Lucky Baskhar Review: మూవీ రివ్యూ: లక్కీ భాస్కర్

విద్యావంతులకి కూడా అర్ధం కాని బ్యాంకింగ్ స్కాం సబ్జెక్టుని సామాన్యుడికి అర్ధమయ్యే తీరులో చెప్పాడు దర్శకుడు.

చిత్రం: లక్కీ భాస్కర్
రేటింగ్: 3/5
తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, హైపర్ ఆది, మానస, సూర్య శ్రీనివాస్, సచిన్ ఖేదేకర్, సాయి కుమార్ తదితరులు
ఎడిటింగ్: నవీన్ నూలి
కెమెరా: నిమిష్ రవి
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: వెంకి అట్లూరి
విడుదల: 31 అక్టోబర్ 2024

దుల్కర్ సల్మాన్ కి తెలుగునాట ఫాలోయింగ్ ఉంది. అది మహానటి నుంచి మొదలయ్యింది. సీతారామంతో కొనసాగింది. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వం పట్ల ప్రేక్షకులకి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఆసక్తి కలగడం సహజం. దానికి తోడు ట్రైలర్ కూడా గ్రిప్పింగ్ గా అనిపించింది. పీరియడ్ బ్యాక్ డ్రాపులో నవరసాలు ఉన్న ఒక సీరియస్ స్టోరీ చెప్తున్నాడనే అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయాన్ని ఈ చిత్రం ఎంతవరకూ నిలబెట్టిందో చూద్దాం.

కథ 1992 లో భాస్కర్ (దుల్కర్) తనని తాను పరిచయం చేసుకోవడంతో మొదలవుతుంది. అక్కడి నుంచి మూడేళ్ల వెనక్కి అంటే 1989 కి తీసుకువెళ్తాడు. ముంబాయిలోని మగధ బ్యాంకులో కేషియర్ గా పనిచేస్తుంటాడు భాస్కర్. అతనివి మధ్య తరగతి కష్టాలు. భార్య సుమతి (మీనాక్షి) ని బాగా చూసుకోవాలని ఉంటుంది భాస్కర్ కి. అతని తండ్రి ప్రహ్లాద్ (సర్వదమన్ బెనర్జీ) కి అనారోగ్యం. పైగా కాలేజీలో చదువుకునే తమ్ముడు, పెళ్లీడుకొచ్చిన చెల్లెలు. వీళ్లందర్నీ గట్టెక్కించాలంటే తనకొచ్చే 6000 నెలజీతం చాలదు. పైగా అప్పుల బాధలు. వీటన్నింటినీ ఛేదించుకుని ముందుకెళ్ళే అవకాశాన్ని చూస్తాడు భాస్కర్. అయితే తాను ఎంచుకున్న మార్గం ఇల్లీగల్. అయినా తన తెలివితో తన పథకాన్ని ఎలా అమలు చేసి అంచలెంచులుగా ఎదుగుతాడు, ఎలాంటి చిక్కుల్లో పడతాడు, ఆ చిక్కుల్లోంచి బయట పడతాడా లేదా అనేది కథ.

ఈ తరహా కథ ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు. హిందీలో అయినా “స్కాం 1992” అనే హర్షద్ మెహతా కథ ఓటీటీలో సిరీస్ గా వచ్చింది తప్ప సినిమాగా రాలేదు. కనుక ఇది వెండితెర మీద కొత్త యాంబియన్సే అని చెప్పాలి. 1990ల నాటి ఆర్ధికమోసాల నేపథ్యంలో కథని రాసుకోవడం బాగుంది.

ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలాగ, జంక్ సీన్లు, అవసరం లేని పాటలు పెట్టకుండా కథనాన్ని నడిపించిన తీరుని మెచ్చుకోవాలి. విద్యావంతులకి కూడా అర్ధం కాని బ్యాంకింగ్ స్కాం సబ్జెక్టుని సామాన్యుడికి అర్ధమయ్యే తీరులో చెప్పాడు దర్శకుడు.

సినిమా మొత్తానికి ప్రధానమైన లొకేషన్లు మూడే. బ్యాంక్, ఇల్లు, గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర వడా పావ్ బండి. మధ్యలో ఒకటి రెండు బిట్లు షిప్ యార్డులోనూ, రోడ్ మీద కనిపిస్తాయి. మొత్తం సంభాషణల మీద, సన్నివేశాల మీద నడిచే చిత్రం. పైకి కమెర్షియల్ ఎలిమెంట్ ఏదీ ఉన్నట్టు ఉండదు. అయినా కమర్షియల్ సినిమాలా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రానికి బాగా ప్లస్ అయిన అంశం కథన రచన, దర్శకత్వం. ఆ రెండిటితో పాటు కెమెరా వర్క్ నిలబెట్టింది. మ్యూజిక్ పర్వాలేదు. ఇంకా ఉత్కంఠని కలిగించడానికి స్కోప్ ఉంది కానీ ఆ స్థాయిని అందుకోలేదు నేపథ్య సంగీతం.

