సినిమాలు ఓకే.. సెల్ఫీలు ఎక్కడ!

హీరోలతో పోలిస్తే హీరోయిన్లు బిజీగా ఉంటారు. చకచకా సినిమాలు చేస్తుంటారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం పూర్తిగా భిన్నం. ఏళ్లుగా రెండే సినిమాలపై ఆమె వర్క్ చేస్తోంది. ఒకటి రాజా సాబ్. ఇంకోటి హరిహర…

హీరోలతో పోలిస్తే హీరోయిన్లు బిజీగా ఉంటారు. చకచకా సినిమాలు చేస్తుంటారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం పూర్తిగా భిన్నం. ఏళ్లుగా రెండే సినిమాలపై ఆమె వర్క్ చేస్తోంది. ఒకటి రాజా సాబ్. ఇంకోటి హరిహర వీరమల్లు.

ఈ రెండు సినిమా యూనిట్లకు అందుబాటులో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడు కోరితే అప్పుడు సెట్స్ పైకి వస్తోంది. యూనిట్ కు అన్ని విధాలా సహకరిస్తోంది.

దాదాపు మూడేళ్లుగా హరిహర వీరమల్లు సినిమాపై ఉంది నిధి. అటు రాజాసాబ్ సినిమాతో కూడా చాన్నాళ్లుగా ట్రావెల్ చేస్తోంది. ఇప్పటికీ ఈ సినిమాల షూటింగ్స్ నడుస్తున్నాయి.

తాజాగా పవన్ మరోసారి హరిహర వీరమల్లు సెట్స్ పైకి వచ్చారు. అటు ప్రభాస్ కూడా టైమ్ దొరికినప్పుడల్లా రాజాసాబ్ షూట్ కొనసాగిస్తున్నాడు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే. ఇన్నేళ్లుగా ఈ స్టార్ హీరోలతో పనిచేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క సెల్ఫీ కూడా వాళ్లతో దిగినట్టు పోస్ట్ చేయలేదు నిధి అగర్వాల్.

దీనికి సంబంధించి ఆసక్తికర ప్రకటన చేసింది నిధి అగర్వాల్. పవన్ తో నిన్ననే ఆమె సెల్ఫీ దిగిందంట. మంచి టైమ్ చూసి ఆ సెల్ఫీ పోస్ట్ చేస్తానని చెబుతోంది. ఇక ప్రభాస్ తో మాత్రం సెల్ఫీ పెండింగ్ లో ఉందని తెలిపింది.

ప్రభాస్ తో సెల్ఫీ దిగి చాలా రోజులైందని, త్వరలోనే ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తానని ప్రకటించింది. ప్రభాస్ ను అంతా ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో, అతడితో వర్క్ చేసిన తర్వాత తెలిసిందని, ప్రభాస్ మనసు నిజంగా బంగారం అని అంటోంది నిధి అగర్వాల్.

4 Replies to “సినిమాలు ఓకే.. సెల్ఫీలు ఎక్కడ!”

Comments are closed.