దీపావళి సినిమాలకు ఇకపై అదే కీలకం

దీపావళి సినిమాలు పోటాపోటీగా నడుస్తున్నాయి. ఇప్పటివరకు అన్నీ ఓకే. మరి రేపట్నుంచి ఏంటి పరిస్థితి? ఏ సినిమాకు నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? సరిగ్గా ఇక్కడే టికెట్ రేట్లు కీలకంగా మారబోతున్నాయి. Advertisement సినిమా…

దీపావళి సినిమాలు పోటాపోటీగా నడుస్తున్నాయి. ఇప్పటివరకు అన్నీ ఓకే. మరి రేపట్నుంచి ఏంటి పరిస్థితి? ఏ సినిమాకు నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? సరిగ్గా ఇక్కడే టికెట్ రేట్లు కీలకంగా మారబోతున్నాయి.

సినిమా టాక్ సంగతి పక్కనపెడితే, క్షేత్రస్థాయిలో ‘క’ సినిమాకు ఆక్యుపెన్సీ ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి కారణం ఈ సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉండడమే. హైదరాబాద్ లోని మ్యాగ్జిమమ్ మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా టికెట్ ధర 200 రూపాయలు మాత్రమే. ఇక సింగిల్ స్క్రీన్స్ చూసుకుంటే 150 రూపాయలు.

ఏపీలో మరీ ముఖ్యంగా సీడెడ్ లో ‘క’ సినిమా టికెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు గట్టిగా చేసిన ప్రమోషన్, పాజిటివ్ మౌత్ టాక్ తోడవ్వడంతో హౌజ్ ఫుల్స్ కనిపిస్తున్నాయి.

కిరణ్ అబ్బవరం సినిమాతో పోల్చి చూస్తే ‘లక్కీ భాస్కర్’ సినిమాకు టికెట్ రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని చాలా మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా టికెట్ ధర తక్కువలో తక్కువ 300 రూపాయలుంది. ఏఎంబీతో పాటు మరికొన్ని మాల్స్ లో 350 రూపాయలుంది. అటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా కనీస ధర 175 రూపాయలుంది.

ఇక ‘అమరన్’ సినిమా విషయానికొస్తే.. శివకార్తికేయన్, సాయిపల్లవి నటించిన ఈ సినిమాకు కూడా ‘క’ తరహాలోనే మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు టికెట్ ఉంది. అందుకే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.

రేపట్నుంచి ఈ సినిమాలు నిలబడాలంటే.. ‘క’ సినిమా మేకర్లు మల్టీప్లెక్సులపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. వీలైతే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ పెంచుకోవాలి. ‘లక్కీ భాస్కర్’ సినిమా నిలదొక్కుకోవాలంటే అర్జెంట్ గా టికెట్ రేట్లు తగ్గించుకోవాలి. అమరన్ సినిమాకు ఆల్రెడీ సింగిల్ స్క్రీన్స్ ఎక్కువగా ఉన్నాయి. రేట్లు అందుబాటులో ఉన్నాయి.

5 Replies to “దీపావళి సినిమాలకు ఇకపై అదే కీలకం”

  1. First don’t watch the films of the producer .luck bhasker.he is saying why can’t a family spend money to watch movie in theatre .he will give high memuration to heros and common people must suffer aa.first decrease the the ticket rate

  2. లక్కీ భాస్కర్ సినిమా నటి నటులు ఫేమస్ కాకపోవడం కూడా ఒక కారణం అవుతుంది ఏమో, మా ఊరి పక్క రెండు థియేటర్లు ఉంటే లక్కీ భాస్కర్ కాకుండా మిగతా రెండు సినిమాలు వేస్తున్నారు!

Comments are closed.