పుష్ప-2.. దర్శకుడు చెప్పిన ఇడ్లీ కథ

కాంట్రవర్సీ ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు వర్మ. ఆ వివాదాన్ని క్యాష్ చేసుకొని, తనవైపు ఎటెన్షన్ తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పుష్ప-2 టికెట్ రేట్ల వైపు వచ్చాడు. భయంకరంగా…

కాంట్రవర్సీ ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు వర్మ. ఆ వివాదాన్ని క్యాష్ చేసుకొని, తనవైపు ఎటెన్షన్ తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పుష్ప-2 టికెట్ రేట్ల వైపు వచ్చాడు. భయంకరంగా పెంచేసిన టికెట్ రేట్లపై తనదైన ఇడ్లీ విశ్లేషణ ఇచ్చాడు.

“సుబ్బారావు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ఇడ్లీ ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాళ్ల ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు. సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు అని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం.”

ఇలా సుదీర్ఘంగా తనదైన వాదన వినిపించాడు వర్మ. కార్లు, భవనాలు, బ్రాడెండ్ దుస్తుల రేట్లపై ఏడవనోళ్లు, సినిమా టికెట్ రేట్లపై ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించాడు. వర్మ వాదనపై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తోంది.

“హోటల్ లో ఇడ్లీ ఎప్పుడూ ఒకటే రేటు ఉంటుంది. తినాలా వద్దా అనేది వినియోగదారుడి ఇష్టం. మరి ఈ ఇడ్లీ (పుష్ప-2) ఏంటి ఒక్కో రోజు ఒక్కో రేటు ఉంది. అంటే రెండో రోజుకు చల్లారిపోయిన ఇడ్లీ పెడతారా? లేక చట్నీ లేకుండా ఉత్త ఇడ్లీ మాత్రమే ఇస్తారా..? వారం తర్వాత ఇడ్లీ తినడానికి వస్తే ఇడ్లీ ఇవ్వకుండా కేవలం చేతిలో చట్నీ పోస్తారా?” ఓ నెటిజన్ కౌంటర్ ఇది.

మరో ప్రేక్షకుడు స్పందిస్తూ.. ఇంతకంటే మంచి ఇడ్లీలు ఓటీటీలో ఉన్నాయని అన్నాడు. ఇతర హీరోల ఫ్యాన్స్ స్పందిస్తూ.. గతంలో తాము 500 రూపాయలకే బిర్యానీ (కల్కి, దేవర) తిన్నామని, వెయ్యి రూపాయలకు ఎవ్వడూ ఇడ్లీ తినడని అభిప్రాయపడ్డాడు.

సెవెన్ స్టార్ హోటల్ లో ఇడ్లీ తినలేని స్తోమత లేనోడు కాకా హోటల్ లో తింటాడు. మరి పుష్ప-2కు ఆ ఛాన్స్ ఎక్కడుంది? అన్ని థియేటర్లు, అన్ని క్లాసులు ఒకటే రేటు కదా అంటూ మరో వినియోగదారుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు.

“ఇడ్లీ మరీ అద్భుతంగా లేకపోయినా సరే ఓసారి టేస్ట్ చేద్దామని చాలామంది అనుకుంటారు. వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇడ్లీ మొదటి రోజుకే టేస్టుగా లేదని టాక్ వస్తే మాత్రం.. అదే హోటల్లో ఈగలు తోలుకోవాలి.” అంటూ ఒకరు పోస్ట్ పెట్టారు.

సినిమా సక్సెస్ అవ్వాలంటే రిపీట్ ఆడియన్స్ చాలా ముఖ్యం. ప్రేక్షకుడు నుంచి ముందే వెయ్యి లాక్కుంటే, సినిమా ఎంత బాగున్నా వాడు రెండోసారి రాడు. అందుబాటు రేట్లు పెడితే, నచ్చినోడు రెండోసారి చూస్తాడు. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ కూడా రెండోసారి సినిమా చూడ్డానికి ముందుకురారు అనేది చాలామంది వెలుబుచ్చిన అభిప్రాయం.

వర్మ, తన కామెంట్స్ తో పుష్ప-2 కు మద్దతిచ్చానని అనుకున్నాడు. కానీ సినిమాపై నడుస్తున్న ట్రోలింగ్ ను అతడు మరింత ఎగదోసినట్టయింది.

17 Replies to “పుష్ప-2.. దర్శకుడు చెప్పిన ఇడ్లీ కథ”

  1. మనం cinema చూడకుంటే ఎవరికి నష్టం- నిర్మాత ki

    Cinema ఫ్లాప్ ithe ఎవరికి నష్టం- నిర్మాత ki

    First రోజు అంత రేట్లు పెట్టి సినిమా చూడకుంటే ఎవరికి నష్టం- నిర్మాత ki

    మరి….

    ఎవడైనా గొంతు మీద కత్తి పెట్టి first day 1500 petti cinema choodmani cheppda?? Uccha aagaka meeru kontunnaru …vadu ammutunnadu. Tappemundi.

  2. ముందు ఈడి ఇడ్లిలా సంగతి చోసుకోమను, ఈడి ఇడ్లిలు ఫ్రీగా ఇచ్చిన ఎవడు తీసుకోవట్లేదు.

  3. తప్పు ఎవరిది?

    మనదే

    ఎంత పెంచినా చూస్తారు అన్న ధైర్యం మనం ఇచ్చిందే. పెంచిన రేట్లతో ఎవ్వరూ చూడక పోతే

    రెండో ఆటకే తగ్గిస్తారు కదా.

  4. ఈ వే..ధ..వ, లెవెనోడు రేట్స్ తగ్గించాలని ఏడ్చినప్పుడు ఎక్కడ చచ్చాడు..? చచ్చు సన్నా…సి

Comments are closed.