చెవిరెడ్డిపై పోక్సో కేసు!

త‌మ కుమార్తెపై అత్యాచారం జ‌రిగిన‌ట్టు చెవిరెడ్డి త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని బాధిత విద్యార్థి తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీల‌క నేత చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల చంద్ర‌గిరి నియోజ‌క‌వర్గ ప‌రిధిలోని య‌ర్రావారిపాలెం మండ‌లంలో ఓ ద‌ళిత బాలిక‌పై అత్యాచారం జ‌రిగిన‌ట్టు పెద్ద ఎత్తున వార్త‌లు ప్ర‌చారం అయ్యాయి. ఈ కేసు విష‌య‌మై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని పోలీసులు కేసు స‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.

త‌మ కుమార్తెపై అత్యాచారం జ‌రిగిన‌ట్టు చెవిరెడ్డి త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని బాధిత విద్యార్థి తండ్రి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. చెవిరెడ్డితో పాటు మ‌రికొంద‌రిపై పోక్సో కేసు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం.

ఇదిలా వుండ‌గా మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డితో మీడియా కేంద్రంగా చెవిరెడ్డి వాద‌న చేస్తున్న స‌మ‌యంలో కేసు న‌మోదు కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాగే చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని దంప‌తులు చెవిరెడ్డిని కేసుల్లో ఎలా ఇరికించాల‌నే ఎదురు చూస్తున్నార‌ని కొంత కాలం చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ద‌ళిత విద్యార్థినిపై అత్యాచారం జ‌రిగింద‌ని అస‌త్య ప్ర‌చారం చేశారంటూ చెవిరెడ్డిపై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ కేసు చెవిరెడ్డిని అరెస్ట్ చేసే వ‌ర‌కూ వెళ్తుందా? లేక మ‌రేమైనా పరిణామాలు చోటు చేసుకుంటాయా? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏది ఏమైనా కేసుల‌కు తాను ఎన్న‌డూ వెనుకాడ‌లేద‌ని నిన్న‌టి మీడియా స‌మావేశంలో చెవిరెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

12 Replies to “చెవిరెడ్డిపై పోక్సో కేసు!”

  1. ఒకటి గమనించారా…

    వైసీపీ నాయకుల మీద అక్రమాస్తుల కేసులు పెట్టడం లేదు..

    ఎందుకంటే.. దానికి వాళ్ళు “సిద్ధం” గానే ఉన్నారు.. జనాలకు కూడా ఈ కేసులు కొత్తా కాదు.. వింతా కాదు..

    అక్రమాస్తుల కేసులు సంవత్సరాల తరబడి నడుస్తాయి.. పైగా ఆ కేసులను అదేదో ప్రెస్టీజ్ గా ఫీల్ అయిపోతారు..

    ఇప్పుడు జగన్ రెడ్డి ఆస్థాన లాయర్లు కొత్త సెక్షన్ లు చదవాలి..

  2. Orey entira ee dharidralu..andhra emayina party valla sotha? All police working for these dummy cases..idiotic rules.police should spare their tine for people security ..idem karma ra..poye kalam vachinda enyi..aa babu putak mani pothe entra me gathi…nyayam ga palana cheyandra babu..sodi gola lekunda

  3. అయన బాలిక విషయం లో తప్పుగా ప్రచారం చేసుంటే శిక్ష అనుభవించాలి ఇందులో వేరే అభిప్రాయానికి తావు లేదు

  4. ఒక సాధారణ వీధి రౌడీ మీద పోక్సో కేసు ఆ అని రాసి సింపతీ ట్రై చెయ్యాల్సింది ఎంకటి

  5. ఒక-సాధారణ-వీధి-రౌడీ-మీద-పోక్సో-కేసు-ఆ-అని-రాసి-సింపతీ-ట్రై-చెయ్యాల్సింది-ఎంకటి

Comments are closed.