బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమా రంగం అంటే ఏమో అనుకుంటున్నారు. వీళ్లు భారీ సినిమాలు తీస్తారు. పదుల కోట్లు, వందల కోట్లు నటులకు ఇస్తారు అని ఫిక్స్ అయిపోయినట్లుంది బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్. దాంతో ఎవరు ఏ సినిమా కోసం అడిగినా భారీ రేట్లు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ మధ్య పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అడిగితే ఎనిమిది కోట్లు అడిగినట్లు వార్తలు వచ్చాయి. దాంతో నిర్మాతలు వెనకడుగు వేసి రెండు కోట్లు ఇచ్చి శ్రీలీలతో అదే పాట చేయించుకున్నారు.
ఇప్పుడు మరో చాన్స్ కూడా శ్రద్ద కపూర్ వదులుకున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా సుధాకర్ చెరుకూరి నిర్మించే శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం శ్రద్ద కపూర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ దానికి ఆమె చెప్పిన రెమ్యూనిరేషన్ విన్నాక మారు మాట్లాడలేదని తెలుస్తోంది. ఇప్పుడు కొత్త హీరోయిన్ ను ఎవరైనా తీసుకోవాలని చూస్తున్నారు.
శ్రద్ద కపూర్ రెండు అంకెల కోట్ల మేరకు అడిగినట్లు తెలుస్తోంది. అందుకే వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. నిజానికి శ్రద్ద మంచి చాన్స్ వదలుకున్నట్లే. నాని పక్కన చేసిన మృణాళ్ కు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. శ్రద్ద కూడా తెలుగులో కొన్నాళ్ల పాటు మంచి సినిమాలు చేసే అవకాశం వుండేది. కానీ ఇంత రేట్ కోట్ చేసారు అని తెలిసిన తరువాత మరే నిర్మాత కాంటాక్ట్ లోకి వెళ్లే అవకాశం తక్కువ.
Call boy jobs available 7997531004
deeni retu 10 kotla