ఇదిగో రాజాసాబ్… అదిగో టీజర్!

మారుతి- ప్రభాస్ కాంబినేషన్ లో తయరవుతున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా చిరకాలంగా షూటింగ్ లో వుంది. చిరకాలంగా హీరో లేని సీన్లు తీస్తూనే వున్నారు. ఇంకా తీస్తారేమో కూడా. అప్పడప్పుడు హీరో…

మారుతి- ప్రభాస్ కాంబినేషన్ లో తయరవుతున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా చిరకాలంగా షూటింగ్ లో వుంది. చిరకాలంగా హీరో లేని సీన్లు తీస్తూనే వున్నారు. ఇంకా తీస్తారేమో కూడా. అప్పడప్పుడు హీరో వచ్చి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఓ పోస్టర్, ఓ గ్లింప్స్ వచ్చాయి. సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే సినిమా మొత్తం సిజి వర్క్ లు వున్నాయి. పెద్ద సిజి బ్లాక్ లు వున్నాయి. అవి ఎప్పుడు వస్తాయి అన్నది క్లారిటీ వస్తే అప్పుడు రిలీజ్ అన్నది తెలుస్తోంది.

టీజర్ ను అమెరికాలో విడుదల చేయాలని, టైమ్ స్క్యేర్ దగ్గర ప్రదర్శించాలని చాలా ఆలోచనలు వున్నాయి. ఇప్పటి వరకు అయితే ఇంకా టీజర్ దిశగా ఆలోచనలు సాగడం లేదు. సినిమా టాకీ చాలా వరకు పూర్తయింది. కొన్ని ఫైట్లు చిత్రీకరించాల్సి వుంది. అలాగే పాటలు పెండింగ్ వున్నాయి. టాకీ, ఫైట్ల వరకు ఏదో విధంగా నెట్టుకు రావచ్చు. కానీ సాంగ్స్ అంటే హీరో పక్కాగా, కంటిన్యూగా డేట్ లు ఇవ్వాల్సి వుంటుంది.

థమన్ సంగీతంలో పాటలు రెడీగా వున్నాయి. చిత్రీకరణ జరపాల్సి వుంది. అందువల్ల టీజర్ అన్నది వార్తల్లో వుంటూ వస్తుంది. టీజర్ మీద ప్రస్తుతానికి ఏ ఐడియా లేదన్నది నిర్మాణ, దర్శకత్వ వర్గాల ద్వారా తెలుస్తున్న మాట.

3 Replies to “ఇదిగో రాజాసాబ్… అదిగో టీజర్!”

Comments are closed.