వైసీపీలో ఎవ‌రీ శ్రీ‌హ‌రి… ఈయ‌న ఆదేశాలేంటి?

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దంటారు. కానీ శ్రీ‌హ‌రి ఆజ్ఞ లేనిదే వైసీపీలో ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ట‌! పోనీ ఈయ‌న గారేమైనా మ‌హాజ్ఞానా …అంటే అదేమీ లేదు. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి…

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దంటారు. కానీ శ్రీ‌హ‌రి ఆజ్ఞ లేనిదే వైసీపీలో ఎవ‌రూ మాట్లాడ‌కూడ‌ద‌ట‌! పోనీ ఈయ‌న గారేమైనా మ‌హాజ్ఞానా …అంటే అదేమీ లేదు. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి త‌న పార్టీకి శ్రీ‌హ‌రి లాంటి వ్య‌క్తిని చీఫ్ పీఆర్వోగా పెట్టుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజే వైసీపీ మీడియా వ్య‌వ‌హారాలు చూసే జీవీడీ కృష్ణ‌మోహ‌న్ వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ల పాటు వైసీపీకి మీడియా ప‌రంగా సేవ‌లందించార‌నే కార‌ణంతో ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌ను ఏపీ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారుడిగా నాడు నియ‌మించారు. జీవీడీనే జ‌గ‌న్‌కు ప్ర‌సంగాలు రాయించేవారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హుభార్య‌త్వం, అలాగే చంద్ర‌బాబును క‌ల‌వ‌డానికి ష‌ర్మిల ప‌సుపు చీర‌లో వెళ్ల‌డాన్ని కూడా జ‌గ‌న్ విమ‌ర్శ‌లు చేసేలా ప్ర‌సంగం రాయించిన ఘ‌న‌త జీవీడీకే ద‌క్కింద‌ని వైసీపీ నేత‌లు అంటుంటారు. జీవీడీ వెళ్లిపోయిన త‌ర్వాత ఆ బాధ్య‌త‌ల్ని పూడి శ్రీ‌హ‌రికి అప్ప‌గించారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో చీఫ్ పీఆర్వోగా పూడి శ్రీ‌హ‌రి అధికారాన్ని వెల‌గ‌ట్టారు. ఈయ‌న సాక్షి ఛానెల్‌లో ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర గురించి అడుగ‌డుగునా అంత‌రంగం అనే పుస్త‌కాన్ని రాశారు. ఈ పుస్త‌కంతో జ‌గ‌న్‌కు శ్రీ‌హ‌రి మ‌రింత చేరువ‌య్యారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో శ్రీ‌హ‌రి చిల‌క్కొటుడుపై తీవ్ర విమ‌ర్శ‌లున్నాయి. ఈయ‌న గారి అవినీతిపై తిరుప‌తికి చెందిన స్థానిక మీడియాలో క‌థ‌నం కూడా అప్ప‌ట్లో వెలువ‌డింది.

శ్రీ‌హ‌రి గురించి అన్నీ తెలిసినా ప్ర‌భుత్వంలో చీఫ్ పీఆర్వోగా పెట్టుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. వైసీపీ హ‌యాంలో జీవీడీ కృష్ణ‌మోహ‌న్‌, అలాగే శ్రీ‌హ‌రి ఇత‌ర మీడియా సంస్థ‌ల‌తో క‌నీస సంబంధాలు కూడా నెర‌ప‌లేదు. ప్ర‌భుత్వంపై విచ్చ‌ల‌విడిగా వ్య‌తిరేక క‌థ‌నాలు వ‌స్తున్నా, అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అంతేకాదు, వాటిని తిప్పికొట్టేలా శ్రీ‌హ‌రి చేసిన ఘ‌న కార్యాలేంటో ఆయ‌న‌కే తెలియాలి.

వైసీపీ అధికారం కోల్పోయిన త‌ర్వాత పార్టీకి చీఫ్ పీఆర్వోగా శ్రీ‌హ‌రి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈయ‌న గారు చెబితేనే వైసీపీ నాయ‌కులెవ‌రైనా మీడియా ముందుకెళ్లాల‌ట‌. ఈయ‌న రాయించిందే ఆ నాయ‌కులు చెప్పాల‌ట‌. పోనీ గొప్ప‌గా ఏమైనా రాయిస్తున్నారా? అంటే… అబ్బే అని వైసీపీ నేత‌లు నిట్టూర్చుతున్నారు. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ప్పుడు బుడ‌మేరు గేట్లు ఎత్తార‌ని జ‌గ‌న్ అజ్ఞానంతో మాట్లాడ్డారంటే, అది శ్రీ‌హ‌రి మేధో ఘ‌న‌తే.

బుడ‌మేరు అనేది ఒక ఏరు మాత్ర‌మే అని, అది ప్రాజెక్టు కాద‌ని, గేట్లు వుండ‌వ‌ని జ‌గ‌న్‌పై సోష‌ల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జ‌రిగింది. ఇట్లుంట‌ది మ‌రి శ్రీ‌హ‌రి మేధావిత‌నం. అయినా శ్రీ‌హ‌రిని త‌ప్పు ప‌ట్టాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే, అత‌నికి తెలిసింది మాత్ర‌మే రాస్తారు. రూపాయి తెలివి తేట‌లుంటే, వంద రూపాయిల ఫ‌లితాల్ని ఎలా ఆశిస్తారు? శ్రీ‌హ‌రి లాంటి వాళ్ల‌ను త‌న పార్టీ మీడియాకు ర‌థ‌సార‌థిగా నియ‌మించుకున్న జ‌గ‌న్‌ను తిట్టాలి.

