అవతలి నాయకుడు ఎంతటి వారైనా సరే.. ఏమాత్రం లెక్క చేయకుండా వ్యవహరించడంలో.. తాను చేయదలచుకున్నది మాత్రమే చేస్తానని.. ఎవ్వరి మాట వినబోయేది లేదని నిరూపణ చేయడంలో జేసీ బ్రదర్స్‌ను మించిన వారు లేరు. జేసీ దివాకర్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్న రోజుల్లో వారి రాజకీయం అంతే. ఇప్పుడు జేసీ ప్రభాకరరెడ్డి యాక్టివ్‌గా శాసిస్తున్న తరుణంలో కూడా అంతే. వారు చినబాబు లోకేష్ నైనా లెక్క చేయరు.. ఏకంగా చంద్రబాబును కూడా లెక్క చేయరు.. అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
ఆయన వల్ల రేకెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి ఇరుపక్షాలను సీఎంవోకు చంద్రబాబు పిలిపిస్తే, జ్వరంగా ఉంది రాలేను అని డుమ్మా కొట్టడమే కాకుండా తన డిమాండ్లు ఏమిటో ఒక లేఖ రూపంలో పంపి చేతులు దులుపుకోవడం తమాషా.
కడప ఆర్టీపీపీలో ఫ్లై యాష్ గురించిన వివాదం ఇది. ఆర్టీపీపీ నుంచి రెండు రకాల ఫ్లై యాష్ వస్తుంది. ఒకటి డ్రై ఫ్లై యాష్, రెండోది వెట్ ఫ్లై యాష్ అంటారు. ఫ్యాక్టరీ లోపలి వైపు డ్రై ఫ్లై యాష్ వస్తుంది. రోజుకు నాలుగు వేల మెట్రిక్ టన్నుల వరకు ఇలాంటిది తయారవుతుంది. దీనిని టన్ను రూ.416 వంతున దాదాపు 14 రకాల కంపెనీలు కొనుగోలు చేసి తీసుకువెళ్తాయి. రెండోది వెట్ ఫ్లై యాష్ ఫ్యాక్టరీ కాంపౌండ్ బయట పడేలా చేస్తారు. ఇది పూర్తిగా ఉచితం. దీనికోసమే ఇప్పుడు అధికార కూటమి నాయకులు కొట్టుకుంటున్నారు.
దీని మీద తనకు పెత్తనం కావాలని అధికార కూటమి పార్టీల నాయకులు కొట్టుకుంటున్నారు. ఈ వెట్ ఫ్లై యాష్ దందా దాదాపుగా రోజుకు రెండు లక్షల రూపాయల మేర లాభాలు ఆర్జించి పెడుతుందనేది అంచనా. అందుకోసమే నాయకులు ఇలా తగాదా పడుతున్నారు. అదంతా తనకే కావాలని.. తాను దానిని దూరంగా తరలించి అమ్ముకుంటాననే రీతిలో జేసీ ప్రభాకరరెడ్డి డిమాండు ఉంది. అయితే, అది స్థానికంగా మాకే కావాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన ఆదినారాయణ రెడ్డి, అక్కడి తెలుగుదేశం నాయకుడు భూపేష్ రెడ్డి పట్టుపడుతుండడంతో వివాదం ముదిరింది.
ఈ విషయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తొలుత రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. తర్వాత నారా లోకేష్ కూడా జోక్యం చేసుకున్నారు. ఫలితం లేదు. తీరా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురు నాయకుల్ని తన ఆఫీసుకు రమ్మని, సమస్య పరిష్కరిద్దామని పిలిపిస్తే ఇద్దరే వచ్చారు. జేసీ రాలేదు. తనకు జ్వరంగా ఉందని ఒక లేఖ పంపారు.
చంద్రబాబు ఆదేశాలు అయినా సరే తాను లెక్కచేసేది లేదని జేసీ ప్రభాకరరెడ్డి నిరూపించదలచుకున్నారా? అనేది ప్రశ్నార్థకం. లేదా చంద్రబాబునాయుడుకు పార్టీ మీద పట్టు సడలుతున్నదా? అనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.
చంద్రబాబునాయుడు పింఛన్ల పంపిణీ నిమిత్తం అనంతపురం జిల్లాలో పర్యటించనున్న సందర్భంలో జేసీతో మాట్లాడతారా? ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెడతారా? అనేది చర్చనీయాంశంగా ఉంది.
ఫస్ట్ పేరా లో, “అంతక ముందు జగన్ నీ కూడా లెక్కచెయ్యలేదు” అని రాసుండాల్సింది..మనసు రాలేదా?
full stop enduku, free money vastute kottukoni chaavaraa enty
Call boy jobs available 7997531004