అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించిన ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) ఇప్పుడు ఆ ఫలితాల్ని చూస్తోంది. ఏకంగా లక్షా 15వేల మంది అమెరికన్లు ట్విట్టర్ కు గుడ్ బై చెప్పినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న తర్వాత అత్యథిక సంఖ్యలో వినియోగదారులు ట్విట్టర్ ను వీడడం ఇదే తొలిసారి. మొన్నటివరకు వేల సంఖ్యలో ఉద్యోగులు ట్విట్టర్ ను బలవంతంగా వీడగా, ఇప్పుడు వినియోగదారులు స్వచ్ఛందంగా ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నారు.
ట్విట్టర్ కు బదులుగా బ్లూ స్కై లాంటి ప్రత్యామ్నాయ యాప్స్ వైపు యూఎస్ యూజర్లు మొగ్గుచూపుతున్నట్టు సీఎన్ఎన్ తన నివేదికలో వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ పక్షపాతంగా వ్యవహరించాడని, ఏకపక్షంగా ట్రంప్ కు మద్దతిచ్చాడని ఆరోపిస్తున్నారు ఈ యూజర్లు.
ఇప్పుడు చెప్పుకున్నది కేవలం డెస్క్ టాప్ యూజర్స్ మాత్రమే, మొబైల్ లో అన్-ఇనస్టాల్స్ లెక్క చూస్తే సంఖ్య ఇంకా భారీగా ఉండనుంది. దీనికి తగ్గట్టే.. గడిచిన 90 రోజుల్లో బ్లూస్కై యూజర్ బేస్ రెట్టింపు అయింది. గత వారం రోజుల్లోనే మిలియన్ కొత్త సైన్-అప్స్ వచ్చి చేరాయి.
బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ ది గార్డియన్ కూడా ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీకి ట్విట్టర్ లో 80కి పైగా ఖాతాలున్నాయి. 27 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
vc estanu 9380537747
మాస్క్ కి తిక్క రేగింది అంటే దానిని కూడా కొనేస్తాడు.