దేవీ..’మైత్రీ’కి దూరమైనట్లేనా?

ఇప్పటికే హీరో నాని ఈ రెగ్యులర్ థమన్, దేవీ లను కాకుండా కొత్త పేర్లతో పని చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రామ్ కూడా ఆ దారిలోకి వచ్చాడు.

రామ్ పోతినేని కొత్త సినిమాకు మ్యూజిక్ ఎవరు. నిన్నటి వరకు ఇది క్వశ్చను మార్కు. ఇప్పుడు సమాధానం వచ్చేసింది. వివేక్-మెర్విన్ అనే తమిళ సంగీత ద్వయం ఆ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.

ఇది ఒక వార్త కాదు. రెండు వార్తలు ఎందుకంటే రామ్ పోతినేని సినిమాకు దేవీ సంగీతం అందిస్తారేమో అని అంతా ఎదురుచూసారు. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రెండు మూడు మంచి హిట్ లు వున్నాయి. పైగా మైత్రీ తో సినిమా అంటే దేవీకి చాన్స్ వుంటుందనే నమ్మకం.

కానీ ఇప్పుడు వేరే వాళ్లు ఆ ప్లేస్ లోకి మ్యూజిక్ డైరక్టర్లుగా వచ్చారు. అలా అని రామ్ కు అలవాటైన థమన్ నో, మణిశర్మనో కాదు. తెలుగు రంగానికి పూర్తిగా కొత్త వాళ్లు. అంటే దేవీని ఆప్షన్ లోకి తీసుకోలేదన్న మాట. యూజువల్ గా థమన్, మణి కాకుంటే రామ్ సినిమాలు ఎక్కువగా చేసింది దేవీనే.

ఇప్పటికే హీరో నాని ఈ రెగ్యులర్ థమన్, దేవీ లను కాకుండా కొత్త పేర్లతో పని చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రామ్ కూడా ఆ దారిలోకి వచ్చాడు. ఇప్పటికే సితార, హారిక హాసిని సంస్థలకు దేవీ దాదాపు దూరం అయ్యారు. ఇప్పుడు మైత్రీ. దీంతో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అది కూడా మంచిదే.

8 Replies to “దేవీ..’మైత్రీ’కి దూరమైనట్లేనా?”

  1. అవసరాల కోసం కుదిరే కాంబినేషన్స్ తప్ప ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ వుందరిక్కడ..

Comments are closed.