Matka Review: మూవీ రివ్యూ: మట్కా

హీరోని ఒప్పిస్తే సరిపోదు. ప్రేక్షకులని మెప్పించాలి. మొదటిది జరిగింది కానీ రెండోది జరగలేదు.

చిత్రం: మట్కా
రేటింగ్: 2/5
తారాగణం: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, సలోని అశ్వాని, సత్యం రాజేష్, రవిశంకర్, కిషోర్, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ తదితరులు
కెమెరా: ఎ కిషోర్ కుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
నిర్మాత: విజయేందర్ రెడ్డి తీగల, రజని తాళ్లూరి
దర్శకత్వం: కరుణ కుమార్
విడుదల తేదీ: 14 నవంబర్ 2024

రెండు వరుస పరాజయాల తర్వాత ఈ పీరియడ్ బ్యాక్డ్రాప్ చిత్రంతో ముందుకొచ్చాడు వరుణ్ తేజ్. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. హీరో లుక్ కూడా బాగుంది. అన్ని కమర్షియల్ హంగులు ఉన్న వినోదాత్మక చిత్రంలా అనిపించింది. నిర్మాణవిలువలు కూడా నిండుగా కనిపించాయి. చూసాక పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం.

లోపకికెళితే… ఇది 1958-1982 మధ్య విశాఖ కేంద్రంగా జరిగే కథ. వాసు (వరుణ్ తేజ్) బాల ఖైదిగా జైల్లో గడిపి యుక్తవయసు వచ్చాక జైల్లోంచి బయటపడిన వ్యక్తి. మొరటుతనం, కొట్టడం, చిన్నపాటి రౌడీయిజం అతని ప్రవృత్తి. దానికి తగ్గట్టే అతను విశాఖలో కూలీ పనితో మొదలుపెట్టి గ్యాంబ్లింగ్ కింగ్ గా ఎదుగుతాడు. తను ఆడించే ఆటకి పెట్టిన పేరు “మట్కా”. ఆ ఎదుగుదలలో నానినాబు (కిషోర్) అతనికి సాయపడతాడు. కెబి (జాన్ విజయ్) వాసుకి విరోధి. తన రౌడీయిజానికి ఎదురొచ్చినప్పటి నుంచీ వాసుని చంపాలని చూస్తుంటాడు కెబి. ఇదిలా ఉంటే వాసుకి ఒక వేశ్య (సలోని) చెల్లెలు (మీనాక్షి) పరిచయమవుతుంది. అది క్రమంగా ఇష్టంగా మారి ఆ ఇద్దర్నీ ఒకటి చేస్తుంది. గ్యాంబ్లర్ గా తన “మట్కా” సామ్రాజ్యాన్ని వాసు దేశమంతా ఎలా విస్తరింపజేసాడు చివరికి ఏమయ్యాడు అనేది కథ.

ఇదేమీ కొత్తకథ కాదు. ఈ రకం కథలు చాలానే చూసిన అనుభవముంది నేటి ప్రేక్షకులకి. తెలివైన ఫైనాన్షియల్ క్రైం చేయడం, కోట్లకు పడగలెత్తడం, తర్వాత దొరికిపోవడమో లేక ఉపాయంతో తప్పించుకోవడమో…ఇదే గ్రాఫ్. కొన్ని రోజుల క్రితం వచ్చిన “లక్కీ భాస్కర్”, వెబ్ సిరీస్ లో వచ్చిన “నార్కోస్”, రాబోతున్న “పుష్ప 2” అన్నీ ఇదే బాపతు. ఒకసారంటే కొత్తగా ఉంటుంది. పదే పదే చూస్తుంటే వెగటొస్తుంది. అలా వెగటు కలగకుండా ఆడియన్స్ ని మైమరిపించాలంటే నెరేషన్ కొత్త పుంతలు తొకాలి. భావోద్వేగాలు పెనవేయాలి. ఇది కచ్చితంగా చెప్పినంత తేలిక కాదు. చాలా కసరత్తు జరగాలి. కథనంలో గ్రిప్ ఉండాలి. కమర్షియల్ సినిమాకి కీలక కాంపోనెంట్ అయిన పాటలు, నేపథ్య సంగీతం సరైన స్థాయిలో సమకూరాలి. ఇక్కడదే పెద్ద మైనస్.

