బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమా టైసన్ నాయుడు. ఎప్పటి నుంచో నడుస్తోంది.. నడుస్తోంది. వున్నట్లుండి హీరో సహకరించడం లేదు అంటూ వార్తలు వచ్చేసాయి. గమ్మత్తేమిటంటే అసలు వాస్తవం వేరు. నిర్మాతలే ఈ సినిమాను మెల్లగా ముందుకు నడిపిస్తన్నారు అన్నది వాస్తవం.
ఎందుకు అలా అంటే… ముందుగా కావాల్సింది పెట్టుబడి. ఫైనాన్స్ ఎలాగూ తప్పదు. వడ్డీలు కట్టాలి. సినిమా నాన్ థియేటర్ అమ్ముడు అయితే ఓ భరోసా, ధీమా వుంటుంది. నిర్మాతలు సినిమాను అమ్మాలి అంటే దానికి కూడా దన్ను వుండాలి. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటూ పరుగెత్తుకు వచ్చి కొనేయరు కదా?
ఇదే నిర్మాతలకు బాలయ్యతో అఖండ 2 సినిమా కూడా వుంది. అది కనుక సెట్ మీదకు వెళ్తే నాన్ థియేటర్ హక్కులు హాట్ కేక్ మాదిరిగా వెళ్లిపోతాయి. అదే సమయంలో టైసన్ నాయుడు ను లింక్ చేస్తే ఓ పనైపోతుంది. కానీ అప్పటి దాకా సినిమాను చకచకా పూర్తి చేసేసి ఏం చేసుకోవాలి? మార్చి దాకా డేట్ లు లేవు. ఒటిటి వాళ్ల దగ్గర కూడా డేట్ లు లేవు.
పెట్టుబడి పెట్టేసి పూర్తి చేసేసి, వడ్డీలు కట్టుకుంటూ కూర్చోవాలి. అందుకే నిర్మాతలు అలా అలా లేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మార్కెట్ లోకి ఎలా వెళ్లింది, హీరో బెల్లంకొండ సహకరించడం లేదు అని. కానీ ఇప్పుడు నిర్మాతలు కాదని కౌంటర్ ఇస్తారా? ఎందుకంటే నిజం ఎవరికి తెలిసినా తెలియకున్నా, వారికి తెలుసు కనుక.
Call boy jobs available 9989793850
vc estanu 9380537747