పాటలుల్లో “కోపాలు చాలండి శ్రీమతిగారూ.. కొంచెం కూలవ్వండి మ్యాడం గారు” అనే పాట బాగుంది. కథలో పీరియడ్ తగ్గట్టుగా పదాలు కూడా రెట్రో స్టైల్లో పడ్డాయి. రెండోది టైటిల్ సాంగ్. అది కూడా ఓకే.

సంభాషణలు మెచ్యూర్డ్ గా ఉన్నాయి. “ఒక్క రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు.. దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను” అనేది సందర్భోచితంగా ఉంటూనే ఒక వ్యక్తిత్వ వికాసం కొటేషన్ లా ఉంది.

“నేను అబద్ధం చెప్పలేదు. నిజాన్నే తెలివిగా చెప్పాను”- ఈ డైలాగ్ కూడా చూసే క్రమంలో బాగుంది.

“ది ఇస్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిమీద కనపడాలి”– ఇది కూడా పర్ఫెక్ట్ లైన్.

ఎన్ని బాగున్నా సెకండాఫ్ తొలిసగాన్ని కొత్తగా నడపలేకపోయాడు. ఆ పార్ట్ అంతా రొటీన్ గా అనిపిస్తుంది. మధ్యలో ఒకచోట వచ్చే రఘుబాబు ట్రాక్ కన్విన్సింగ్ గా లేదు. అదొక్కటీ ఈ దర్శకుడి స్టాండర్డ్ లో ఇమడలేదు. అలాగే ద్వితీయార్ధంలో భాస్కర్ సడెన్ గా డబ్బు పొగరు చూపించే సన్నివేశాలు ఫ్లోలో సరిగ్గా జెల్ అవ్వలేదు. కొంచెం ఫోర్స్డ్ గా ఉంది. అలాగే సుమతి కూడా తన పచ్చళ్ల షాపుపై చూపించే కోపం కూడా అనవసరమనిపిస్తుంది.

దుల్కర్ ఇప్పటి వరకు తెలుగులో కనిపించిన మూడు చిత్రాలూ పీరియడ్ బ్యాక్ డ్రాపులే. మహానటి, సీతారామం.. తర్వాత ఇది. తన సటిల్ నటనతో మెప్పించాడు.

మీనాక్షి చౌదరి గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. బాల నటుడు కూడా బాగానే చేసాడు. తండ్రిగా కనిపించిన సర్వదమన్ బెనర్జీకి సెకండాఫ్ మధ్యలో వరకూ డైలాగులే లేవు. కానీ అక్కడి నుంచి కథని మలుపు తిప్పే విషయంలో తోడ్పడిన పాత్ర అది.

శరద్ ఖేదేకర్, టిన్ను ఆనంద్ ల డీసెంట్ గ్రే షేడ్ రోల్స్ బాగున్నాయి. సీబీఐ ఆఫీసర్ గా సాయికుమార్ ఓకే. రాంకీ ట్రాక్ కూడా బాగుంది.

చిత్రంలో హర్షద్ మెహరా పేరుతో ఒక పాత్ర ఉంటుంది కానీ ఆ పాత్ర మొహం కనపడదు. ప్రధాన కథంతా అతని నేపథ్యంలో ఉంటుంది.

చేసిన నేరం నుంచి తెలివిగా తప్పించుకోవడం, చేస్తున్న నేరంలో తీసుకునే జాగ్రత్త, చేయబోతున్న నేరానికి ముందుగానే రాసుకునే ప్రణాళిక.. ఇన్ని చేసినా ఎవరికీ నష్టం వాటిల్లకూడదనుకునే ఆలోచన, ప్రతి ఆర్ధిక నేరంలోనూ కేలిక్యులేషన్, అందులోనూ మానవతా దృక్పథం.. ఇవే ఈ చిత్ర కథానాయకుడిలోని లక్షణాలు. సగటు ప్రేక్షకుడికి నచ్చేలాగ, ఏ మాస్ హంగులూ లేకపోయినా మాస్ ఆడియన్స్ కి కూడా నచ్చుబాటయ్యేలా ఉంది. ఎందుకంటే సగటు మాస్ ప్రేక్షకుల్లో సామాన్యుడి నుంచి ధవవంతుడిగా ఎదిగిన వాళ్ల కథల్ని ఓన్ చేసుకుని, ఆ హీరో పాత్రలో తమని తాము ఊహించుకునే గుణం ఉంటుంది. దానిని కరెక్ట్ గా పట్టుకున్నాడు దర్శకుడు.