పేరుకే జీవీ ప్రకాష్. తనే కొట్టాడో, చేయి ఖాళీ లేక ఇంకెవరిచేతనైనా కొట్టించాడో కానీ అత్యంత దయనీయమైన పాటలు వినిపించాయి. లో బడ్జెట్ సి-గ్రేడ్ సినిమాల్లో కూడా ఇంతకంటే మంచి పాటలే ఉంటాయి. పీరియడ్ బ్యాక్ డ్రాప్ కనుక రెట్రో స్టైల్లో కంపోజ్ చెయగలిగే అవకాశం వచ్చినా నాసిరకం మ్యూజిక్ అందించాడు. మరి ఇదే సంగీత దర్శకుడు “లక్కీ భాస్కర్” లో రెట్రో స్టైల్లో చక్కని పాట చేసాడు. మరి ఇక్కడేమయ్యిందో తనకే తెలియాలి. కనుక సమస్య పూర్తిగా సంగీతదర్శకుడిదా లేక దర్శకుడి టేస్టా అనే డౌట్ కూడా వస్తుంది. పోనీ నేపథ్యసంగీతమన్నా అద్భుతమా అంటే అదీ కాదు. ఒక మూడ్ అయితే సెట్టయ్యింది కానీ మేజిక్ వర్కౌట్ కాలేదు.

ఈ సినిమాలో ఎవరి కష్టం ఎకువగా కనపడింది అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ ది. 1950లు 70లు నాటి వాతావరణాన్ని చూపించడానికి చాలా కష్టపడ్డారు. కెమెరా వర్క్ కూడా బాగుంది.

రచన విషయానికొస్తే సంభాషణలు కొన్ని మెచ్చుకోదగ్గవిధంగా ఉన్నాయి. కొన్ని పూర్తి వ్యతిరేకంగా విసిగించేలా ఉన్నాయి. అసలు ఇంటర్వల్ ముందు “చేప-కోతి” అంటూ ఒక సుదీర్ఘమైన మోనోలాగుంది. అదొక బ్రహ్మపదార్ధం. ఒకపట్టాన అర్ధమయ్యి చావదు. అర్ధమైనా కూడా, అక్కడ ఆ సోదంతా ఎందుకో అర్ధం కాదు. ఆ డైలాగుతోనే తల బొప్పి కడితే, సెకండాఫ్ చివర్లో మరొక సుదీర్ఘమైన మోనోలాగ్ “నక్క-మేక” కాన్సెప్టుతో ఉంది. అది హీరో తన కూతురిని ఒళ్లో పడుకోబెట్టుకుని చెప్పే కథ. ఆడియన్స్ కి జీవన్మరణసమస్య తీసుకొచ్చినంత పనిచేసాడు దర్శకుడు ఆ సుదీర్ఘ కథాప్రవాహంతో. ఎంత సేపటికీ ఎడతెగని ఆ కథకి బొప్పి కట్టిన ఆడియన్స్ తలలు ముక్కలయ్యే పరిస్థితి. కనీసం హీరో అయినా, ఎడిటర్ అయినా ఆ సీన్ చూసుకుని ఉంచాలా పీకాలా అనే నిర్ణయం తీసుకోలేకపోయారా అనిపిస్తుంది.

ప్రధమార్ధంలో మొదటి అరగంట బాగానే ఉన్నట్టు అనిపించినా ఇంటర్వల్ ముందు నుంచి సడెన్ గా స్లో అయిపోయిన ఫీలింగొస్తుంది. ద్వితీయార్ధంలో పరిస్థితి ఇంకా దిగజారి సినిమా ముగిసే ముందే హాలులోంచి వాకౌట్ చేసారు కొందరు.

వరుణ్ తేజ్ ఉన్నంతలో చాలా కష్టపడ్డాడు. కొంతవరకు మెథడ్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేసాడు. వాగ్నర్ మౌరాని అనుసరిస్తూ కాసేపు, క్లైమాక్స్ సీన్లో కింది పెదవిలో ఏదో డెంచర్ పెట్టుకుని గాడ్ ఫాదర్ లోని అల్ పచీనో టైపులో డైలాగ్ చెప్తూ కాసేపు తన కష్టమేదో తాను పడ్డాడు.

మీనాక్షి చౌదరిది చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు. చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆమె అక్కగా నటించిన సలోని మొహం మీద కెమెరా సరిగా నిలవనేలేదు. చాలా చిన్న పాత్ర ఆమెది.

