జానీ మాస్టర్ కు బెయిల్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. 2 వారాలుగా చంచల్ గూడ జైళ్లో ఉన్న అతడికి బెయిల్ దొరికింది. కేసు విచారణ దాదాపు కొలిక్కి రావడంతో జానీ మాస్టర్ ను ఇంకా…

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. 2 వారాలుగా చంచల్ గూడ జైళ్లో ఉన్న అతడికి బెయిల్ దొరికింది. కేసు విచారణ దాదాపు కొలిక్కి రావడంతో జానీ మాస్టర్ ను ఇంకా జైళ్లోనే కొనసాగించడంలో అర్థం లేదని అభిప్రాయపడిన హైకోర్టు.. ఈ మేరకు అతడికి బెయిల్ మంజూరు చేసింది.

జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అతడిపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించడంతో పాటు.. అత్యాచారం చేసిన టైమ్ లో తను మైనర్ నని ఆమె పేర్కొనడం పెద్ద వివాదానికి దారితీసింది.

దీంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు, జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారు. పూర్తిస్థాయిలో కోర్టుకు ఛార్జ్ షీట్ సమర్పించారు. ఈ గ్యాప్ లో చాలా జరిగింది.

జానీ మాస్టర్ కు జాతీయ అవార్ట్ వచ్చింది. దాన్ని స్వీకరించేందుకు బెయిల్ ఇవ్వాలని అతడు కోరగా, కోర్టు అంగీకరించింది. అయితే బెయిల్ వచ్చిన మరుసటి రోజే, అతడికి ఇవ్వాల్సిన జాతీయ అవార్డు రద్దయింది. దీంతో బెయిల్ కూడా రద్దయింది.

మరోవైపు జానీ మాస్టర్ భార్య, మహిళా కొరియోగ్రాఫర్ కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నో ఆడియోలు, మరికొన్ని వీడియోలు లీక్ అయ్యాయి. ఒక దశలో జానీ మాస్టర్ మేనల్లుడు, సదరు మహిళ కొరియోగ్రాఫర్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు వేశాడు.

ఇలా కేసు రకరకాల మలుపులు తిరుగుతున్న క్రమంలో, జానీ మాస్టర్ కు కోర్టు బెయిల్ ఇవ్వడం విశేషం.

6 Replies to “జానీ మాస్టర్ కు బెయిల్”

Comments are closed.