సోషల్ మీడియాలో లారెన్స్ బిష్ణోయ్ అభిమాన వర్గాలు తయారయ్యాయి. ఫేస్ బుక్ లో అతడిని ఒక వీరోచిత ఇండియన్ గా, వీరోచిత హిందువుగా చిత్రీకరిస్తూ పోస్టులు దర్శనమిస్తున్నాయి! మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్ధిక్ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ హస్తముందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు పంజాబీ గాయకుడు మూసేవాలా ను కాల్చి చంపిన వ్యవహారంలోనూ ఇతడి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇతడు నేరచరితను కలిగిన వాడు. ఇండియాలో జైల్లో కాలం గడిపినవాడు. అయితే బయటకు వచ్చాడు, పోలీసులు కన్నుగప్పే విదేశాలకు పరారీ అయ్యాడో, లేక సహకారంతోనే పరార్ అయ్యాడో కానీ.. ఇతడు పరారీలో ఉన్న నేర చరితను కలిగిన వాడు!
అయితే బిష్ణోయ్ టార్గెట్ కేవలం సిద్ధిఖ్ తోనే పూర్తి కాలేదని, సల్మాన్ ఖాన్ ను ఇతడు హిట్ లిస్టులో పెట్టుకున్నాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇది వరకే అందుకు ప్రయత్నాలు జరిగాయని 25 లక్షలు ఇచ్చి సల్మాన్ ను కాల్చి చంపించేందుకు లారెన్స్ బిష్ణోయ్ ఆధ్వర్యంలో కుట్ర జరిగిందని హర్యానా పోలీసులు చెబుతున్నారు. హర్యానా అక్రమ ఆయుధాల వ్యవహారంలో ఒకడిని కదిలిస్తే మొత్తం వ్యవహారం బయటకు వచ్చిందట! పాకిస్తాన్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేశారట! ఈ కథలు ఇక్కడితో ఆగిపోవని స్పష్టం అవుతోంది.
అయితే ఎటొచ్చీ లారెన్స్ బిష్ణోయ్ ను కూడా హిందూ వీరుడిగా ప్రచారం చేయడం పరాకాష్ట! అతడు బిష్ణోయ్ తెగకు చెందిన వాడట, ఆ తెగవారు కృష్ణ జింకలను పరిరక్షకులట. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఉన్నాడు కాబట్టి సల్మాన్ ను అతడు చంపాలనుకుంటున్నాడట! ఇదట హిందూ ధర్మ పరిరక్షణ!
అయితే ఇక్కడ లారెన్స్ బిష్ణోయ్ ది కృష్ణ జింకలపై ప్రేమ కాదు! తను ఎక్కడో ఉండి, ఇండియాలో పొలిటీషియన్లను సినిమా స్టార్లను కాల్చి చంపించగలనని నిరూపించుకోవడం! తద్వారా సెటిల్ మెంట్లు, అదో పెద్ద మాఫియా! అచ్చంగా ఇతడిలో ఎదుగుతున్న ఒక దావూద్ ఇబ్రహీం అగుపిస్తున్నాడు. పాకిస్తాన్ లో దాక్కున్న దావూద్ ను ఇండియా ఎలాగైతే దశాబ్దాలకు దశాబ్దాలు గడుస్తున్నా బయటకు లాక్కురాలేకపోతోందో, ఇప్పుడు కెనాడాలో ఇండియా పాలిట ఒకో దావూద్ తయారవుతున్నట్టుగా ఉన్నాడు బిష్ణోయ్ రూపంలో! కెనడాలో ఇండియాకు వ్యతిరేకంగా ఏ జరుగుతున్నా ఏం చేయలేని పరిస్థితి ఇప్పటికే ఉంది.
భారతదేశం పతాకాన్ని నేల మీద వేసి తొక్కుతూ నిరసనలు చూపుతున్నారు ఖలీస్తానీలు. ఇప్పటికే కెనడాతో ఇండియా దౌత్య సంబంధాలను తెంచుకునే వరకూ వచ్చింది. ఇంత జరుగుతుంటే.. ఇంకా కృష్ణ జింకలు, హిందువు అంటూ.. వాడినో వీరోచితుడిగా చిత్రీకరించే మూర్ఖపు హిందుత్వవాదం సోషల్ మీడియాలో చెలరేగుతోంది! ఇది ఉత్తరాది పేజీల్లో బుసకొడుతూ ఉంది! బహుశా సిద్ధిఖ్ ను, సల్మాన్ ను టార్గెట్ చేయడంతో వీరిలో ఆనందం కలుగుతోందేమో, అయితే ఇలాంటి ఉగ్రవాదం దేశానికి అతి ప్రమాదకరం!
