అష్ట దిగ్బంధనమే: బాలినేని చాప్టర్ క్లోజ్ అయినట్టే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే.. ఆ పార్టీలో ఇన్నాళ్లు అనుభవించిన హోదాలను, పదవులను, వైభవాన్ని అన్నీ మరచిపోయి.. ఎంచక్కా పార్టీకి రాజీనామా చేసేశారు. Advertisement తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే.. ఆ పార్టీలో ఇన్నాళ్లు అనుభవించిన హోదాలను, పదవులను, వైభవాన్ని అన్నీ మరచిపోయి.. ఎంచక్కా పార్టీకి రాజీనామా చేసేశారు.

తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో తనకు ఆ పార్టీలో ఠికానా ఉండదని ముందుజాగ్రత్తతో.. సీనియర్ నాయకులకు గతిలేని జనసేనలో చేరారు. కానీ.. చేరికరోజునుంచి బాలినేనికి జనసేనలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయి.

తీరా ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తును పవన్ కల్యాణ్ అష్టదిగ్బంధనం చేసేశారు. ఇవాళ్టి పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి చాప్టర్ క్లోజ్ అయినట్టే అని పలువురు భావిస్తున్నారు.

ఎలాగంటే..

సోమవారం నాటి రాజకీయ పరిణామాల్లో పవన్ అన్నయ్య నాగబాబుకు చంద్రబాబు కేబినెట్లో బెర్త్ ఖరారు అయింది. ఆయనకు ముందు రాజ్యసభ సభ్యత్వం అనుకున్నారు. అందుకోసం పవన్ పావులు కదిపారు. అదే సమయంలో బాలినేనికి మంత్రి పదవి కట్టబెడతానని హామీ ఇచ్చి పవన్ కల్యాణ్ ఆయనను తన పార్టీలో చేర్చుకున్నారు.

కాకపోతే పార్టీలో చేరే సమయంలోనే అవమానించారు కూడా. బాలినేని అట్టహాసంగా తన బలప్రదర్శన చేస్తూ ఒంగోలు నుంచి పెద్ద కాన్వాయ్ తో రావాలనుకుంటే.. ఒక్కడే వచ్చి చేరాలని చివరి నిమిషంలో సందేశం పంపి.. ఇతర అనేక మంది చిల్లర నాయకులతో కలిపి బాలినేని కి కూడా కండువా వేయడం ద్వారా పవన్ తీవ్రంగా అవమానించారు. అయినా ఆ సందర్భానికి అంతకంటె బాలినేనికి కూడా గతి లేదు.

ఎటూ పవన్ తనకు మంత్రి పదవి ఇప్పిస్తాను అన్నారు కదాని.. బాలినేని వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణతో బేరం మాట్లాడుకుని ఆయనతో రాజీనామా చేయించి.. తనకోసం ఖాళీ తయారుచేసుకున్నారు. అందుకోసం భారీ ఆఫర్ తో ప్రలోభపెట్టారని గుసగుసలు ఉన్నాయి. ఆ దారిలో బాలినేని ఎమ్మెల్సీ అయితే.. మంత్రి పదవి ఇప్పించాలనేది తొలుత హామీ.

అయితే ఇక్కడే చంద్రబాబు చాణక్యనీతి పనిచేసింది. బాలినేనికి ఒంగోలులో తెలుగుదేశం వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వారంతా ఊరుకోరు. చంద్రబాబుకు ఈ లెక్కలు తెలుసు. అందుకే చక్రంతిప్పారు.

ఎటూ రాజ్యసభ సీటు బిజెపి తీసుకున్నది గనుక.. జనసేనకోసం చాలా కష్టపడి చాలా త్యాగాలు చేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇద్దాం అనే ఆఫర్ తెరమీదకు తెచ్చారు. పవన్ కాదనలేకపోయారు. నాగబాబులోనూ ఆశ పుట్టింది. ఆ రకంగా బాలినేని పేరు పక్కకు వెళ్లింది.

బాలినేని ఆల్రెడీ బేరం మాట్లాడుకున్న వెంకట్రమణ స్థానంలో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా ఇప్పుడు నాగబాబు పరం అవుతుంది. బాలినేని అవకాశాలు మూసుకుపోయినట్టే.

పవన్ ను నమ్ముకుని మంత్రి పదవి వస్తుందనుకుని.. వదలి వచ్చిన,ఇన్నాళ్లూ గౌరవం ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ ను నానా మాటలు అన్నటువంటి బాలినేని ఇప్పుడు ఆ పార్టీలోకి తిరిగి వెళ్లలేరు. అక్కడ రానివ్వరు. డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఇక్కడ కూటమిలో భవిష్యత్తుకు సమాధి కట్టేశారు.