విలన్ గా జాన్ విజయ్ ఓకే. కిషోర్ పాత్ర, నటన రెండూ పేలవంగానే ఉన్నాయి. జైలర్ గా రవి శంకర్ మొదటి సీన్లల్లొ లౌడ్ గా ఉన్నా, క్లైమాక్సులో డైలాగ్ లెస్ యాక్టరుగా కనిపించాడు. ఇతర నటీనటులంతా వారి వారి పాత్రల్లో ఓకే అనిపించుకున్నారు.

ఎన్నో అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు.. గొంతు తడారిపోయి గుటకలేస్తూ చూడాల్సి వచ్చింది ఈ చిత్రాన్ని. ఎంతో నమ్మకంగా ప్రమోట్ చేసిన వరుణ్ తేజ్ జడ్జ్మెంట్ కెపాసిటీపై అనుమానమొస్తుంది.

ఈ జానర్ సినిమాగా.. కథా క్రమంలో కానీ, కథనంలో కానీ ఏ మాత్రం కొత్తదనం లేని సగటు రొటీన్ చిత్రమిది.

హీరోని ఒప్పిస్తే సరిపోదు. ప్రేక్షకులని మెప్పించాలి. మొదటిది జరిగింది కానీ రెండోది జరగలేదు.

మేకింగ్ విషయంలో తీసినవాళ్ల కష్టం కనిపించింది కానీ, కంటెంటుతో చూసేవాళ్లకి ఇష్టం కలిగించలేకపోయింది ఈ మట్కా.

మ్యూజికల్ హిట్టైనా చేసి ప్రేక్షకులని హాలుకు లాక్కురాలేక, వచ్చిన కొద్దిమందినైనా మెప్పించలేక ..”నా ఘర్ కా నా ఘాట్ కా” అన్నట్టుంది ఈ “మట్కా”.

బాటం లైన్: నా ఘర్ కా నా ఘాట్కా

23 Replies to “Matka Review: మూవీ రివ్యూ: మట్కా”

  1. //ఎందుకు తెగాయి.. ఎందుకు తెగడం లేదు? //అనే ఆర్టికల్ కి ఆన్సర్ దొరికింది.

  2. ఒ రే య్ గ్యా స్ వె ధ వ …. * * మ ట్కా * మూ వీ బా గుం ది అ ని చె ప్పి న

    జనలా అ భి ప్రా యం. కం టే జ ల గ వే సే ఏం గి లి మె తు కు లు ఏ రు కు ని

    నీ అ భి ప్రా యం. ఎ వ డి కి. కా వా లి రా. ..

  3. అన్యాయం గా నాగ చైతన్య లాంటి వాళ్ళని పట్టుకొని nepotism తో హీరో లు అయ్యారు అంటారు కాని…

    1. ఇందులో అన్యాయం ఏముంది? రమేష్, బాలయ్య, మహేష్, చైతన్య, చెర్రీ , etc అందరూ nepotism వల్ల వచ్చిన వాళ్లే…… రుద్ధుడు హీరోలే అందరూ

  4. జ గ న్ గు ద్ద లో. గు న పం దిం పి న ప వ న్ క ళ్యా ణ్. పై న. గు ద్ద మం ట ఈ ఆ ర్టి క ల్

    క ని పి స్తుం ది. లే క పో తే. ,* కం గు వ. కం టే ఈ. మ ట్కా మూ వీ. అ ని

    ప్ర జ లు చె పు తుం టే. , మా కు. నీ అ భి ప్రా యం. దే ని కి. రా

  5. అయితే OTT కూడా వేస్ట్ అన్నమాట.. ఆర్మీ గోల ఇంక వీడు ఎలా తట్టుకుంటాడో.. అస్సలే ఇవ్వాళ చిల్డ్రన్ డే

  6. Most worst film…

    Varun Tej acting skills gurinche Antha thakkuva matladethey Antha manchedhe… Compare chaysthey Naga babu gadu better actor la unnadu veede kantey

    1. Kulapichi nee comments lo ne kanapadutundi, cinema bagokapaina bagundi ani chapter kulapichi lenatta. Konchem mind petti alochinchu, nee lanti vedavala valle cast feeling ekkuva avutunnai

Comments are closed.