cry
Lode
తప్పేముంది? ఉగ్రవాదులు పెచ్చరిల్లుతున్నప్పుడు, జిహాదీలు ఇతర మతస్తుల మీద దౌర్జన్యం జరుపుతున్నప్పుడు, రైల్లో వెళుతున్న హిందూ యాత్రికులను సజీవదహనం చేసిన వారిని వెనకేసుకు వచ్చినప్పుడు, ఉగ్రవాదానికి మతం లేదని సర్టిఫికెట్ ఇచ్చిన గాడిదకొడుకుల మీద , రండపుత్రుల మీద కోపం, జిహాదీ ముష్కరులను చంపినవారి మీద ప్రేమగా మారుతుంది. ప్రతి అడ్డమైన గాడిదకొడుకూ సెక్యులరిజం పేరుతో జిహాదీగాళ్ళ దుర్మార్గాలను కప్పిపుచ్చటమే. లారెన్స్ విష్ణోయ్ జిహాదీ లను కాదు చంపాలిసింది, ఈ సెక్యులర్ తొత్తు కొడుకులను
ఇతనికి, ఖలిస్తాని గ్రూప్ లకు జరిగే గొడవల మధ్య కెనడా ప్రధాని ట్రూడో భారత ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నం చేసాడు. ఒక రకంగా ఇతన్ని ఖలిస్తానీయులకు, భారత దేశ సెపరేటిస్ట్స్ కు ఎదురు తిరిగే ఉగ్రవాదిగా కెనడా ప్రొజెక్ట్ చెయ్యడం వల్ల, అనుకోకుండా ఇతనికి ఈ టాగ్ వచ్చి పడింది. దానికి కొంతమంది ఉత్సాహం చూపించవచ్చు, కానీ దానికి హిందూ కోణం అని రాయడం తప్పు.
నీకో తెలియని ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు సొంత మనిషిలా భావించే ఆ జింకల మెడలో బొచ్చు తో తయారు చేసిన పంజరా, లేక విసన కర్ర తోనే గురు గ్రంధ సాహెబ్ ను విసురుతూ వుంటారు. ఈ శత్రుత్వం ఎదో యధాలాపంగా వచ్చింది కాదు.
అసలు ఈ జింకలకి హోలీ స్థానం ఎలా వచ్చింది అనేది ఇంకో చరిత్ర, అవన్నీ తెలుసుకో మిత్రమా.
His Target is not siks, only some of his enimies
ఇది సనాతన ధర్మం, అర్థం అయిందా.
సంభవామీ యుగే యుగే…
GA gaadiki kinda pettali earth. veedu raase chetha rathalu rotha puttisthunnayi. naaku telisi veedu converted. anduke ila hinduvula meeda mariyu chetha raathalu raasthunnadu
భారతీయ సనాతన ధర్మం స్థాపనకు ఇదో పోరాట పంథా. మనకు తెలియని చేగువేరా కంటే పర్వాలేదు కదా!
తిరుమల లడ్డులో ప0ది మాంసం కలిపిన జెగ్గులు గొర్రెని కూడా బిస్నోయ్ టార్గెట్ చేస్తే??
ఆవిడ ఎవరో ఓపెన్ గా బట్టలు విప్పేసిన యాక్ట్రెస్ కి ప్రత్యర్థి పార్టీ ల ను విమర్శలు చేసే యూట్యూబర్లు కి అభిమానులు ఉన్నపుడు ఇతనికి ఉంటే తప్పేముంది?
అది ఒక గ్లామర్ ఫీల్డ్ బ్రదర్ ఆమె ఒక లో క్లాస్ యాక్టర్ అండ్ టాకింగ్ about politics
వెధవలు మాత్రమే చూస్తారు
కానీ ఇక్కడ మతము మరియు దేవుడి నీ compare చేస్తున్నారు అది చాలా impact create చేస్తుంది
Sir: Once correction you may want to make. He is not in Canada. He is serving prison term for past 10 years and currently in Sabarmati High Security prison.
మీడియా చూడ్డం లా, మనకు అస్సలు సంబంధం లేని లేబనాన్, hamas టెర్రరిస్ట్ లని ఇజ్రాయెల్ చంపుతుంటే అక్కడ ఒకరిని చంపుతే ఇక్కడ మా ఇంట్లో ఇంకొకరు పుడతారు అని భారత్ లో ప్రదర్శన లు చెయ్యడం లేదా?
Hamas, లేబనన్ వాళ్ళకి మద్దతుగా ప్రదర్శన లు చేస్తే లేని ఆశ్చర్యం ఇప్పుడు వచ్చిందా?
పశ్చిమ ఆసియా ఉ*గ్ర*వా*దులకి అనుకూలంగా ప్రదర్శన లు చేసినప్పుడు రాని ఆశ్చర్యం ఇప్పుడు వచ్చిందా?