అయినా సొంత పార్టీకి బ‌ల‌మైన మేధా సంప‌త్తిని క‌లిగి వుండాల‌నే కోరిక జ‌గ‌న్‌కు లేన‌ట్టుంది. కేవ‌లం త‌న‌ను కీర్తించే వాళ్లకు ఏదో ఒక ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌నే త‌ప‌న మిన‌హాయిస్తే, చుట్టూ విష‌య ప‌రిజ్ఞానం, న‌మ్మ‌క‌స్తులైన వ్య‌క్తుల‌ను నియ‌మించుకోవాల‌ని జ‌గ‌న్‌కు లేక‌పోవ‌డంపై జాలి చూప‌డం మిన‌హాయిస్తే, చేయ‌గ‌లిగేదేమీ ఉండ‌దు. వైసీపీ ఎందుకు ఇట్లా త‌యారైందో శ్రీ‌హ‌రి పాత్రే నిలువెత్తు నిద‌ర్శ‌నం. శ్రీ‌హ‌రికి ఏమీ తెలియ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు.

శ్రీ‌హ‌రి త‌న‌కు తెలుసు క‌దా అని జ‌గ‌న్ అనుకుంటున్న‌ట్టున్నారు. ఇప్పుడు శ్రీ‌హ‌రి వైసీపీ మీడియాను ముందుకు న‌డిపిస్తార‌ట‌. వైసీపీలో ఇలాంటి ఘోరాల్ని చూస్తుంటే… ఎవ‌రైనా రెండు చేతులు జేబులో పెట్టుకుని, ఏం జ‌రుగుతుందో తెలియ‌క అలా ముందుకెళుతుంటారు. జ‌గ‌న్ పార్టీ, నియామ‌కాలు, నిర్ణ‌యాలు, ఆదేశాలు… అన్నీ ఆయ‌న ఇష్టం. చేజేతులా పార్టీని ముందుకోవాల‌ని జ‌గ‌న్‌కు ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా చేయ‌గ‌లిగేదేముంటుంది? అంతా ఆ శ్రీ‌హ‌రి మ‌యం. గోవింద గోవిందా!

13 Replies to “వైసీపీలో ఎవ‌రీ శ్రీ‌హ‌రి… ఈయ‌న ఆదేశాలేంటి?”

  1. వెనకటి రెడ్డి భాద ఏమిటి అంటే,

    ఇంత కట్టు బానిస గ వున్న తనని వదిలేసి

    సజ్జలు, శ్రీహరి లాంటి వాళ్ళ కీ ఆ పోస్టు లు ఇస్తున్నారు ఏమిటా అని

  2. G A…నీకు దండాలు సామీ….జగన్ కు ఇంత padding అవసరం అని ఇంతకు ముందు తెలవదు…తెలిస్తే 2019 లో ఓటు వేసే వాడినే కాదు…

  3. జగన్ మోహన్ రెడ్డి సత్య నిష్ఠ పతనం: కుటుంబానికి, ప్రజలకు ద్రోహం చేసే నాయకత్వం

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన స్వంత కుటుంబంతో వ్యవహరించిన తీరును చూస్తే, అది నిజంగా కలత కలిగించే విషయం. తల్లి, అక్కలతో జరిగిన వివాదాలు, న్యాయపరమైన పోరాటాలు ఆయన గౌరవం, విశ్వాసం, న్యాయం వంటి ప్రాథమిక విలువలను గౌరవించడంలో విఫలమయ్యారని స్పష్టంగా చూపిస్తున్నాయి. తన కుటుంబానికి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు న్యాయంగా సేవ చేసే సామర్థ్యం ఎక్కడుంది?

    2024 ఎన్నికల్లో ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 175 స్థానాల్లో కేవలం 11 సీట్లు మాత్రమే జగన్ పార్టీకి ఇచ్చారు, గతంలో సాధించిన 151 సీట్ల నుండి ఇది భారీ పతనం. ఈ ఘోర పరాజయం ప్రజలు ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారని స్పష్టంగా తెలియజేస్తుంది. స్వార్థపరమైన నాయకత్వం మరియు ద్రోహాన్ని ప్రజలు సహించరని గుర్తుంచుకోవాలి.

    “కుటుంబ విషయాలు వ్యక్తిగతం” అని కొట్టిపారేయడం సరికాదు. ప్రజా పదవిలో ఉన్నప్పుడు, వ్యక్తిగత విలువలు నాయకత్వంపై ప్రతిబింబిస్తాయి. జగన్ చేసిన ద్రోహం, ప్రజలు అతనిపై ఉంచిన విశ్వాసాన్ని ద్రోహం చేయడమే. ఇది నాయకుడిగా ఆయన సత్య నిష్ఠకు చేసిన అవమానం.

    మనందరికీ మేలుకొలుపు: ప్రజలు న్యాయం, నిజాయితీ గల నాయకులను మాత్రమే మద్దతు ఇవ్వాలి. కేవలం పదవిలో ఉండటం సరి కాదు; ప్రజలు విలువలకు గౌరవం ఇచ్చే నాయకులను కోరుకుంటున్నారు. నాయకులు కరుణ, న్యాయం, బాధ్యత వంటి విలువలను పాటించాలి, అప్పుడే సత్య నిష్ఠతో ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవచ్చు.

  4. ఒకవక్క వెస్తుగాడు….అంటూ….మీరు…..ఇయన గారి గురించి….ఇంత పెద్ద….వ్యాసము…..రాయవలసిన…..పనేమిటి…..మేరు ఇంత. కంటె…..వెస్టుగాల్ల……లేక….అతను….బలమైనవాడా…..

Comments are closed.