చిరంజీవి కూడా మారక తప్పని పరిస్థితి?

ట్రెండ్ కు తగ్గట్టు మారాల్సిందే. అది చిరంజీవి అయినా సరే. మెగాస్టార్ తన రూటు మార్చారు. ప్రస్తుతం నడుస్తున్న ‘వయొలెన్స్’ ట్రెండ్ లోకి చిరు కూడా వచ్చి చేరారు. తన సినిమాలో కూడా రక్తాన్ని…

ట్రెండ్ కు తగ్గట్టు మారాల్సిందే. అది చిరంజీవి అయినా సరే. మెగాస్టార్ తన రూటు మార్చారు. ప్రస్తుతం నడుస్తున్న ‘వయొలెన్స్’ ట్రెండ్ లోకి చిరు కూడా వచ్చి చేరారు. తన సినిమాలో కూడా రక్తాన్ని ఏరులై పారించాలని డిసైడ్ అయ్యారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారనే విషయాన్ని ఇది వరకే చెప్పుకున్నాం. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతోందనే అంశాన్ని మాత్రం ఎవ్వరూ గెస్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ క్లారిటీ కూడా వచ్చేసింది.

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమాను అధికారికంగా ప్రకటించారు. స్వయంగా నాని ఈ సినిమాను ప్రజెంట్ చేయబోతున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు.

ఎనౌన్స్ మెంట్ లో భాగంగా పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవి చేతుల మీదుగా రక్తం కారుతున్న స్టిల్ ను విడుదల చేశారు. “హింసలోనే అతడికి శాంతి” అనే క్యాప్షన్ ను కూడా జోడించారు. ఈ ఒక్క పోస్టర్ తో సినిమా జానర్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో చిరంజీవి ఇంత వయొలెన్స్ సినిమా చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన సలార్, యానిమల్ టైపులో ఫుల్ లెంగ్త్ వయొలెన్స్ ఉన్న సినిమాలు చేయలేదు. శ్రీకాంత్ ఓదెల సినిమా ఆ లోటును భర్తీ చేయబోతోంది,.

ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్టు సంగతులివే. నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న ఓదెల, అది పూర్తయిన వెంటనే చిరు సినిమా పని మొదలుపెడతాడు. ఇది అతడి డ్రీమ్ ప్రాజెక్టు.

16 Replies to “చిరంజీవి కూడా మారక తప్పని పరిస్థితి?”

      1. రెండింటి వల్ల వెర్రి పప్పలు అయేది ప్రజలే … జనం డబ్బు తో కోటీశ్వరులు అయేది వాళ్ళే .. ఇంకా తండ్రి తరువాత కొడుకు .. వాడి కొడుకు .. ఇలా సాగిపోతూ ఉంటుంది..

  1. మార్పు మంచిదే. మూస ధోరణిలో వెళ్లకుండా కాలం తో పాటు మనమూ మారాలి. అప్పుడే మన లక్ష్యాలను అందుకోగలం.

    All the best చిరంజీవి గారు.

  2. boss is great because he always adjusts to the times. Anduke ra Mega is Mega. Anduke politics lo kooda janasena ee saari 100% track record sadinchindi. next time CM kodutunnam. adi fix.

  3. మొత్తానికి మెగాస్టార్ లాంటివాడిని ఇప్పటి తరం తప్పుదారి పట్టిస్తుంది 80,90 ల కాలంలో ఎవరూ టచ్ చేయలేని రికార్డులు సొంతం చేసుకున్న ఆయనకు ఇప్పటి తరం హీరోలతో పోలిక ఏంటి ? అతను వయసు 70 సంవత్సరాలు.

Comments are closed.