టీటీడీ బోర్డులో దక్కని చోటు

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఇరవై నాలుగు మంది మెంబర్స్ తో బోర్డు కూర్పు చేశారు. చైర్మన్ గా బీఆర్ నాయుడుని ఎంపిక చేశారు. టీటీడీ బోర్డు విషయం చూస్తే ఉత్తరాంధ్రకు చోటు…

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఇరవై నాలుగు మంది మెంబర్స్ తో బోర్డు కూర్పు చేశారు. చైర్మన్ గా బీఆర్ నాయుడుని ఎంపిక చేశారు. టీటీడీ బోర్డు విషయం చూస్తే ఉత్తరాంధ్రకు చోటు దక్కలేదు. చాలా మంది ఈ కీలకమైన నామినేటెడ్ పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవి తనకు దక్కుతుందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఆశించారు అని ప్రచారంలో ఉంది. ఆయనకు అయితే ఆ చాన్స్ దక్కలేదు.

టీటీడీ బోర్డు మెంబర్ గా ఉత్తరాంధ్ర నుంచి గతంలో కొందరిని తీసుకున్నారు. ఈసారి మంత్రి పదవి దక్కని వారిని టికెట్ దక్కని ఆశావహులను బోర్డులో అవకాశం ఇచ్చి న్యాయం చేస్తారు అని ప్రచారం సాగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్ కి బోర్డు మెంబర్ ఇస్తారు అని అనుకున్నారు. అది అయితే జరగలేదు

గతంలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బోర్డు మెంబర్ ఇచ్చారు. ఆయన మంత్రి పదవి ఆశిస్తే ఈ పదవితో సరిపెట్టారు అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వంగలపూడి అనితకు బోర్డు మెంబర్ ఇచ్చారు.

అంతకు ముందు టీటీడీ బోర్డు మెంబర్ గా చాలా మందికి అవకాశం దక్కింది. ఈసారి మాత్రం ఉత్తరాంధ్రలోని ఉమ్మడి మూడు జిల్లాలకు చెందిన వారికి అవకాశం అయితే దక్కలేదు. దాంతో చాలా మంది నిరాశ చెందారు అనే అంటున్నారు. శ్రీవారి సేవలో తరించాలనుకునే వారికి ఈ పదవి ఎంతో విలువైనది. అయితే ఉత్తరాంధ్రాలో మాత్రం ఎవరికీ ఆ భాగ్యం లభించకపోవడం పట్ల కొంత ఆవేదన అయితే ఉంది. బోర్డు పదవీ కాలం రెండేళ్ళే కాబట్టి మరో విడతలో చాన్స్ ఇస్తారేమో అని సరిపెట్టుకోవాల్సిందే.

12 Replies to “టీటీడీ బోర్డులో దక్కని చోటు”

  1. ఇలా న్యూస్ రిలీజ్ అయ్యిందో లేదో నీకు ఆల్రెడీ నిరాశ చెందిన బ్యాచ్ గురించి తెలిసిపోయిందా ఎంకటి…

  2. బోడి గుండు కొట్టించుకుని మోకాళ్ళతో పైకి కొండ పైకి వస్తె జగన్ కి కూడా ఇస్తారు ఒక అవకాశం. మరి జగన్ రెడీ యేనా ?

  3. Where is Sanatani who shook on the stage and shouted for boards to not be filled with political leaders? Why is he silent when someone who is accused with drugs cases is appointed as chairman and board is filled with political leaders?

  4. ఎన్నెన్నో అనుకుంటారు.. అన్ని జరుగుతాయా ఏంటి

    హిందూ ల కే ఇచ్చారు.. మంచిరోజులు వచ్చినట్టు ఉన్నాయి

Comments are closed.