పుష్ప 2 స్కోర్… ఆ ఇద్దరిదే!

పుష్ప 2 సినిమా ఇద్దరు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను వాడారని తెలుస్తోంది. ఒకటి శామ్ సిఎస్ ఇచ్చింది, రెండు దేవీ చేసినది.

కొద్ది రోజుల క్రితం ఉన్నట్లుండి వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడం లేదు. థమన్ రంగంలోకి దిగాడని. దానికి తోడు థమన్ కూడా ఎక్కడికే వెళ్లినా అదే ప్రశ్న ఎదురైంది. థమన్ కూడా పాజిటివ్‌గానే సమాధానం చెప్పాడు. సినిమా చూశానని, అదిరిపోయిందని లీక్ ఇచ్చేశాడు.

ఇదిలా ఉండగానే మరో ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లు కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు వర్క్ చేస్తున్నారని వార్తలు వినవచ్చాయి. శామ్ సిఎస్, అజనీష్ లోక్‌నాథ్ ఇద్దరూ మంచి స్కోర్ ఇవ్వడంలో పేరున్నవారు కాబట్టి వారిని కూడా తీసుకువచ్చారనేది వార్త. ఈ వార్తలన్నీ ఇలా ఉండగానే సినిమా విడుదల తేదీ గంటల్లోకి వచ్చేసింది.

నిన్నమొన్న ప్రీరిలీజ్ మీట్‌లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ పుష్ప 2 క్లైమాక్స్‌కు దేవీ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం అని ప్రశంసించారు. దేవీ తనకు ప్రేమతో సంగీతం ఇస్తాడని హీరో బన్నీ అన్నారు. ఇవన్నీ ఇలా ఉండగా, తెలిస్తోందేమిటంటే పుష్ప 2 సినిమా ఇద్దరు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను వాడారని తెలుస్తోంది. ఒకటి శామ్ సిఎస్ ఇచ్చింది, రెండు దేవీ చేసినది.

థమన్ ఎంతవరకు చేసారో, చేయలేదో, లేదా చేసినది పక్కన పెట్టారో క్లారిటీ రావాల్సి ఉంది.

11 Replies to “పుష్ప 2 స్కోర్… ఆ ఇద్దరిదే!”

Comments are closed.