికి రిజిస్టర్ చేసిన టైటిల్ నే…’సంక్రాంతికి వస్తున్నాం’. కానీ ఇప్పుడు ఇది సంక్రాంతికి వస్తుందా అన్నది అనుమానం. ఎందుకంటే అ సినిమాను నిర్మిస్తున్న బ్యానర్ లో వస్తున్న అతి పెద్ద సినిమా గేమ్ ఛేంజర్ కూడా సంక్రాంతికే వస్తోంది. అందువల్ల ఏం జరుగుతుంది అన్నది అనుమానం.
విశ్వంభర సినిమా అంటే ఓటీటీ కాలేదు, కొడుకు సినిమా కనుక మెగాస్టార్ డేట్ త్యాగానికి ఓకె అని వుండొచ్చు. కానీ వెంకటేష్ ఎందుకు త్యాగం చేయాలి. మరో సీనియర్ హీరో బాలయ్య అదే సంక్రాంతికి వస్తున్నారు కదా. ఇప్పుడు వెంకటేష్ వెనక్కు తగ్గినట్లు ఫ్యాన్స్ ఫీలయ్యే అవకాశం వుంది కదా?
ఇలాంటి నేపథ్యంలో ఈ డైలామా చూసి, దర్శకుడు అనిల్ రావిపూడి రెండు.. మూడు రోజుల పాటు సంక్రాంతికి వస్తున్నాం నిర్మాతలతో మాట్లాడడం మానేసినట్లు తెలుస్తోంది. అది తెలిసి, సంక్రాంతికే వద్దాం, టెన్షన్ వద్దు అని నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ దర్శకుడు అనిల్ రావిపూడికి నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది.
నిర్మాత దిల్ రాజు కాంపౌండ్ కు దర్శకుడు అనిల్ రావిపూడి చాలా కీలకం. అదే బ్యానర్ లో మంచి హిట్ లు ఇచ్చారు. ఇకపై కూడా సినిమాలు చేయాల్సి వుంది. అందువల్ల ఏదో ఒకటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి ఈ విషయంలో సీనియర్ హీరో వెంకటేష్ వెయిట్ అండ్ సీ ధోరణితో వున్నారని తెలుస్తోంది.
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
vc available 9380537747
Nuvvu kshaminchaku. Broker GA, moderator kallu kukkalu minginaaya
Ee article ki comments లేనప్పుడే… మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే… చాలా తక్కువ మంది మాత్రమే అనిల్ గారిని పెద్ద దర్శకుడు అని ఒప్పుకుంటున్నారు అని.
ఇందులో అంతగా గుడ్డలు చించుకోవడానికేముంది? సినిమా టైటిల్ను “ఉగాదికి వస్తున్నాం” అని మార్చి ఉగాదికి రిలీజ్ చేస్తే సరి! లేదా “క్రిస్మస్ కు వస్తున్నాం” అని మార్చి ఓ ఇరవై రోజుల ముందే విడుదల చేసినా ఓకే!!
సంక్రాంతికి వచ్చినా థియేటర్లో చూడం