ఓవరాల్ గా చెప్పేదేంటంటే.. పైన చెప్పుకున్నట్టు ఒకటి రెండు చిన్న లోపాల్ని మినహాయిస్తే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే ఆస్కారం ఉంది. బ్యాంకింగ్, షేర్ మార్కెట్ మీద ఆసక్తి ఉన్నవాళ్లకి ఇంకాస్త ఎక్కువ నచ్చవచ్చు. మహానటి, సీతారామంతో హిట్లు కొట్టిన దుల్కర్ కి లక్కీ హ్యాట్రిక్ అవ్వడానికి పనికొచ్చే కంటెంట్ అయితే ఇందులో ఉంది. ఆపైన ప్రేక్షకుల దయ.

బాటం లైన్: లక్కీయే

31 Replies to “Lucky Baskhar Review: మూవీ రివ్యూ: లక్కీ భాస్కర్”

      1. ఇంట్లో ఆడవారిని అనవసరంగా మన కామెంట్స్ లోకి లాగవచ్చా? . ఆయనకు ఇష్టం లేదు. ఆయన కామెంట్ పెట్టారు. దానికి మీ లాజికల్ అండ్ కన్విన్సింగ్ ఆన్సర్ ఉంటే సమాధానం చెప్పండి. దయచేసి ఇంట్లోని ఆడవారిని మన కామెంట్స్ యుద్ధం లోకి లాగకండి

    1. ఎవడైతే మనకేంటి? బాగుంటే చూద్దాం. లేదంటే లేదు. ఈ సంకుచిత భావాలు వదిలేయండి సర్.

      1. తెలుగు హీరోలు అతి దరిద్రమైన హిపోక్రసీ ఉన్న వాళ్ళు… ఇలాంటి హీరో పాత్రలు చెయ్యలేరు…. వేరే భాష వాడు చేస్తే ఏడుపు… తొక్కేద్దామనే నీచమైన మెంటాలిటీ…. అందుకే స్టోరీ బాగున్న డబ్బింగ్ సినిమాలు హిట్ అవుతున్నాయి

        1. మన వారిని అనకండి సర్. మనవారు చేస్తే మనం చూడం. పరభాషా హీరోలు చేస్తే ఆహా ఓ హో అని చూస్తాం. మనవారు చేయలేరు అని పెడబొబ్బలు పెడతాం. వారి వారి ఇమేజ్ ను బట్టి సినిమాలు చేసుకు పోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉండాలి. మనల్ని entertain చేయాలి.

      1. దుల్కర్ గారు… Choose చేసుకుని ముస్లిం ఫ్యామిలీ లో పుట్టలేదు కదా? ఆయన ఎప్పుడూ మన దేవుళ్ళని గానీ… దేవాలయాలనుగానీ…. ఆచార వ్యవహారాలను గానీ కించపరిచిన దాఖలాలు ఉన్నాయా? ఆయన వృత్తి సినిమాలలో నటించడం. ఆయన అదే చేసి నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారు. సినిమా బాగలేకపోతే మనం చూడం కదా? అలాంటప్పుడు ఎందుకు ఈ ….మ…త …ద్వే…షా…లు?

  1. మా పావలా అన్నయ్య ఇలాంటి సినిమాలకు కనీసం బెస్ట్ విషెస్ చెప్పడు. గల్లా జయదేవ్ కొడుక్కి,చంద్రబాబు మనవడికి,బూతు రాధాకృష్ణ మనవరాలు కు మాత్రమే విషెస్ చెపుతాడు.

    వాడు బానిస బతుకు తగ్గలేయా

    1. పరిచయం ఉన్నవారికి మాత్రమే చెప్తారు గానీ.. పోలో మని అన్నిటికీ అందరికీ చెప్పరు. ఆయనకి సినిమా బాగుందన్న విషయం తెలిస్తే… చెప్పాలి అనిపిస్తే చెప్తారు.

  2. greatandhra వారికి నచ్చినట్టు తీయగలిగే మాగోడు ఇంకా పుట్టలేదు మిత్రమా ! దేవుడా ఎక్కడ ఉన్న మావాడికి నచ్చేటట్టు తీసే మాగోడిని పుట్టించు స్వామి

Comments are closed.