జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఉమ్మ‌డి క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అసంతృఫ్తిగా ఉన్న‌ట్టు తెలిసింది. అందుకే ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్దిరెడ్డి…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఉమ్మ‌డి క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అసంతృఫ్తిగా ఉన్న‌ట్టు తెలిసింది. అందుకే ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్దిరెడ్డి డుమ్మా కొట్టిన‌ట్టు తెలిసింది.

వైసీపీలో త‌న‌కు ప్రాధాన్యత విష‌యంలో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రి పెద్దిరెడ్డికి ఏ మాత్రం న‌చ్చ‌డం లేద‌ని తెలిసింది. అందుకే జ‌గ‌న్‌కు త‌న అసంతృప్తి, ఆవేద‌న తెలియాల‌నే ఉద్దేశంతోనే ఆయ‌న ఉన్నార‌ని స‌మాచారం. స‌హ‌జంగా వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న వుందంటే, అంత‌కు ముందు ఉన్న షెడ్యూల్‌లో పెద్దిరెడ్డి మార్పు చేసుకునే వార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు.

అయితే ఇటీవ‌ల జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై పెద్దిరెడ్డి అసంతృప్తిగా ఉండ‌డం, కోఆర్డినేట‌ర్ నియామ‌కంలోనూ, అలాగే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడిగా త‌ప్పించ‌డంపై పెద్దిరెడ్డి గుర్రుగా ఉన్న‌ట్టు ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. దీంతో వైఎస్సార్ జిల్లా బ‌ద్వేల్‌లో బుధ‌వారం జ‌గ‌న్ ప‌ర్య‌టిస్తార‌ని తెలిసి కూడా పెద్దిరెడ్డి కుటుంబం… ఆ ముందు రోజు రాత్రి షిరిడీకి వెళ్ల‌డం గ‌మ‌నార్హం.

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దంప‌తుల‌తో పాటు ఆయ‌న త‌న‌యుడైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి కూడా షిరిడీ వెళ్లిన‌ట్టు తెలిసింది. పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి ఉమ్మ‌డి అనంత‌పురం, నెల్లూరు జిల్లాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఇటీవ‌ల నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే.

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో తాను చేయ‌గ‌లిగేదేమీ లేద‌నేది పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి భావ‌న‌. ఎందుకంటే ఆ జిల్లా వైఎస్ జ‌గ‌న్ అడ్డా. దీంతో జ‌గ‌న్‌ను కాద‌ని, తాను ఏ నిర్ణ‌యాన్ని తీసుకునే ప‌రిస్థితి లేద‌ని పెద్దిరెడ్డి ఉద్దేశం. ఉమ్మ‌డి వైఎస్సార్‌ జిల్లాలో జ‌గ‌న్ లేదా ఆయ‌న సోద‌రుడు, క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రాజ‌కీయంగా చూసుకుంటారు. ఇత‌రుల్ని వారు వేలు పెట్ట‌నివ్వ‌రు. అలాంట‌ప్పుడు త‌న‌కు ఉమ్మ‌డి వైఎస్సార్ జిల్లా బాధ్య‌త‌లు ఎందుకు ఇవ్వాల‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు.

అలాగే ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కులున్నార‌ని, వాళ్లంతా జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా వుంటార‌ని, తాను చెప్పినా వినే ప‌రిస్థితి ఉండ‌ద‌ని పెద్దిరెడ్డి ఆలోచ‌న‌గా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న అసంతృప్తి, ఆవేద‌న‌ను తెలియ‌జేయ‌డానికే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్దిరెడ్డి డుమ్మా కొట్టిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆగ్ర‌హంగా ఉండ‌డం, ఆయ‌న్ను ఎలా చ‌ల్లార్చుతార‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

26 Replies to “జ‌గ‌న్‌పై పెద్దిరెడ్డి అసంతృప్తి…!”

  1. ఇంకా ఎన్ని దరిద్రాలు ఉన్నాయి సామి.. ఈ పార్టీ లో..

    ఇక ఆలస్యం దేనికి.. ఈ దారిద్య్రాన్ని కూడా చంద్రబాబు మీద తోసేయండి..

    జగన్ రెడ్డి చేతగానితనాన్ని… అతనికి బలం గా మార్చాలని తెగ కష్టపడుతుంటారు..

    1. కుదిరినన్ని రోజులు ఆయన మేతకి వీర విధేయుడు అని రాశి, కుదరకపోతే చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని రాయటం “అదేదో” తిని రాసే సా-ఛీ కి ఎంకటికి అలవాటేగా..

  2. “ అందుకే ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో వైxఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పెద్దిరెడ్డి డుమ్మా కొట్టిన‌ట్టు తెలిసింది”

    డుమ్మా కొట్టి? College బుల్లోడిలాగా ‘bloody beggars’ cinemax కి వెళ్లాడా?

  3. 11 మంది బొచ్చులొ పార్టిలొ మళ్ళా అసంత్రుప్తులు కూడానా? వాది పార్టిని వదిని పొతాడెమొ చూసుకుంది!

      1. 2024 లీ 175 కి 175 తెచ్చుకుంటామని అన్న బాండ్ రాసినట్లు మేము 11 తెచ్చుకుంటామని కూటమి బాండ్ రాయాలా?! అర్థం కాలేదు?!

  4. వారం రోజుల నుంచి మోషన్ అవనట్టుంటే ఈ ఫేస్ కూడా అసంతృప్తి అంటే ఇంకా లెవెనోడి పరిస్థితి ఎంటో..

  5. గుణంలో గుడ్డిసేటు..

    అందంలో అవినాష్..

    దానంలో భారతీ..

    కోపంలో బాబాయ్..

    బలంలో కోడికత్తి..

    ప్రేమలో శ్రీరెడ్డీ..

    అన్నీ కలగలిపితే మా అయోమయం జగనన్న

  6. pani cheyaraa peddi reddi ante pakka constituency lo aa roja reddi ki poga pettadu. veedike bocchu voodipoyindi. veedoka leader. reddi leaders aa bonga. Janasena is the next power. ignore this Ycheepee.

Comments are closed.