మహారాష్ట్రలో కూటమి పాలిటిక్స్ వలనో ఏమో కానీ ఏకంగా 50 మంది రెబెల్స్ బరిలో దిగడం గమనార్హం. శివసేన షిండే వర్గం, బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఒక కూటమిగా, కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మరో కూటమిగా ఈ ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే. ఇలా కూటములు కట్టడం వల్ల చాలా నియోజకవర్గాల్లో ఏదో ఒక పార్టీ లో నిరాశవహులు తయారయి ఉంటారని అనుకోవడానికి ఏమీ లేదు.
ఆల్రెడీ శివసేన, ఎన్సీపీలు చీలాయి, కాబట్టి అలా చాలా చోట్ల చెరో వైపున అవకాశాలు దక్కినట్టే! అయినప్పటికీ తమకు ప్రధాన పార్టీలు టికెట్లు ఇవ్వలేదనే కారణం చేత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్న వారి సంఖ్య 50 వరకూ ఉండటం గమనార్హం!
ఇలాంటి రెబెల్స్ బెడద అధికార కూటమికే ఎక్కువగా ఉండటం గమనార్హం. షిండే సేన, బీజేపీ, అజిత్ ఎన్సీపీల కూటమి పార్టీల నుంచి ఏకంగా 26 మందికి పైగా రెబెల్స్ బరిలో ఉన్నారట! ఈ మూడు పార్టీల తరఫున టికెట్లను ఆశించి, పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేసి రావడమో, తమ పార్టీ మరొకరికి అవకాశం ఇవ్వడం వల్లనో కానీ ఇంతమంది ఇండిపెండెంట్లుగా పోటీకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఆరు చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ అని ప్రకటించాయి. అలా ఆరు చోట్ల అదనపు అభ్యర్థులు, ఈ కూటమి తరఫున టికెట్లు దక్కకపోవడంతో 18 మంది రెబెల్స్ గా బరిలోకి దిగుతున్నారట!
ఇలా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో ఏకంగా 50 మంది ఇండిపెండెంట్లుగా, రెబెల్ జెండాలతో బరిలోకి దిగుతున్నారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో ఇలా ఏకంగా 50 చోట్ల ప్రధాన కూటముల్లోని పార్టీలకు రెబెల్స్ బెడద ఉండటం గమనార్హం. వీరు గనుక ప్రభావం చూపితే.. మొత్తం ఫలితాలే అటూ ఇటూ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయం చీలికలుపేలికలుగా ఉంది. ఎవరు ఎటో జనాలకే అంతుబట్టని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ చీలికల కూటమి రాజకీయంలోనూ మళ్లీ రెబెల్స్ అంటే ఇది పరాకాష్ట అనుకోవచ్చు. మరి ఈ పరాకాష్ట రాజకీయాలు ఎన్నికల్లో ఏ పార్టీలను దెబ్బతీస్తాయో!
Call boy works 9989793850
vc available 9380537747