ధర్మాన చూపు అటు వైపేనా?

జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర వేస్తారు అని అంటున్నారు.

వైసీపీలో సీనియర్లు కొందరు మౌనంగా ఉంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్లుగా కొన్నాళ్ళ పాటు ఉంటూ చివరికి తాము ఎన్నుకున్న పార్టీలలో చేరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ళ నాని అలా కొన్ని నెలల తరువాత తన నిర్ణయం ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం అయితే సాగుతోంది.

దాంతో మిగిలిన వారి మీద కూడా అందరి చూపూ పడుతోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా చాలా కాలంగా సైలెంట్ ని కొనసాగిస్తున్నారు. ఆయన కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

ఆయనకు వైసీపీ శ్రీకాకుళం ఇంచార్జి పదవిని ఆఫర్ చేసింది. అయితే ఆలోచించి చెబుతానని ఆయన అన్నట్లుగా ప్రచారం సాగింది. ఇప్పుడు ఆయన ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారు అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని ప్రచారం గతంలో సాగింది.

అయితే అక్కడ కింజరాపు కుటుంబం బలంగా పాతుకుపోయి ఉంది. దాంతో ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అని అంటున్నారు. ఇక మిగిలింది జనసేన లోకి వెళ్లడం అని అంటున్నారు. జనసేనలో అయితే పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర వేస్తారు అని అంటున్నారు. మంచి మాటకారిగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న నేతగా ఉన్న ధర్మానను చేర్చుకుంటే జిల్లాలో పార్టీ పటిష్టం అవుతుందని జనసేన పెద్దలు భావిస్తే కనుక గాజు గ్లాస్ ని ధర్మాన ఫ్యామిలీ పట్టుకుంటుంది అంటున్నారు.

వైసీపీ అయితే ధర్మానను వదులుకోవడానికి సిద్ధంగా లేదు అని అంటున్నారు. ఆయనకు ఉన్న అంగబలం అర్ధబలంతో ఆయనను పార్టీలో ఉంచాలనే చూస్తోంది. ప్రసాదరావు సోదరుడు క్రిష్ణ దాస్ వైసీపీకి జగన్ కి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఆయన ద్వారా కూడా రాయబారాలు చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు తమ కుమారుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. ఒకటి రెండు రోజులలో ఆయన మౌనం కూడా వీడి అసలు విషయం ఏమిటో చెబుతారని అంటున్నారు.

10 Replies to “ధర్మాన చూపు అటు వైపేనా?”

  1. అదేంటి 175/175 గెలిపించే సత్తా ఉన్న సింగల్ సింహం మీద నమ్మకం లేదా’ ధర్మానా?? ఇంత ఆధర్మంగా సింహాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా ధర్మమేనా ఇది??

  2. ఏదోఒకటి వేగంగా చెయ్యండి సర్..

    40% ఓటు షేర్ ఉన్న వైఎస్ఆర్సీపీ లు మిగిలిన కుర్రవాళ్ళకి అవకాశం వస్తాది…

  3. Darmana garu. Jagan age 51 & Chandra babu age 74. అయన term I Poysariki 78 . Kurchuntay & pandukolaydu. Kodukeymo pappu. Raji ukiyalalo undali anjlmtay. Meru cheypandi. ।।।।

    1. లెవె..నోడు కూడా పాపం పండి గాల్లోనే పోతాడేమో అని ఆలోచిస్తున్నాదనుకుంట ధర్మాన..

Comments are closed.