మొదటిసారి నేవీ డే మిస్

విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం ఒడిషాలో నిర్వహిస్తున్నారు.

నేవీ డే అంటే విశాఖలోనే. ఇది దాదాపుగా అయిదు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. దీనికి ఒక చరిత్ర ఉంది. 1971 డిసెంబర్ 4వ తేదీన భారత నావికాదళం పాకిస్తాన్ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపు దాడి చేసి ఒకేసారి మూడు ఓడలను ముంచి వేసింది.

పాకిస్థాన్- భారత్ ల మధ్య 1971లో ఆ రోజు రాత్రి సమయంలో ఈ యుద్ధం జరిగింది. ఆ రాత్రి భారత దళాలు చేసిన దాడిని “ఆపరేషన్ ట్రైడెంట్” అని పిలుస్తారు. ఆ తరువాత పాకిస్తాన్ ని భారత్ ఓడించింది. అది భారత్ కి దక్కిన ఘనమైన విజయంగా చూస్తారు.

దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో ప్రతీ ఏటా డిసెంబర్ 4న నావికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. ఇది క్రమం తప్పకుండా జరుగుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం ఒడిషాలో నిర్వహిస్తున్నారు. పూరీలో వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

విశాఖలో జరిగే వేడుకలకు లక్షలాది మంది ఏటా తరలివచ్చేవారు. యుద్ధ నౌకలతో హెలీకాప్టర్ విన్యాసాలతో సం మెరైన్లతో సైనికులు చేసే యుద్ధ రీతులతో అద్భుతంగా ఉంటుంది. తూర్పు నావికాదళం నిర్వహించే ఈ వేడుకలు ఎపుడూ కన్నుల విందుగా ఉంటాయి. తొలిసారి మాత్రం విశాఖను దాటి ఈ వేడుకలను ఒడిషాలోని పూరీలో నిర్వహిస్తున్నారు. దాంతో ఇంత మంచి ఉత్సాహపూరితమైన వేడుకను విశాఖ వాసులు మిస్ అవుతున్నారు.

5 Replies to “మొదటిసారి నేవీ డే మిస్”

Comments are closed.