అయినా బాలినేనికి గతిలేదు. చంద్రబాబు పన్నిన అష్టదిగ్బంధనంలో ఆయన సమిధ అయ్యారని అంతా అనుకుంటున్నారు.

38 Replies to “అష్ట దిగ్బంధనమే: బాలినేని చాప్టర్ క్లోజ్ అయినట్టే!”

  1. పిఠాపురం వర్మ కే ఇంకా న్యాయం జరగలేదు…బాలినేని సంగతి తర్వాత

    1. varma gaaniki settlement eppudo ayipoyindi. Settlement ante padavi okkate kaadu. Kabatti ikkada evadiki emi anyayam jaragaledu. All is good in pitapuram.

  2. బాలినేని కి మంత్రి పదవి ఇస్తారు అని నీ చెవిలో బాలినేని చెప్పారా లేక పవన్ కళ్యాణ్ చెప్పారా? నువ్వూ… నీ రాతలు! ఇకనైనా ఊహాలోకం నుండి వాస్తవ ప్రపంచంలోకి దిగి రా… బాలినేని కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవికి ఏవిధంగా అర్హుడని హామీ ఇస్తారనుకున్నావ్?

  3. Red gaaniki deenikante ekkuva importance ivatam waste. Vallaki there is no political space in AP and they have no other option but to join Janasena for any political survival. Party lo vunte eppudo okappudu choosi seat istham. Appati varaku ongole lo party kosam kashta padi choopinchamanu.

  4. ఒకరికి పదవి వస్తే ఆనందపడాలి, ఈ వెబ్సైట్ న్యూస్ అండ్

    వ్యూస్ ఏంటో పదవి రానందుకు ఆనందపడుతున్నట్టుంటది..

  5. Please also let us know what all did JAGAN PROMISE to make SHARMILA WALK so long distance during the previous election camping which made him the C.M, WHAT PROMISES DID HE FAIL TO FULFILL which made CHELLI & AMMA to party ways with our JAGLAQ

  6. Sukhallo pogude vanni kastallo unnappudu vadilesina vallani eppudu nammakudadu.

    adi politics ayina , friendship ayina, business ayina..

    If Balineni didn’t do any wrongdoing, I don’t think he has to join in jsp even if there was powerful source

  7. Pk is not an administrative leader. He doesn’t get along …he doesn’t know how to talk with leaders..

    only emotions…in politics emotional leaders can’t survive long unless they get along and being less emotional.

    bjp also knows this…

  8. మంగళగిరి లో గెలిపిస్తే మంత్రిని చేస్తానని ఒకరిని వాడుకున్నది మరిచిపోతే ఎలా అండి..

  9. ja*** నవరంధ్ర దిగ్బంధనం అయ్యి పాలస్ లో దాక్కున్నట్లు వీడు ఎదో ఒకటి చేస్తాడులే, నువ్వు ఓ తెగ వర్రీ అవొద్దు !!

  10. ja*** న*వ*రం*ధ్ర ది*గ్బం*ధ*నం అయ్యి పా*ల*స్ లో దాక్కున్నట్లు వీడు ఎదో ఒకటి చేస్తాడులే, నువ్వు ఓ తెగ వర్రీ అవొద్దు !!

  11. బాలినేని కి ఎ పదవి ఇస్తాం అని ముoదుగా చెప్పలెదు. అయనకి జగన్ తొ ఉన్న విబెదాలతొ బయటనికి వచ్చారు! అయన కూడా ఎన్నికల అనంతరం ఒడిపొయి వచ్చారు కనుక అయనకు పదవి ఇవ్వరు అనది అయనతొ సహా అందరికీ తెలిసిందె!

    ఇక GA ఎదొ జగన్ ని వదిలితె వాళ్ళ చాప్టర్ క్లొజ్ అయినట్టె అనట్తు రాస్తుంది. అసలు ముందు Y.-.C.-.P, జగన్ లకె ప్రతిపక్షా హొదా కూడా లెకుండా అన్ని చాప్టర్లూ క్లొజ్ అయ్యి మూలన పడ్డారు.

  12. మావోడి ముందే ఎన్నో సందర్భాల్లో తల ఎగరేసిన బాలినేని గానికి పొగబెట్టి బైటకి వెళ్లేలా చేసి “భలి ఇచ్చిందే” మావోడే తెలుసా??

  13. Rey great Andhra నువ్వు ఆ వైసిపి కి అమ్ముడుపోయావు నువ్వు రాసేది అంత వైసిపి కి అనుకూలంగా వుంటుంది నువ్వు రాసేవి ఎవరు నమ్మరు అమ్ముడు పోయిన కుక్కవి గడిచిన 5 సంవత్సరాలు నువ్వు ఎన్ని కారు కూతలు కూసావో పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని తెలుసు చిల్లర నా కొడక తూ నీ బతుకుచేడా

Comments are closed.