కూటమిలో తొలి ముసలం పిఠాపురంలో పుట్టిందా?

పిఠాపురం త్యాగం చేయడం వల్లనే మైత్రీబంధం బలంగా ఏర్పడి ఉండొచ్చు గాక.. కానీ.. పిఠాపురంలోనే తొలిముసలం పుట్టడం ఆశ్చర్యకరం.

నిజానికి ఇది ఎన్నికలకు ముందే పుట్టినటువంటి ముసలం. చంద్రబాబునాయుడు రాజనీతి, లౌక్యం, సర్దుబాటు చేయగల తెలివితేటల వలన అప్పటికి సద్దుమణిగింది. కానీ ఇప్పుడు ముసలం పుట్టి ఆయన కోర్టుకే వచ్చింది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి- జనసేనకు మద్య సఖ్యత లేదు. తెలుగుదేశాన్ని చులకనగా చూస్తున్నారని, ఏ పనుల్లోనూ కలిసి చేద్దాం అనే ధోరణితో సాగడం లేదని అంటున్నారు.

ప్రధానంగా ఆ సీటు తెదేపాకు దక్కి ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండే పిఠాపురం వర్మకు ప్రాధాన్యం దక్కడం లేదనే వాదన ఉంది. ఈ విషయాలన్నీ తాజాగా చంద్రబాబునాయుడు దృష్టికి వచ్చాయి. స్వయంగా వర్మ వచ్చి పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు చేశారు. మరి ఆయన ఎలా స్పందిస్తారనేది తెలియదు.

పవన్ కల్యాణ్ తన నియోజకవర్గం ఏదనే సంగతి తేల్చకుండా నానబెట్టినంత కాలం పిఠాపురంలో వర్మ చాలా కష్టపడి తన కేడర్ ను, ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. తెలుగుదేశానికి ఆ సీటు కంచుకోటలా మార్చారు. తీరా ఎన్నికలు బాగా దగ్గర పడ్డాక పవన్ తన సీటు ఏమిటో తేల్చారు. వర్మ అలిగి ఇండిపెండెంటుగా పోటీచేయాలని అనుకున్నప్పుడు.. చంద్రబాబు బుజ్గగించి పార్టీ తరఫున తొలి ఎమ్మెల్సీగా చేస్తానని మాట ఇచ్చ ఊరుకోబెట్టారు.

పవన్ ఆయన ఇంటికి వెళ్లి.. ఆయనను వెంటబెట్టుకుని.. నియోజకవర్గంలో తన తర్వాత వర్మే అంటూ సమయానుకూలంగా మాట్టాడి ఆయన మద్దతు పొంది ఘనంగా గెలిచారు. ఆ తర్వాత ఆయనను పక్కన పెట్టారు.

నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి పార్టీలు పైకి కనపడకుండా.. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారనే సంగతి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బయటపడింది. ఉన్న అయిదు డైరెక్టర్ స్థానాలకు తెలుగుదేశం జనసేన విడివిడిగా తమ ప్యానెల్ లను పోటీచేయించాయి. జనసేనతో వర్మకు డీల్ కుదర్లేదు. విడిగా తన మనుషులను పోటీకి దించారు. తీరా జనసేన వాళ్లు నలుగురు, ఒక ఇండిపెండెంటు గెలిచారు.

మరొక వైపు చంద్రబాబు హామీ ఇచ్చిన తొలి ఎమ్మెల్సీ అనే అవకాశం కనిపించడమే లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అవకాశం వచ్చినప్పటికీ.. బాబు దృష్టిలో తన పేరు ఉన్నట్టుగా ఆయన భావించడం లేదు. అందుకే అమరావతి వచ్చి చంద్రబాబును కలిసి, నియోజకవర్గంలో జనసేనతో ఉన్న ఇబ్బందులు అన్నీ నివేదించి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

పిఠాపురం త్యాగం చేయడం వల్లనే మైత్రీబంధం బలంగా ఏర్పడి ఉండొచ్చు గాక.. కానీ.. పిఠాపురంలోనే తొలిముసలం పుట్టడం ఆశ్చర్యకరం. నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన ఆలపాటి రాజాకు కూడా ఎమ్మెల్సీ హామీ దొరుకుతున్నది గానీ.. పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మకు ఆ చాన్స్ వరించడం లేదు ఏమిటో మరి??

