బాలీవుడ్ పై సౌత్ సినిమా డామినేషన్ మొదలై చాన్నాళ్లయింది. ఈ విషయాన్ని అందరూ అంగీకరించినప్పటికీ, కొంతమంది మాత్రం ఇంకా ఒప్పుకోలేకపోతున్నారు. అందుకే ప్రతి చిన్న విషయానికీ ట్రోలింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.
మొన్నటికిమొన్న ప్రభాస్ పై అర్షద్ వార్సీ ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడో అందరం చూశాం. దాన్ని ఖండించినందుకు హీరో నానిపై నార్త్ లో ఓ సెక్షన్ విరుచుకుపడింది. ఇప్పుడు మరో సౌత్ హీరోపై ట్రోలింగ్ మొదలైంది. ఈసారి బాడీ షేమింగ్ మొదలుపెట్టారు కొంతమంది ఉత్తరాది నెటిజన్లు.
హీరో సూర్య ఈమధ్య ఉత్తరాదిన పర్యటించాడు. తన సినిమా ‘కంగువా’ ప్రమోషన్స్ లో అతడు చురుగ్గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా బాబీ డియోల్, దిశా పటానీతో సూర్య దిగిన ఫొటోలను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వాళ్లిద్దరి కంటే సూర్య చాలా పొట్టిగా ఉన్నాడంటూ బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టారు.
వివాదాలకు దూరంగా ఉండే సూర్య, చాలా విషయాల్ని స్పోర్టివ్ గా తీసుకుంటాడు. ఈ ట్రోలింగ్ ను కూడా అతడు లైట్ తీసుకున్నాడు. తన హైట్ గురించి స్వయంగా తనే కామెంట్స్ చేశాడు. ‘కంగువా’ సినిమాలో ఎత్తుగా ఉన్న బాబీ డియోల్ తో యుద్ధ సన్నివేశాల్లో నటించడానికి తనకు మానసికంగా ఇబ్బంది అయిందని, ఎంతో శక్తిని కూడగట్టుకోవాల్సి వచ్చిందన్నాడు.
దీనిపై బాబీ డియోల్ కూడా స్పందించాడు. భౌతికంగా సూర్య తక్కువ ఎత్తులో ఉండొచ్చని, కానీ ఓ నటుడిగా అతడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడని మెచ్చుకున్నాడు.
కనీసం బాబీ డియోల్ స్పందన చూసిన తర్వాతైనా సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఆపితే బెటర్. ఇదే ఉత్తరాది జనం ‘సురారై పొట్రు’ సినిమాలో సూర్య యాక్టింగ్ ను మెచ్చుకుంటూ, ఆ సినిమా రీమేక్ లో నటించిన అక్షయ్ కుమార్ నటనను తప్పుపట్టారు.
vc estanu 9380537747
ika ram charan, allu arjun, jr.ntr la paristhithi ento?
Some better than Surya
Vallu andharu potiii vallu nijam kadha
OK Bollywood…next time Surya will stand next to Amir Khan … OK ?
What about Amirkhan ..Rishi kapoor..Govindaa …???
they comparing with heroine’s height, not Deol.
Call boy works 9989793850