వినోదం.. విందు.. ఓజీ

తన ప్రాధాన్యం ఏంటనేది మరోసారి చెప్పకనే చెప్పారు పవన్ కల్యాణ్. మొన్నటివరకు ఆరోగ్యం సహకరించక విశ్రాంతిలో ఉన్న పవన్, ఇప్పుడు నేరుగా ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై, మరోసారి సినిమాలపై తన ఉద్దేశాన్ని పరోక్షంగా…

తన ప్రాధాన్యం ఏంటనేది మరోసారి చెప్పకనే చెప్పారు పవన్ కల్యాణ్. మొన్నటివరకు ఆరోగ్యం సహకరించక విశ్రాంతిలో ఉన్న పవన్, ఇప్పుడు నేరుగా ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై, మరోసారి సినిమాలపై తన ఉద్దేశాన్ని పరోక్షంగా బయటపెట్టారు.

“రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. మీకు పని కావాలి, స్కిల్ డెవలప్ మెంట్ కావాలి. ఇవన్నీ చేసిన తర్వాత విందులు, వినోదాలు చేద్దాం.” అంటూ పరోక్షంగా సినిమాలపై తన వెర్షన్ ను బయటపెట్టారు పవన్.

ఇండస్ట్రీలో ఏ హీరోతో తనకు ఇబ్బంది లేదంటూ.. బన్నీతో సహా చాలామంది హీరోల పేర్లను ప్రస్తావించిన పవన్.. తను హీరోలతో పోటీ పడనని స్పష్టం చేశారు.

“ప్రతి ఒక్కరి కడుపు నిండాలి. అందుకే ముందు కడుపు నిండే పని చేద్దాం. ఆ తర్వాతే వినోదమైనా, విందయినా, ఓజీ అయినా. ముందు బాధ్యత, ఆ తర్వాతే వినోదం.”

తన సభల్లో జనమంతా ఓజీ..ఓజీ అని అరుస్తుంటే తనకు మోదీ..మోదీ అని వినిపించేదని.. సినిమాలపై తనకు పెద్దగా దృష్టి లేదని తెలిపిన పవన్.. అభిమాన హీరోలకు జై కొట్టే ముందు కడుపు నింపుకోవాలని, ఏదైనా పని చూసుకోవాలని పరోక్షంగా అభిమానులకు సూచించారు.

ఇలా తన వ్యాఖ్యలతో సినిమాలు తన ప్రాధాన్యం కాదనే విషయాన్ని చెప్పేశారు పవన్. అయితే ఆయనకు రాజకీయ బాధ్యతలతో పాటు, సినిమా బాధ్యతలు కూడా ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల్ని ఆయన కచ్చితంగా పూర్తిచేయాలి.

ఎందుకంటే, వాటికి సంబంధించి ఆయన డబ్బులు తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగ్స్ మొదలుపెట్టారు. కాబట్టి మధ్యలో వదిలేయడానికి వీల్లేదు. పవన్ కు కూడా అలా వదిలేసే ఉద్దేశం లేదు కానీ ఎప్పటికి పూర్తి చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడమే అటు నిర్మాతల్ని, ఇటు ఆయన అభిమానుల్ని తీవ్రంగా బాధిస్తోంది.

29 Replies to “వినోదం.. విందు.. ఓజీ”

  1. Kadupu nindataaniki syndicates gaa form ayyi, cheap gaa liquor isthunnaru kaani vindu kosam nityvasaraalu mandipotunnayi. Vaati gurinchi konchem choodu Sanatana saami.

    1. నిత్యావసర వస్తువుల ధరల గురించి ఇన్ని ఏళ్ల తర్వాత అయిన స్పందించినందుకు కృతజ్ఞతలు సోదరా.

      ఇన్నాళ్లు స్వర్గంలో ఉండి ఇప్పుడే భూమికి వచ్చిన మహాత్ముడు కనిపిస్తున్నాడు నీలో.

      స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటిదాకా నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు అందుబాటులో ఉండి ఈ మూడు నెలల లోనే విపరీతంగా పెరిగి పోయాయి కదా! నీ బాధ సహజం.

      నీ సామాజిక స్ఫూర్తి అనన్య సామాన్యం.

      1. Swatantryam vachinappati nundi managing sanatana swamulu rajakeeyaalu cheyyaledu. Ippudu swamulu rajakeeyam chestunnaru, syndicates form chesi percentages teesukuntunnaru constituency abhivriddi kosam, law and order gaali ki vodilesi tirugutunnaru. Inni chesina vallu, nityavasaraalu taggincha leraa enti?

        1. కుహన లౌకిక శక్తులు, కుహన ఉదార వాదులు భారత దేశ వ్యవస్థను, రాజకీయాలను తమ గుప్పెట్లో పెట్టుకొని మెజారిటీ హక్కులను అణగదొక్కి, మైనార్టీలకు విశేష అధికారాలు ఇచ్చారు.

          ప్రజల్లో వ్యతిరేకత పెరిగి పెరిగి ఈ అబద్ధపు రాజకీయ వాదుల కన్నా స్వాములే రాజ్య మేలితే తప్పేంటి అని ప్రజలు వారిని అందలం ఎక్కిస్తున్నారు.

          1. 75 ఏళ్ల నీరసత్వం, చేతకాని తనం , నిస్సత్తువ , బద్ధకం అజ్ఞానం వీడి ప్రజలు , నాయకులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.

            కంగారు పడకు. దేశానికి మంచి రోజులు నడుస్తున్నాయి.

  2. సినిమా నా బాధ్యత అని అన్నాడు అనుకోండి….. ఓట్లు వేసిన ప్రజలకి వెన్నుపోటు పొడిచి, కార్త్యవ్యాన్ని పక్కన నెట్టి సినిమాలు ముందుకు తీసుకు వెళ్తున్న పవన్ అని రాస్తారు….. అదే రాజకీయాలు మాత్రమే నా ప్రాధాన్యం సినిమా కాదు అంటే…. సినిమా నిర్మాతలు నమ్ముకుని కష్టాలు పడుతున్నారు అని రాస్తారు…. 2025 పవన్ వి 3 ఫిలిమ్స్ రిలీజ్ అవుతాయి….కొంచెం ఆలస్యం అయినా రావడం మాత్రం పక్కా

  3. నా వెనక అతిగా తిరగకుండా ముందు ఏదో ఒక పని చేసుకోండి అని అభిమానులకి సూచించటం నిజంగా గొప్ప విషయం…

Comments are closed.