చాలా మంది సెలబ్రిటీల గురించి సినిమాలు, బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. వీటిల్లో కొన్ని సదరు సెలబ్రిటీ భౌతికంగా దూరం అయ్యాకా వచ్చినవి, మరి కొన్ని సదరు సెలబ్రిటీల ఆమోదముద్ర పొంది విడుదలైనవి. గమనిస్తే.. లివింగ్ లెజెండ్ ల బయోపిక్స్ పెద్దగా జనాలకు పట్టలేదు! ఏవో రెండు మూడు తప్ప! ఇప్పుడు నయనతార జీవితకథ గురించి డాక్యుమెంటరీ వస్తోంది. దీన్ని నెట్ ఫ్లెక్స్ తీసి విడుదల చేస్తూ ఉంది. నయనతార.. బియాండ్ ది ఫెయిరీ టేల్ అనేది దీని టైటిల్. నయనతార 40వ పుట్టిన రోజు సందర్భంగా ఇది నవంబర్ లో విడుదల కాబోతోంది!
ఇంత వరకూ బాగానే ఉంది కానీ, నయనతార కేవలం సినిమా వార్తల ద్వారా మాత్రమే నిలిచిన హీరోయిన్ కాదు! ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా బోలెడన్ని సార్లు చర్చలు జరిగాయి. కెరీర్ ఆరంభంలోనే నయనతార ప్రేమ పురాణం దుమారం రేపింది. శింబుతో ఆమె ముద్దులు పెట్టుకుంటూ ఫొటోలు దిగి ఉండటం. అవి వెలుగు చూడటం దాదాపు ఇరవై యేళ్ల కిందటే దుమారం! సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే అవి వైరల్ వైరల్ అయ్యాయి! పత్రికల్లో ప్రచురితం అయ్యాయి!
ఆ తర్వాత శింబుతో బ్రేకప్ కు మించి నయనతార వార్తల్లో నిలిచింది. ప్రభుదేవాతో ప్రేమబంధంతో కొన్నాళ్ల పాటు ఆమె మీడియాకు వార్తలను ఇచ్చింది. అప్పటికే పెళ్లైన వాడితో ప్రేమ వ్యవహారం కావడంతో అది మరింత రసవత్తరంగా నిలిచింది. నయనతార కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ కథలో కూడా మళ్లీ ట్విస్టు. దీర్ఘకాలమే అతడితో వ్యవహారం నడిపి, ఇక సినిమాలకు సెలవు అని ప్రకటించేసి.. నయనతార ప్రభుదేవా నుంచి వేరేపడింది! పెళ్లి వరకూ వెళ్లిందనుకున్న ఆ ప్రేమ కథకు అలాంటి ట్విస్టుతో మళ్లీ నయనతార సినిమాలతో బిజీ అయిపోయింది. ఒక ప్లేబాయ్ తరహా హీరోతో ప్రేమాయణం అది బ్రేకప్, ఆ పై పెళ్లైన వాడితో ప్రేమాయణం అది కూడా బ్రేకప్! ఇలా మీడియాలో నయనతార నిత్యం నానింది.
అయితే ఇన్ని జరిగినా, ఆమె కెరీర్ మాత్రం ప్రవర్ధమానంగా సాగింది, సాగుతూనే ఉంది! దక్షిణాదిన గత ఇరవై యేళ్ల నుంచి దాదాపు ఒకే డిమాండ్ తో కెరీర్ సాగిస్తున్న ఇద్దరు ముగ్గురు నటీమణుల్లో నయనతార ముందు నిలుస్తుంది. తొలి పది సినిమాల్లోపే కోటి రూపాయల స్థాయి రెమ్యూనిరేషన్ ను అందుకున్న నయనతార ఎప్పుడో ఐదు కోట్లు, ఆరు కోట్లు వంటి నంబర్ల స్థాయిని అందుకుంది. ఇప్పుడు ఆమె స్థాయి ఎనిమిది కోట్ల రూపాయలకు పైనే అనే టాక్ ఉంది.
తనే ప్రధాన పాత్రలో బోలెడు సినిమాలను చేసింది. అలా కెరీర్ సూపర్ గా ఉన్నట్టుగానే.. మరో ప్రేమాయణం, అది కూడా పెళ్లికి ముందు చాన్నాళ్ల పాటే నడిచినా, ఎట్టకేలకూ పెళ్లి జరిగింది. సరోగసి పద్ధతిలో పిల్లలను కూడా కలిగింది. ఇప్పుడు కూడా నయనతార చేతి నిండా సినిమాలున్నాయి. భర్త దర్శకుడు. షూటింగ్ విరామాల్లో షికార్లు చేస్తూ ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటుంది.
మరి వెనక్కు చూస్తే.. నయనతార గురించిన ఇలాంటి బోలెడు వార్తలే కనిపిస్తాయి. వీటి గురించి ఆమె లైఫ్ డాక్యుమెంటరీలో కొత్త విషయాలను ఏమైనా చెబుతారా లేక.. అంతా ఆమెకు అనుకూలంగానే డ్రామాను చూపిస్తారా అనేది అది విడుదల అయితే కానీ తెలియదు.
నయనతార అండదండలతోనే ఈ డాక్యుమెంటరీని రూపొందించారని స్పష్టం అవుతోంది. కాబట్టి.. దాదాపుగా మొత్తం కథను ఆమె చెప్పాలనుకున్నట్టుగా చెప్పవచ్చు. ఎలాగూ డాక్యుమెంటరీ తీస్తున్నందుకే నయనతారకు బోలెడంత డబ్బు దక్కి ఉండే అవకాశమూ ఉంది. సర్వం పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇది ఆమెకు అవకాశం కూడా!
Call boy jobs available 9989793850
Ivida commitments gurinchi kuda chupinchali biopic lo appude nijalu chupinchi natlu
vc estanu 9380537747