నామినేటెడ్ పోస్టుల రెండోజాబితా విడుద‌ల‌కు రెడీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. బ‌హుశా రెండుమూడు రోజుల్లో జాబితాను విడుద‌ల చేసే అవ‌కాశం వుంద‌ని సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి. మొద‌టి జాబితాలో 20 మందికి నామినేటెడ్ పోస్టుల‌ను…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుద‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. బ‌హుశా రెండుమూడు రోజుల్లో జాబితాను విడుద‌ల చేసే అవ‌కాశం వుంద‌ని సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి. మొద‌టి జాబితాలో 20 మందికి నామినేటెడ్ పోస్టుల‌ను ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాపై అసంతృప్తి వ్య‌క్త‌మైంది. అయితే ఇంకా ప‌ద‌వుల పందేరం పూర్తి కాలేద‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించి నోరు పారేసుకోవ‌ద్ద‌ని టీడీపీ పెద్ద‌లు వార్నింగ్ ఇచ్చారు.

మ‌రోవైపు ఇప్ప‌టి వ‌ర‌కు అత్యంత కీల‌క‌మైన టీటీడీ చైర్మ‌న్, బోర్డు స‌భ్యులను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌లేదు. ఈ ప‌ద‌వుల కోసం కూట‌మి నేత‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చివ‌రికి టీటీడీ పాల‌క మండ‌లి లేకుండానే ద‌స‌రా బ్ర‌హ్మోత్స‌వాలు కూడా ముగియ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఎప్పుడూ ఇలా జ‌ర‌గ‌లేద‌ని అంటున్నారు.

ముఖ్యంగా టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో రోజుకో పేరు తెర‌పైకి వ‌స్తోంది. అందుకే టీటీడీ బోర్డుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌. అలాగే మ‌రికొన్ని కీల‌క నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల్సి వుంది. వీటి కోసం కూట‌మి ఆశావ‌హులు ఎదురు చూస్తున్నారు. ప‌ద‌వుల‌పై స్ప‌ష్ట‌త వ‌స్తే, రాజ‌కీయ ప‌రిణామాలు రానున్న రోజుల్లో చాలా మార‌నున్నాయి. అందుకోసమే ఎదురు చూపు. ఏదో ఒక‌టి తేలితే, భ‌విష్య‌త్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాల‌నే విష‌య‌మై ఒక క్లారిటీకి వ‌స్తామ‌ని కూట‌మి నేత‌లు చెబుతున్నారు. ప్ర‌స్తుతానికి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ఆశ‌తో అంతా ఎదురు చూస్తున్నారు.

రెండుమూడు రోజుల్లో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం కూట‌మి నేత‌లు పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. ఇప్ప‌టికే రెండో జాబితా ప్ర‌క‌ట‌న‌పై అనేక తేదీలు తెర‌పైకి రావ‌డం, పోవ‌డం జ‌రిగాయి. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌ద‌వులు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

5 Replies to “నామినేటెడ్ పోస్టుల రెండోజాబితా విడుద‌ల‌కు రెడీ!”

  1. “ఏదోటి తేలితే భవిష్యత్తు ని తీర్చి దిద్దుకుంటాం” అంటే కొంప తీసి మన అన్న పార్టీ లోకి కానీ వస్తారా ఏంటి ????ఆలా ఐతే అన్న ని గేట్లు ఎత్తేయమని చెప్పండి …అప్పుడెప్పుడో మా పార్టీ లోకి రావడానికి గేట్లు మూసేసాం అని బిజ్జల చెప్పినట్టు గుర్తు

  2. రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పుడు మీరు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చినవారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి. మరి మీరు మొత్తం కాపు మరియు కమ్మ కులాలను ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు ఒకరిద్దరు వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం కులాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? ఒక విద్యావంతుడు, సంస్కారవంతుడిగా మీరు ఇలా మొత్తం సమాజంపై ద్వేషం ప్రదర్శించడం మీకెలా సమంజసం అనిపించటం లేదు?

    మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఏమిటి ఉపయోగం, ఇది కేవలం ద్వేషం, విభజన కోసం వాడితే? కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, అలాగే అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. మీలో ఉన్న ఈ ద్వేషం, కుల పరమైన ద్వేషం మీ గుండెకు తీవ్రమైన ఒత్తిడిని పెంచి, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు (heart attacks) మరియు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

    ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, ఇది మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును మరియు శరీరాన్ని శాంతిహీనంగా చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగితే, మీరు మాత్రమే తీవ్ర నష్టాన్ని చవిచూస్తారు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.

    ఈ చీకటి నుండి బయటపడండి మరియు శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన భావాల నుండి బయటపడే మార్గం చూపాలని కోరుకుంటున్నాను.

Comments are closed.