తన పేరులోని పొడి అక్షరాలతో బ్యానర్. అదే టైటిల్. ఇలా KA అనే సినిమాను తయారు చేసాడు హీరో కిరణ్ అబ్బవరం. ఏమిటీ ధైర్యం అనుకుంటే ఇప్పుడు పెద్ద సినిమాలతో పోటీ పడుతూ దీపావళి బరిలోకి దిగుతున్నాడు.
మిస్టిరీయస్ థ్రిల్లర్ లకు అదరణ బాగానే వుంది. ఇప్పటి వరకు వదలిన ‘క’ కంటెంట్ కు రెస్పాన్స్ బాగుంది. సింగిల్ పాయింట్ లో తెలుగు, మలయాళ థియేటర్ హక్కులు అమ్ముడు పోయాయి. అందువల్ల దీపావళి బరిలోకి దిగేస్తున్నాడు కిరణ్ అబ్బవరం.
దుల్కర్ సల్మాన్.. వెంకీ అట్లూరి సినిమా వుంది, తమిళ సినిమా అమరన్ వుంది, రోటీ కపడా రొమాన్స్ అనే చిన్న సినిమా వుంది. ఇన్ని సినిమాల మధ్య విడుదల చేయడం అంటే కాస్త సమస్యే. కంటెంట్ ఏది బాగుంటే అది చూస్తారు అని చెప్పడం వీజీనే. కానీ థియేటర్లు కావాలి కదా.
క్రీమీలేయర్ థియేటర్ లు ఇటు నైజాంలో అటు ఉత్తరాంధ్రలో లక్కీ భాస్కర్ కు వెళ్లిపోతాయి. అ తరువాత అదే డిస్ట్రిబ్యూటర్ పంపిణీ చేసే అమరన్ కు కూడా ప్రయారిటీ వుంటుంది. అందువల్ల ‘క’ కు థియేటర్లు దొరకుతాయి కానీ కాస్త మంచివి దొరకడం కష్టం.
అయితే విడుదల అయిన తరువాత టాక్ దేనికి వుంటే అది రన్ అవుతుంది. ఈ పాయింట్ ను నమ్ముకునే కిరణ్ అబ్బవరం రంగంలోకి దిగుతున్నాడనుకోవాలి. అది వాస్తవం కూడా. పైగా ఇటీవల పంపిణీ రంగంలో కాస్త లక్కీ లెగ్ అనిపించుకుంటున్న వంశీ నందిపాటి ‘క’సినిమాను హోల్ సేల్ గా కొనేసారు. అది కూడా కాస్త ధైర్యం ఇచ్చి వుండొచ్చు.
Call boy works 9989793850
మేము థియేటర్లో చూసే ధైర్యం చేయం