14 Replies to “కూటమిలో తొలి ముసలం పిఠాపురంలో పుట్టిందా?”

  1. 😂😂😂…బాబాయ్ కోసం మన అన్నయ్య తపించినట్టు…..వర్మ కోసం బాబు గారు లేరని బాధ పడుతున్నావా GA…

    1. రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ ఇప్పుడు మీరు సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చినవారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి. మరి మీరు మొత్తం కాపు మరియు కమ్మ కులాలను ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు ఒకరిద్దరు వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం కులాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? ఒక విద్యావంతుడు, సంస్కారవంతుడిగా మీరు ఇలా మొత్తం సమాజంపై ద్వేషం ప్రదర్శించడం మీకెలా సమంజసం అనిపించటం లేదు?

      మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఏమిటి ఉపయోగం, ఇది కేవలం ద్వేషం, విభజన కోసం వాడితే? కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, అలాగే అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. మీలో ఉన్న ఈ ద్వేషం, కుల పరమైన ద్వేషం మీ గుండెకు తీవ్రమైన ఒత్తిడిని పెంచి, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు (heart attacks) మరియు మానసిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

      ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, ఇది మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును మరియు శరీరాన్ని శాంతిహీనంగా చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగితే, మీరు మాత్రమే తీవ్ర నష్టాన్ని చవిచూస్తారు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.

      ఈ చీకటి నుండి బయటపడండి మరియు శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన భావాల నుండి బయటపడే మార్గం చూపాలని కోరుకుంటున్నాను.

  2. vaadi bondha. veedu independent ga pawan sir ki against ga potee chesinaa Pawan sir bumper majority tho gelichevaru. Pitapuram people had decided long ago to go for Pawan sir. Varma just jumped to the right side and made sure that he was in the winning team. Daniki minchi vaadiki scene ledu akkada. Jai Janasena.

  3. రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే అందాయి. కానీ ఇప్పటికైనా మీరు సీరియస్‌గా ఆలోచించాలి. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి చెందింది. మీరు కాపు మరియు కామ్మ కులాలను మొత్తం ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు కొంతమంది వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం సమాజాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? విద్యావంతుడు, సంస్కారవంతుడు అయిన మీరు ఇలా అసహ్యమైన కుల ద్వేషాన్ని ప్రోత్సహించడంలో ఎలాంటి సిగ్గు అనిపించటం లేదు?

    మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఉపయోగం ఏమిటి, ఇది అంతా కేవలం కలహం, విభజన కోసం మాత్రమే వాడబడితే? కులం ఆధారంగా ద్వేషం ప్రోత్సహించడం మరియు అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. శాస్త్రాలు చెబుతున్నాయి—ఇతర సమూహాలపై ఉన్న గాఢమైన ద్వేషం, ఒత్తిడి ఇవన్నీ గుండెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, ప్రత్యేకించి గుండెపోటు (heart attacks) లను తెస్తాయి. మీరు కలిగి ఉన్న ఈ ద్వేషం, మీరు ప్రోత్సహిస్తున్న కులపరమైన ద్వేషం, మీ గుండె మీద మామూలు ఒత్తిడి కంటే తీవ్రమైన ఒత్తిడిని పెంచుతూ, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు, మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది.

    ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును, శరీరాన్ని విషం చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగడం మీకే ముప్పు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు ఎల్లప్పుడూ మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.

    ఈ చీకటి నుండి బయటపడండి మరియు ఒక శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన మనస్తత్వం నుండి త్వరగా బయటపడే మార్గాన్ని చూపాలని ఆశిస్తున్నాను.

  4. కాసెపు జనసెన మద్య ముసలం అంటూ రాస్తూ విమర్సిస్తాడు…

    అంతలొనె పవన్ కల్యణ్ చంద్రబాబు ని వదలటం లెదు అని, ఇలా అయితె జనసెన ఎలా అదికారం లొకి వస్తుంది అని విమర్సిస్తాడు.

    మళ్ళి పవన్ కి నిలకడలెదు అంటాడు, ఏటు వెల్తాడొ తెలీదు అంటూ విమర్సిస్తాడు

    అంతలొనె చంద్రబాబు తొ పవన్ జగ్రర్త అంటూ విమర్సిస్తాడు

    .

    ఒకటి మాత్రం నిజం. కూటమిగా కలిసి ఉంటె ఇక అధికరం లొకి రాలెము అని జగన్ డిసైడ్ అయిపొయినట్టు అన్నాడు.

Comments are closed.